Home /News /national /

FARMERS PROTEST FARMER UNIONS ANNOUNCE HUNGER STRIKE ON DEC 14 TRACTOR MARCH TO BLOCK JAIPUR DELHI ROAD TOMORROW SK

Farmers Protest: కేంద్రానికి రైతుల డెడ్‌లైన్.. దిగిరాకుంటే ఆమరణ నిరాహార దీక్షే

రైతుల ఆందోళన

రైతుల ఆందోళన

డిసెంబరు 19 లోపు తమ డిమాండ్లను అంగీకరించకపోతే ఆమరణ నిరాహార దీక్షకు దీక్షకు దిగుతామని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

    రైతులు పట్టు వీడడం లేదు. కేంద్రం మెట్టు దిగడం లేదు. ఢిల్లీ శివారులో అన్నదాతల ఆందోళనలు కొనసాగుతున్నాయి. వ్యవసాయ చట్టాల్లో సవరణలు చేసినా ఒప్పుకునేది లేదని.. ఆ మూడు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ శివారులో 17 రోజులగా రైతులు ఆందోళనలు చేస్తున్నారు. పంజాబ్, హర్యానా, యూపీ నుంచి రైతులు పెద్ద ఎత్తున కదం తొక్కారు. ఇన్ని రోజులుగా నిరసనలు వ్యక్తం చేస్తున్నా, కేంద్రం దిగిరాకపోవడంతో.. భవిష్యత్ కార్యాచరణ ప్రకటించాయి రైతు సంఘాలు.

    ఇప్పటికే ప్రపంచ దృష్టిని ఆకర్షించిన అన్నదాతలు.. ఈ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేయాలని నిర్ణయించారు. కేంద్రంతో తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే రేపు జైపూర్- ఢిల్లీ రహదారిపై ట్రాక్టర్ ర్యాలీ నిర్వహిస్తామని తెలిపారు. ఎల్లుడి సింఘు సరిహద్దులో నిరాహార దీక్షను చేయబోతున్నట్లు ప్రకటించారు. డిసెంబరు 19 లోపు తమ డిమాండ్లను అంగీకరించకపోతే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతామని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తమ పోరాటం శాంతియుతంగా కొనసాగుతోందని. కొత్త చట్టాలు రద్దు చేసే వరకు ఆందోళన విరమించబోమని తెగేసి చెప్పారు.

    ఆదివారం రాజస్థాన్ నుంచి ఢిల్లీ వరకు రైతులు ట్రాక్టర్ ర్యాలీ తీయనున్నారు. అక్కడి నుంచి ర్యాలీగా వచ్చి ఢిల్లీ-జైపూర్ రోడ్డును దిగ్భందించనున్నారు. మరోవైపు ఆగ్రా-ఢిల్లీ, జైపూర్-ఢిల్లీ హైవేలపై వందలాది మంది రైతులు బైఠాయించడంతో.. వారిని పోలీసులు అడ్డుకున్నారు. పెద్ద మొత్తంలో పోలీసులు మోహరించి ట్రాఫిక్‌ను క్లియర్ చేస్తున్నారు. ఆగ్రాకు వెళ్లే హైవేను బ్లాక్ చేసినందుకు పలువురు రైతులను అదుపులోకి తీసుకున్నారు. పలుచోట్ల టోల్ ప్లాజాలను రైతులు తమ ఆధీనంలోకి తీసుకొని.. టోల్‌ చెల్లించకుండా కార్లు, ఇతర వాహనాలను వదిలిపెడుతున్నారు.

    రైతుల సంఘాలు, కేంద్రం మధ్య ఇప్పటికే పలు దఫాల చర్చలు జరిగాయి. కానీ ఎలాంటి పరిష్కారం దొరకడం లేదు. కేంద్రం చెప్పిన ఏ ప్రతిపాదనకూ రైతులు అంగీకరించడం లేదు. మూడు చట్టాలను రద్దు చేయాల్సిందేనని పట్టుబట్టుతున్నారు. మరోవైపు కేంద్రం కూడా ఆ మూడు చట్టాలను రద్దుచేసే ప్రకస్తే లేదని తేల్చిచెప్పింది. రైతుల ఆదాయం రెట్టింపు చేయడానికే చట్టాలను తెచ్చామని.. అపోహలతో ఆందోళనలు చేయడం సరికాదని సూచిస్తోంది.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Agriculture, Delhi, Farmers Protest, New Agriculture Acts

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు