Punbab Farmers Chalo Delhi: ఢిల్లీ సరిహద్దులు రగిలిపోతున్నాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు చట్టాలను (Farm Laws) వ్యతిరేకిస్తూ పంజాబ్, హర్యానా సహా పలు రాష్ట్రాల నుంచి వేలాది మంది రైతులు ఢిల్లీ చలో కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ క్రమంలో వేలాదిగా రైతులు తరలివచ్చారు. అయితే, వారిని ఢిల్లీ సరిహద్దుల్లో పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో నిన్నటి నుంచి పోలీసులు, రైతుల మధ్య ‘యుద్ధ వాతావరణం’ నెలకొంది. నిరసన తెలుపుతున్న రైతులపై పోలీసులు బాష్పవాయువు గోళాలు ప్రయోగించారు. వాటర్ క్యానన్లతో వారిని చెల్లాచెదురు చేసేందుకు ప్రయత్నించారు. మరోవైపు రైతులు కూడా పోలీసులపై రాళ్లు రువ్వారని పోలీసులు తెలిపారు. ఆందోళనకారులను అడ్డుకునేందుకు పోలీసు బలగాలు పెద్ద ఎత్తున మోహరించాయి. ఢిల్లీలోకి నిరసనకారులను రానివ్వకుండా పెద్ద ఎత్తున రోడ్లపై ముళ్లకంచెలు వేశాయి. టియర్ గ్యాస్ ప్రయోగించాయి. మరోవైపు ఢిల్లీలోని 9 స్టేడియంలను తాత్కాలిక జైళ్లుగా మార్చేందుకు అనుమతి ఇవ్వాలంటూ ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఢిల్లీ పోలీసులు కోరారు. రైతుల ఆందోళనల నేపథ్యంలో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలు మెట్రో రైలు సర్వీసులు కూడా నిలిచిపోయాయి.
సుప్రీంకోర్టులో జగన్‌కు డబుల్ బొనాంజా.. మరో గుడ్ న్యూస్
Cyclone Nivar: ఏపీలో ఈ 4 జిల్లాల్లో అతి తీవ్ర భారీ వర్షాలు
Health Tips: మీ లైంగిక జీవితాన్ని మెరుగుపరిచే 7 ఉత్తమ మార్గాలు
ఢిల్లీ చలో కార్యక్రమాన్ని రైతులు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కనీసం ఓ నెల రోజులు ఢిల్లీలో నిరసనలు చేసేందుకు కూడా సిద్ధమయ్యారు. అందుకు అనుగుణంగా రైతులు తమ వెంట భారీ వంట సామగ్రి, నిత్యావసర సరుకులు కూడా తెచ్చుకుంటున్నారు. పెద్ద పెద్ద ట్రాక్టర్లలో వంట సామగ్రి కూడా వారి వెంట ఉంది. ‘మేం ఢిల్లీలో అడుగు పెడతాం. రైతుల వ్యతిరేక చట్టాలను మార్చే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తాం. దేశానికి తిండి పెట్టే రైతులకు ఢిల్లీలోకి తూటాలతో స్వాగతం పలికారు పోలీసులు.’ అని సింఘు బోర్డర్‌లో ఓ రైతు అన్నాడు.
గ్రానైట్‌లా తళతళలాడేవాడు.. ఆమెపై వ్యామోహం.. అతణ్ని చంపేసింది.. ఖమ్మం జిల్లాలో క్రైం కహానీ
Tirupati ByPolls: పవన్ కళ్యాణ్‌కు షాక్ ఇస్తున్న బీజేపీ, తిరుపతి బీజేపీ అభ్యర్థి ఖరారు?
మోదీ, జగన్ ‘ట్రెండ్ సెట్టర్స్’.. సోషల్ మీడియాలో దుమ్మురేపిన లీడర్స్.. ర్యాంక్స్ ఎంతంటే
మరోవైపు రైతులను ఢిల్లీలోకి అనుమతించి వారితో చర్చలు జరపాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్. ‘కండబలంతో రైతుల గొంతు నొక్కొద్దు. వారి ఆందోళనలను అర్థం చేసుకోండి. కేంద్ర ప్రభుత్వం రైతు సంఘాల నేతలతో చర్చలు జరపాలి. వారి ఆవేదనను వినాలి. ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్రిక్తతలను తగ్గించాలి. పరిస్థితి చేయిదాటిపోయేలా ఉంటే, డిసెంబర్ 3 దాకా ఎందుకు ఆగాలనడం ఏంటి?’ అని పంజాబ్ సీఎం ఓ ప్రకటనలో కేంద్రాన్ని కోరారు.
వైఎస్ షర్మిలతో వైసీపీ ఎమ్మెల్యే రోజా... ఏం జరుగుతోంది?
Vizag Steel Plant: వైజాగ్ స్టీల్ ప్లాంట్ లోపల ఇలా ఉంటుంది..
ఇక రైతుల ఆందోళనలు విరమించాలంటూ హర్యానా సీఎం కోరుతున్నారు. నిరసనలతో సమస్యలు పరిష్కారం కావని, చర్చలు జరిపేవరకు ఆందోళనలను విరమించాలని కోరారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Farmers, Farmers Protest, Haryana, Punjab