HOME »NEWS »NATIONAL »farmers postpone february 1st march to parliament after tractor rally turns violent ba

Farmers Protest: ఫిబ్రవరి 1న పార్లమెంట్ మార్చ్ వాయిదా వేసిన రైతు సంఘాలు

Farmers Protest: ఫిబ్రవరి 1న పార్లమెంట్ మార్చ్ వాయిదా వేసిన రైతు సంఘాలు
ఢిల్లీలో రైతుల ట్రాక్టర్ల ర్యాలీ (File)

రిపబ్లిక్ డే సందర్భంగా దేశ రాజధాని హస్తినలో జరిగిన హింసాత్మక ఘటనల నేపథ్యంలో రైతుల సంఘాలు వెనక్కి తగ్గాయి. ఫిబ్రవరి 1న నిర్వహించ తలపెట్టిన పార్లమెంట్ మార్చ్‌ను వాయిదా వేశాయి.

  • Share this:
    రిపబ్లిక్ డే సందర్భంగా దేశ రాజధాని హస్తినలో జరిగిన హింసాత్మక ఘటనల నేపథ్యంలో రైతుల సంఘాలు వెనక్కి తగ్గాయి. ఫిబ్రవరి 1న నిర్వహించ తలపెట్టిన పార్లమెంట్ మార్చ్‌ను వాయిదా వేశాయి. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టే రోజే రైతులు కూడా పాదయాత్రగా పార్లమెంట్ వైపునకు వెళ్లాలని నిర్ణయించాయి. అయితే, నిన్న ఢిల్లీలో ట్రాక్టర్ల ర్యాలీ గతితప్పింది. ఒక మార్గంలో వెళ్లాల్సిన ర్యాలీ మరో మార్గం వైపు వెళ్లింది. ఎర్రకోట వద్ద హింసాత్మక ఘటనలో చోటుచేసుకున్నాయి. ఎర్రకోట వద్ద ఓ మతానికి చెందిన జెండాను ఎగురవేశారు ఆందోళనకారులు. ఈ క్రమంలో రైతుల ఆందోళనల నుంచి రెండు సంఘాలు తప్పుకున్నాయి. ఆ ఘటనలతో తమకు సంబంధం లేదని స్పష్టం చేశాయి. ఘటనలు హింసాత్మకంగా మారిన నేపథ్యంలో పాదయాత్రను వాయిదా వేసుకున్నాయి. ‘అమరవీరుల దినోత్సవం రోజు దేశవ్యాప్తంగా రైతులు ర్యాలీలు చేస్తారు. అలాగే ఒక రోజు నిరాహార దీక్ష కూడా చేస్తాం. ఫిబ్రవరి 1న చేపట్టిన పార్లమెంట్ మార్చ్ వాయిదా వేశాం.’ అని రైతు సంఘాల నేతలు తెలిపారు.

    రిపబ్లిక్ డే సందర్భంగా దేశ రాజధాని హస్తినలో జరిగిన హింసాత్మక ఘటనల తర్వాత రెండు రైతు సంఘాలు తమ నిరసనను విరమిస్తున్నట్టు ప్రకటించాయి. రాష్ట్రీయ కిసాన్ మజ్దూర్ సంఘటన్, భారతీయ కిసాన్ యూనియన్ రెండు సంఘాలు తాము ఆందోళన నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాయి. ‘వారి ఉద్దేశం వేరుగా ఉన్న మరొకరి డైరెక్షన్‌లో మేం ముందుకు వెళ్లలేం. వారికి ఆల్ ద బెస్ట్. కానీ, వీఎం సింగ్, ఆల్ ఇండియా కిసాన్ సంఘర్ష్ కోఆర్డినేషన్ కమిటీ ఈ నిరసన నుంచి ఇప్పుడే తప్పుకుంటోంది.’ అని రాష్ట్రీయ కిసాన్ మజ్దూర్ సంఘనల్ నేషనల్ కన్వీనర్ వీఎం సింగ్ తెలిపినట్టు ఏఎన్ఐ వార్తా సంస్థ రిపోర్ట్ చేసింది. అదే సమయంలో BKU నేత రాకేష్ తికాయత్ తీరును వీఎం సింగ్ తప్పుపట్టారు. మొదట అనుకున్న మార్గంలో కాకుండా ట్రాక్టర్ ర్యాలీ దారి మళ్లించారని మండిపడ్డారు.



    దేశ రాజధాని ఢిల్లీలో రిపబ్లిక్ డే రోజు రైతులు చేపట్టిన ట్రాక్టర్ల ర్యాలీ హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. రైతులు ముందు చెప్పిన మార్గంలో కాకుండా మరో టర్న్ తీసుకుని ఎర్రకోట వైపునకు దూసుకొచ్చారు. ఎర్రకోట వద్ద ఓ మతానికి సంబంధించిన జెండాను ఎగురవేశారు. అదే సమయంలో రైతులను అడ్డుకునేందుకు పోలీసులు ఏర్పాటు చేసిన బ్యారికేడ్లను తమ ట్రాక్టర్లతో తొక్కుకుంటూ వచ్చారు. కొన్నిచోట్ల పోలీసుల మీద కొందరు ఆందోళనకారులు పెద్ద పెద్ద కర్రలతో దాడులు చేశారు. ఈ దృశ్యాలు వెలుగులోకి కూడా వచ్చారు. సుమారు 100 మంది భద్రతా సిబ్బంది ఈ దాడుల్లో గాయపడ్డారు. ఒక రైతు ట్రాక్టర్ మీద విన్యాసాలు చేస్తుండగా ప్రాణాలు కోల్పోయాడు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:January 27, 2021, 22:12 IST