Home /News /national /

FARMERS DAUGHTER SCORES 98 PERCENTAGE IN CBSE 12TH DESPITE FINANCIAL HARDSHIP UMG GH

CBSE 12th Topper: సీబీఎస్‌ఈ టాపర్‌గా రైతు బిడ్డ.. తన టార్గెట్ ఐఏఎస్ అంటున్న స్టూడెంట్..!

సీబీఎస్‌ఈ టాపర్‌గా రైతు బిడ్డ.. తన టార్గెట్ ఐఏఎస్ అంటున్న స్టూడెంట్..!

సీబీఎస్‌ఈ టాపర్‌గా రైతు బిడ్డ.. తన టార్గెట్ ఐఏఎస్ అంటున్న స్టూడెంట్..!

చదువుకు పేదరికం అడ్డుకాదని మరోసారి నిరూపితమైంది. యూపీకి చెందిన ఓ రైతు బిడ్డ, పేద యువతి సీబీఎస్‌ఈ 12వ తరగతి ఫలితాల్లో 98.8 శాతం స్కోర్ సాధించి స్కూల్ టాఫర్‌గా నిలిచింది. సహరన్‌పూర్‌లోని నాథౌరీ పట్టణానికి చెందిన ఒక సన్నకారు రైతు కుటుంబంలో జన్మించిన ఆ స్టూడెంట్ పేరు కనికా కౌశిక్.

ఇంకా చదవండి ...
చదువుకు పేదరికం అడ్డుకాదని మరోసారి నిరూపితమైంది. యూపీకి చెందిన ఓ రైతు బిడ్డ, పేద యువతి సీబీఎస్‌ఈ 12వ తరగతి ఫలితాల్లో 98.8 శాతం స్కోర్ సాధించి స్కూల్ టాపర్‌గా నిలిచింది. సహరన్‌పూర్‌లోని నాథౌరీ పట్టణానికి చెందిన ఒక సన్నకారు రైతు కుటుంబంలో జన్మించిన ఆ స్టూడెంట్ పేరు కనికా కౌశిక్. కుటుంబ కష్టాలన్నింటికీ ఉన్నత విద్యే పరిష్కారం చూపిస్తుందని నమ్మిందామె. అందుకు తగ్గట్టుగానే కష్టపడి చదివి టాపర్‌గా నిలిచింది. ‘మా నాన్న సన్నకారు రైతు. మాకు ఆర్థికంగా ఎన్నో కష్టాలు ఉన్నాయి. ఈ సమస్యలే నన్ను మరింత కష్టపడి చదివేలా చేశాయి.’ అని కనికా చెప్పుకొచ్చింది.

ఈ 17 ఏళ్ల టాపర్.. విద్యా జ్ఞాన్ అకాడమీలో చదువుకుంది. యూపీ గ్రామీణ ప్రాంతాల నుంచి ఆర్థికంగా వెనుకబడిన, ప్రతిభావంతులైన విద్యార్థుల కోసం ఈ అకాడమీని ఏర్పాటు చేశారు. కనికా హిస్టరీ, సైకాలజీలో 100 మార్కులు సాధించింది. తన జీవిత లక్ష్యాల గురించి వివరిస్తూ.. ‘నేను సివిల్ సర్వీసెస్‌కు సిద్ధం కావాలనుకుంటున్నాను. ఆ మార్గాన్ని ఎంచుకోవడం ద్వారా నేను, దేశానికి మెరుగైన సేవ చేస్తానని బలంగా నమ్ముతున్నా. ఇతరులకు కూడా సహాయం చేయాలనుకుంటున్నా. నేను పొందిన అన్ని సహాయాలకు ఫలితంగా సమాజానికి ఎంతోకొంత తిరిగి చెల్లించాలనుకుంటున్నాను.’ అని కనికా వెల్లడించింది. ఈ టాపర్, కార్మ్ ఫెలోషిప్‌ను కూడా గెలుచుకుంది. ఇది ఆమెకు మరింత చదువుకోవడానికి సహాయ పడనుంది. ప్రస్తుతం కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (CUET) కోసం ప్రిపేర్ అవుతోంది.

ఇదీ చదవండి: ఓరి ! నాయనో ఇదెక్కడి రోగం.. లైంగిక సంపర్కం ద్వారా కూడా మంకీ పాక్స్ .. WHO సంచలన విషయాలు..!


కనికాకు వాలీబాల్ ఆడడం, చదువు ఈ రెండు అంటే చాలా ఇష్టం. తన ప్రిపరేషన్ గురించి ఇలా స్పందించింది. స్కూల్‌లో నేర్చుకున్న ప్రతిదాన్ని అదే రోజే రివైజ్ చేసేలా చూసుకున్నానని తెలిపింది. రాబోయే బ్యాచ్ కోసం ప్రిపరేషన్ టిప్స్‌ కూడా చెప్పింది. “చాలా మంది విద్యార్థులు కష్టపడి చదువుతారు. నేను అలా చేయలేదు. ఇది మంచి పద్దతి కాదు. ఇతరులకు కూడా సూచించను. మీరు ఏరోజు పాఠాలను ఆరోజు క్రమం తప్పకుండా రివైజ్ చేసుకుంటూ, చివరి వరకు దాన్ని స్థిరంగా కొనసాగించాలి. ఇలా చేస్తే పరీక్ష సమయంలో ఒత్తిడి తగ్గుతుంది. ప్రిపరేషన్ కూడా సులభమవుతుంది.’ అని స్టూడెంట్స్‌కు సూచించింది టాపర్ కనికా.ఈ విజయంలో తన తల్లిదండ్రుల మద్దతు కీలకమని కనికా చెబుతోంది. ‘నా రిజల్ట్స్ చూసి వారు ఎంత గర్వపడుతున్నారో తెలియదు.. కానీ నేను 500/500 స్కోర్ సాధించగలనని వారు నమ్మారు. నేను సమర్థవంతురాలినని, మరింత మెరుగ్గా రాణిస్తానని వారు భావించి, ప్రోత్సహించారు.’ అంటూ హర్షం వ్యక్తం చేసింది. కాగా, సుదీర్ఘ నిరీక్షణ తర్వాత సీబీఎస్‌ఈ 10, 12వ తరగతి ఫలితాలను ఒకే రోజు జులై 22న ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలో 92.71 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు.
Published by:Mahesh
First published:

Tags: CBSE, Cbse results, JOBS, Uttar pradesh

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు