Home /News /national /

FARMERS PROTEST NO CONCLUSION IN 7TH ROUND TALKS BETWEEN CENTRE AND FARMER UNIONS SK

Farmers protest: ఏడో రౌండ్‌లోనూ అదే సీన్.. చర్చలు విఫలం.. మరి పరిష్కారం ఎలా.?

కేంద్రమంత్రులతో  రైతు సంఘాల చర్చలు

కేంద్రమంత్రులతో రైతు సంఘాల చర్చలు

Farmers Protest: చట్టాలకు సవరణలకు దిశగా కేంద్రం ప్రయత్నిస్తోందని..కానీ అసలు ఆ చట్టాలే వద్దని రైతు సంఘాల నేతు స్పష్టం చేశారు. ఏడోసారి కూడా చర్చలు విఫలం కావడంతో మరోసారి రైతులతో భేటీ కావాలని కేంద్రం నిర్ణయించింది.

    రైతులు బెట్టు వీడడం లేదు. కేంద్రం మెట్టు దిగడం లేదు. చర్చల్లో పురోగతి కనిపించడం లేదు. కేంద్ర ప్రభుత్వం, రైతుల సంఘాల మధ్య ఏడో దఫా చర్చలు జరిగినా.. ఇంకా పరిష్కారం దొరకలేదు. ఇవాళ జరిగిన భేటీ కూడా అసంపూర్తిగా ముగిసింది. దాదాపు 4 గంటల పాటు చర్చించినా ఫలితం లేకపోయింది. కొత్త చట్టాల్లో క్లాజ్ వైస్‌గా డిస్కస్ చేద్దామని.. అభ్యతరాలుంటే చెప్పాలని రైతు సంఘాల నేతలకు కేంద్రమంత్రులు సూచించారు. ఐతే క్లాజ్‌లతో సంబంధం లేదని.. చట్టాలను మొత్తం రద్దు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. చట్టాలకు సవరణలకు దిశగా కేంద్రం ప్రయత్నిస్తోందని..కానీ అసలు ఆ చట్టాలే తమకు వద్దని స్పష్టం చేశారు. ఏడోసారి కూడా చర్చలు విఫలం కావడంతో మరోసారి రైతులతో భేటీ కావాలని కేంద్రం నిర్ణయించింది. జనవరి 8న రైతు సంఘా నేతలను మరోసారి చర్చలకు ఆహ్వానించింది.

    సాగు చట్టాలలను పాయింట్ వైజ్‌గా చర్చించాలని మంత్రి కోరారు. కానీ మేం తిరస్కరించాం. పాయింట్ వైజ్‌గా చర్చించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మొత్తం చట్టాలనే వద్దని మేం డిమాండ్ చేస్తున్నారు. సవరణల దిశగా తీసుకెళ్లాలని కేంద్రం యోచిస్తోంది. కానీ మేం ఒప్పుకునే ప్రసక్తే లేదు. ఆ మూడు చట్టాలను రద్దు చేయాల్సిందే. అని భారతీయ కిసాన్ యూనియన్ నేత యుద్విర్ సింగ్ తెలిపారు.


    ''జనవరి 8న మరో సమావేశం జరుగుతుంది. మద్దతు ధరతో పాటు కొత్త చట్టాల రద్దుపై మరోసారి చర్చిస్తాం. చట్టాలను ఉపసంహరించుకునే వరకు మేం ఇళ్లకు వెళ్లబోమని కేంద్రానికి తెగేసి చెప్పాం.'' అని రైతు సంఘాల నేత రాకేశ్ టికైత్ పేర్కొన్నారు.


    ''మూడు చట్టాలను క్లాజ్ వైజ్‌గా చర్చిద్దామని రైతు సంఘాలను కోరాం. కానీ రైతులు ఒప్పుకోలేదు. మూడు చట్టాలను రద్దు చేయాలని కోరుతున్నారు. తదుపరి సమావేశంలోనైనా ఫలప్రదమైన చర్చలు జరుగుతాయని జరుగుతాయని ఆశిస్తున్నా. అప్పుడు ముగింపు లభిస్తుంది. అని వ్యవసాయమంత్రి నరేంద్రసింగ్ తోమర్ పేర్కొన్నారు.''


    మరోవైపు ఢిల్లీ సరిహద్దులో రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. నెల రోజులకుపైగా రోడ్డుపైనే ఉన్నారు. వేలాది రైతులు నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. చలి, వర్షాన్ని కూడా లెక్క చేయడం లేదు. తమ ఆందోళనల్లో భాగంగా మంగళవారం ఢిల్లీలో ట్రాక్టర్ల ర్యాలీని నిర్వహిస్తామని రైతు సంఘాల నేతలు స్పష్టం చేశారు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Agriculture, Farmers, Farmers Protest, New Agriculture Acts

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు