హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Farmers Protest: ఢిల్లీ సరిహద్దుల్లో ఆగని రైతుల ఆందోళన.. ఎండ, కరోనాను లెక్క చెయ్యకుండా

Farmers Protest: ఢిల్లీ సరిహద్దుల్లో ఆగని రైతుల ఆందోళన.. ఎండ, కరోనాను లెక్క చెయ్యకుండా

రైతుల ఆందోళన (ప్రతీకాత్మక చిత్రం)

రైతుల ఆందోళన (ప్రతీకాత్మక చిత్రం)

Farmers Protest: 134 రోజులుగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. ప్రస్తుతం కరోనా కారణంగా కేంద్రం ఫోకస్ మొత్తం వ్యాక్సిన్ పైనే పెట్టింది. మరి రైతుల నెక్ట్స్ స్టెప్ ఏంటి?

Farmers Protest: కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ సంస్కరణ చట్టాలకు వ్యతిరేకంగా... ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ఆందోళన శనివారానికి 134వ రోజుకి చేరింది. నాలుగు నెలలుగా తాము శాంతంగా ధర్నా చేస్తుంటే కేంద్రం పట్టించుకోవట్లేదన్న రైతులు... ఇవాళ కుండ్లి, మనేసర్‌, పల్వాల్‌ (KMP) KGP నేషనల్ హైవేపై ధర్నా చేస్తున్నారు. శనివారం ఉదయం 8 గంటలకు మొదలైన ఈ ధర్నా ఆదివారం ఉదయం 8 గంటలవరకు కొనసాగిస్తామంని సంయుక్త కిసాన్‌ మోర్చా (SKM) ప్రకటించింది. ఈ ధర్నా కారణంగా... వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. చాలా మంది వేరే రూట్లలో గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. పోలీసులు కూడా ముందుగానే ప్రజలను అప్రమత్తం చెయ్యడం వల్ల... చాలా వరకూ ట్రాఫిక్ సమస్య రాకుండా చెయ్యగలిగారు.

చలికాలంలో గడ్డ కట్టే చలిలోనూ ఉద్యమం చేశామన్న రైతులు.. ఇప్పుడు ఎండలు, కరోనాను సైతం లెక్క చెయ్యకుండా ఆందళనలు కొనసాగిస్తున్నామని చెప్పారు. వచ్చే మూడు వారాల్లో ఆందోళనలను మరింత తీవ్రం చేస్తామన్నారు. ఇందుకు సంబంధించి సింఘూ సరిహద్దు దగ్గర రైతు సంఘాల నేతలు శుక్రవారం సమావేశమై కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. అందులో భాగంగా ఏప్రిల్ 13న ఖల్సా పంత్‌ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఢిల్లీ బోర్డర్‌లో నిర్వహిస్తామని తెలిపారు. జలియన్‌ వాలాబాగ్‌ ఘటన జరిగిన దినం సందర్భంగా అమరవీరుల త్యాగాల్ని స్మరిస్తూ కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. అలాగే 14న రాజ్యాంగ రక్షణ దినం, రైతు ఐక్యతా దినం జరుపుతామన్నారు.

తమ ఉద్యమంలో స్థానిక ప్రజల భాగస్వామ్యం, వారి అంకిత భావాన్ని గౌరవించడంలో భాగంగా ఈ నెల 18న స్థానిక ప్రజలను వేదికలపై సత్కరిస్తామని, ఆ రోజున రైతు ఉద్యమ వేదికలను నిర్వహించే బాధ్యత కూడా స్థానిక ప్రజలకే ఇస్తామని రైతు సంఘాల నేతలు తెలిపారు. ఈ నెల 20న ధన్నా భగత్‌ జయంతి సందర్భంగా ఆయన గ్రామం దోహా కలాన్‌ నుంచి ఢిల్లీ బోర్డర్‌కి మట్టిని తెస్తామనీ... ఆయన జ్ఞాపకార్థం తిక్రీ బోర్డర్‌ వేదికపై కార్యక్రమాలు జరుపుతామని తెలిపారు.

150 రోజుల కార్యక్రమాలు:

ఏప్రిల్ 24 నాటికి రైతుల ఆందోళనలకు 150 రోజులు పూర్తవుతాయి. ఆ సందర్భంగా వారం పాటూ ప్రత్యేక కార్యక్రమాలు జరిపేందుకు రెడీ అవుతున్నారు. వాటిలో రైతులతోపాటూ, కార్మికులు, విద్యార్థులు, యువత, ఉద్యోగులు, వ్యాపారులు ప్రజా సంఘాలు పాల్గొనేలా ప్లాన్ ఫిక్స్ చేశారు. ఏప్రిల్ చివరి వారం నుంచి దేశమంతా ఉద్యమాలు చేసేలా కొత్త కార్యచరణ రెడీ చేస్తున్నట్లు రైతు సంఘాల నేతలు తెలిపారు. తద్వారా తాము ఇప్పట్లో ఈ ఆందోళనలను విరమించే ప్రసక్తి లేదనే సంకేతాలు ఇచ్చారు.

ఇది కూడా చదవండి: Summer Bath: వేసవిలో స్నానం... ఈ 3 రకాల పద్ధతుల్లో చేస్తే ఆరోగ్యం...

ఈ ఆందోళనలకు కేంద్రం నిశితంగా గమనిస్తోంది. ప్రస్తుతం కరోనా కేసులు పెరుగుతుంటే... వ్యాక్సిన్ పంపిణీ, నైట్ కర్ఫ్యూలు, వీకెంట్ లాక్‌డౌన్లపై ఎక్కువ ఫోకస్ పెడుతోంది. మరి రైతుల ఆందోళనకు ముగింపు దొరికేది ఎప్పుడో.

First published:

Tags: Farmers Protest, New Agriculture Acts

ఉత్తమ కథలు