Home /News /national /

FARMERS PROTEST MISGUIDED STIR RUN BY SELF SERVING LEADERS THAT IS HELPING OPPOSITION FURTHER ITS ENDS NK

Farmers’ Protest: రైతుల ఆందోళనను పక్కదారి పట్టిస్తున్న నేతలు... ఇలాగైతే ఎలా?

రైతుల ఆందోళనను పక్కదారి పట్టిస్తున్న నేతలు... ఇలాగైతే ఎలా? (image credit - twitter - Aflatoon Wazir (Gobhi Parantha))

రైతుల ఆందోళనను పక్కదారి పట్టిస్తున్న నేతలు... ఇలాగైతే ఎలా? (image credit - twitter - Aflatoon Wazir (Gobhi Parantha))

Agriculture Reform Laws: రైతులు ఎంతో నిష్టగా చేస్తున్న ఆందోళనలు నీరుగారిపోతున్నాయా.... కొంతమంది నేతలు తమ స్వార్థం చూసుకుంటున్నారా? తెరవెనక ఏం జరుగుతోంది?

  Agriculture Reform Laws: ఢిల్లీలో విపరీతమైన మంచులో వేల మంది రైతులు ఎంతో నిష్టగా ఆందోళన చేస్తున్నారు. తమ ఆందోళన వల్ల ఎవరికీ నష్టం కలగకూడదన్న ఉద్దేశంతో... వారు భారత్ బంద్ కూడా ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకే జరిపారు. అలా ప్రశాంతంగా ఆందోళనలు చేస్తున్న రైతులతో కేంద్ర ప్రభుత్వం కూడా చర్చలు జరుపుతూ... సమస్యలకు పరిష్కారం దిశగా అడుగులు వేస్తోంది. రెండువైపులా ఈ ప్రక్రియ కొనసాగుతుంటే... రైతుల తరపున ప్రతినిధులుగా వెళ్లిన వారు సమస్యకు పరిష్కారం చూపడంలో ఫెయిలవుతున్నారు. మంగళవారం చర్చల ప్రక్రియ ఫెయిలయ్యాక... కొత్త వ్యవసాయ చట్టాలపై ఓ కమిటీని ఏర్పాటు చేయడానికి కేంద్రం ముందుకు రాగా... రైతుసంఘాల ప్రతినిధులు ఒప్పుకోలేదు. చిత్రమేంటంటే... ఈ రైతు సంఘాల ప్రతినిధులు తమను తాము నేతలలాగా భావిస్తున్నారు. వీరు ఉత్తర భారత్‌లోనే కాక విదేశాల్లోనూ తమకు సపోర్ట్ కూడగట్టుకుంటున్నారు. పక్కదారి పడుతున్న ఈ ఉద్యమానికి ఎన్నారైలు సపోర్టుగా నిలుస్తున్నారు. వారిలో ఒకరు కెనడా ప్రధానమంత్రి జస్టిన్ త్రూడ్యూ.

  మూడు కొత్త సంస్కరణ చట్టాల వల్ల రైతులు రోడ్డెక్కారు. అవి... రైతుల ఉత్పత్తి, వ్యాపారం, వాణిజ్యం (ప్రమోషన్ అండ్ ఫెసిలిటేషన్) చట్టం, రైతుల (సాధికారత, రక్షణ) ఒప్పంద చట్టం, నిత్యవసర సరుకుల (సవరణ) చట్టం. కఠినమైన కండీషన్లు పెట్టకుండా ఉన్న కండీషన్లను తొలగించడాన్ని రైతులు వ్యతిరేకిస్తున్నారు. ఈ కొత్త చట్టాలు రైతులకు స్వేచ్ఛనిస్తాయి. ఇదివరకు రైతులు తమ పంటలను మార్కెట్లలోనే తప్పక అమ్ముకోవాల్సిన పరిస్థితి. ఇప్పుడు ఎక్కడైనా, ఎవరికైనా అమ్ముకోవచ్చు. పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు రైతుల నుంచి ఎక్కువ మొత్తాలతో కొంటాయి. అలాంటి ప్రయోజనాలు రైతులకు లాభదాయకం.

  ఇది కూడా చదవండి:Solar Eclipse 2020: నేటి రాత్రి సూర్య గ్రహణం... ఆ సమయంలో ఇవి ముట్టుకుంటే అరిష్టమే

  మార్కెటింగ్ సంస్కరణలు ఇప్పుడు కొత్తగా నరేంద్ర మోదీ ప్రభుత్వం మాత్రమే తెచ్చినవి కావు. చాలా మంది నిపుణులు ఈ ప్రభుత్వంలో, గత ప్రభుత్వంలో ఉన్నవారు కూడా వీటికి మద్దతు ఇస్తున్నారు. ఉదాహరణకు ఆర్థిక సర్వే 2012-13... లిబరలైజేషన్ ప్రతిపాదించింది. వ్యవస్థీకృత మార్కెట్‌లో సంస్కరణల కోసం 2003లో మోడల్ అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ మార్కెటింగ్ (డెవలప్‌మెంట్ అండ్ రెగ్యులేషన్) (APMC)ని తెచ్చారు. ఈ చట్టంలో రాష్ట్రాలు మరికొన్ని మార్పులు చేసుకున్నాయి. కానీ చాలా రాష్ట్రాలు ఇంకా ఈ మోడల్ చట్టాన్ని అమలుచెయ్యలేదు. అందువల్ల ముందు ఈ ప్రక్రియ పూర్తికావాలి. తద్వారా రైతులకు ప్రత్యామ్నాయ మార్కెటింగ్ వ్యవస్థ లేదా... వారి పంటను వేరేచోట సరైన ధరకు అమ్ముకునేందుకు వీలవుతుంది.

  యూపీఏ పాలనలోని ఆర్థిక సర్వే ఏం ప్రతిపాదించిందో అదే దాన్ని మోదీ ప్రభుత్వం అమలుచేసింది. కానీ అదే కాంగ్రెస్ పార్టీ ఈ కొత్త చట్టాలను వ్యతిరేకిస్తోంది. "మోదీ ప్రభుత్వం రైతులను టార్చర్ పెడుతోంది. ముందుగా వాళ్లు నల్ల చట్టాలు తెచ్చారు. తర్వాత దౌర్జన్యంగా లాఠీ ఛార్జీ చేశారు. కానీ రైతులు తమ గళం వినిపించగానే.... దేశం మొత్తం వారికి అండగా ఉంది. స్పీక్ అప్ ఫర్ ఫార్మర్స్ క్యాంపెయిన్‌లో చేరండి. మన సోదర, సోదరీ రైతులను దోచుకునే విధానాన్ని వ్యతిరేకించండి" అని రాహుల్ గాంధీ హిందీలో ట్వీట్ చేశారు.

  ప్రియాంకా వాద్రా కూడా ఇలాంటిదే హిందీలో ట్వీట్ చేశారు. "పేరుకే ఇవి రైతుల చట్టాలు. ప్రయోజనాలన్నీ సంపన్నులైన స్నేహితులకే. రైతులతో చర్చించకుండా రైతుల చట్టాలు ఎలా చేస్తారు? వారి గోడు వినిపించుకోకుండా చట్టాలు చేయడమేంటి? ప్రభుత్వం రైతుల గోడు వినాలి. రైతులకు మద్దతిద్దాం. రైతుల తరపున మాట్లాడండి" అని ట్వీట్ చేశారు.

  ఇక రాజకీయ నేతలు తమ స్వార్థాలకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. చాలా మంది నేతలు... తమ తమ నియోజకవర్గాల్లో, తమ తమ రాష్ట్రాల్లో ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రజలకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. అదే సమయంలో రైతుల ప్రతినిధులు... ప్రొఫెషనల్ విప్లవకారుల్లా వ్యవహరిస్తున్నారు. చర్చలలో ప్రతీదీ వ్యతిరేకిస్తున్నారు. రైతుల తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న వారిలా వ్యవహరించట్లేదు.

  ఈ మొత్తం ఆందోళనల్లో రెండు అసత్యాలు ప్రచారం అవుతున్నాయి. ఒకటి... కనీస మద్దతు ధర అన్నదే ఉండదు. రెండోది కార్పొరేటర్లు ఎంటరై రైతులను దోచుకుంటారు. నిజానికి ఈ రెండూ నిజం కాదు. అసలు మద్దతు ధర అన్నది పెద్దగా ప్రభావం చూపే అంశమే కాదు. అందుకే నిపుణులు దీన్ని ప్రతిపాదించట్లేదు. ఎందుకంటే మొత్తం వ్యవసాయంలో మద్దతు ధర ఉంటున్నది 6 నుంచి 15 శాతం పంటలకే. అసలు మద్దతు ధర కోసం ప్రభుత్వం ఎలాంటి చట్టమూ చెయ్యాల్సిన పనిలేదు. కార్యనిర్వాహక ఆదేశాల ద్వారానే దాన్ని అమలు చెయ్యవచ్చు. కేంద్ర ప్రభుత్వం మద్దతు ధరను రద్దు చేస్తామని ప్రకటించలేదు. అలాంటి పరిణామాలూ లేవు. ప్రధానమంత్రి నరేంద్రమోదీకి తక్కువ కానీ ఓ వ్యక్తి మద్దతు ధర కొనసాగుతుందని హామీ ఇచ్చారు అయినా సరే ఆందోళనలు కొనసాగుతున్నాయి.

  కార్పొరేట్లు దోచుకుంటారు అనేది సమాజంలో ఉంటే ఓ భావన. చాలా మంది కార్పొరేట్లను వ్యతిరేకంగా చూస్తారు. నిజానికి అలాంటి పెద్ద మల్టీ నేషనల్ కంపెనీలే... రైతుల పంటలకు సరైన ధరలు ఇవ్వగలవు. వారే రైతులతో డీల్ కుదుర్చుకొని... రైతులకు ఉపాధి కల్పించి, ఆ పంటను కూడా వారే కొంటారు. దాని వల్ల రైతులకు ఉపాధి లభిస్తుంది. మంచి ఆదాయం వస్తుంది. దీని వల్ల రైతుల కుటుంబంలోని కొడుకులు, కూతుర్లు కూడా పెద్ద కంపెనీల్లో ఉద్యోగం పొందినట్లవుతుంది. దళారులతో సంబంధం లేకుండా ఎక్కువ ఆదాయం పొందేందుకు వీలవుతుంది. తమ ఉద్యోగులను ఆ కంపెనీలు బాగా చూసుకుంటాయి. ఇదో మంచి అవకాశమే.

  ఇది కూడా చదవండి:Basil Tree Benefits: తులసి మొక్క కింద ఇది పెట్టారంటే లక్ష్మీదేవి కటాక్షమే

  రచయిత ఓ ఫ్రీలాన్స్ జర్నలిస్ట్. ఇందులో అభిప్రాయాలు ఆయన వ్యక్తిగతం.
  Published by:Krishna Kumar N
  First published:

  Tags: New Agriculture Acts

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు