హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

కిసాన్ ర్యాలీ: 7 డిమాండ్లకు కేంద్రం ఓకే..రుణమాఫీపై అస్పష్టత

కిసాన్ ర్యాలీ: 7 డిమాండ్లకు కేంద్రం ఓకే..రుణమాఫీపై అస్పష్టత

పారిశ్రామిక రంగంలో మందగమనంతో పాటు రియల్‌ ఎస్టేట్‌ కార్యకలాపాలు సైతం తగ్గిపోవడంతో కూలీ రేటూ తగ్గిపోతోంది.

పారిశ్రామిక రంగంలో మందగమనంతో పాటు రియల్‌ ఎస్టేట్‌ కార్యకలాపాలు సైతం తగ్గిపోవడంతో కూలీ రేటూ తగ్గిపోతోంది.

రుణమాఫీపై తేలనిదే ఆందోళన విరమించేది లేదని భారతీయ కిసాన్ యూనియన్ నేతలు స్పష్టంచేశారు. ఢిల్లీ శివారులోనే ఉండి రాత్రికి అక్కడే నిద్రపోతామని.. బుధవారం కిసాన్ ఘాట్‌కు వెళ్తామని చెప్పారు.

  ఉత్తరాదిన రైతు గర్జనతో కేంద్రం దిగొచ్చింది. మొత్తం 11 డిమాండ్లలో ఏడింటిని నెరవేర్చేందుకు అంగీకరించింది. ఐతే రుణమాఫీతో పాటు స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సులు అమలుపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. కేంద్ర హోమంత్రి రాజ్‌నాథ్ సింగ్ రైతులతో చర్చలు జరిపారని..మెజార్టీ డిమాండ్లకు అంగీకరించారని కేంద్ర వ్యవసాయశాఖ సహాయ మంత్రి గజేంద్రసింగ్ తెలిపారు. ఐతే భారతీయ కిసాన్ యూనియన్ నేతలు మాత్రం రుణమాఫీపై తేలనిదే ఆందోళన విరమించేది లేదని స్పష్టంచేశారు. ఢిల్లీ శివారులోనే ఉండి రాత్రికి అక్కడే నిద్రపోతామని..బుధవారం కిసాన్ ఘాట్‌కు వెళ్తామని చెప్పారు.

  మరోవైపు రైతులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడంపై రాజకీయ దుమారం రేగుతోంది. పోలీసుల తీరును సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేశ్ తప్పుబట్టారు. రైతులకు ఆయన సంపూర్ణ మద్దతు ప్రకటించారు. అటు రాహుల్ గాంధీ సైతం రైతులపై లాఠీచార్జ్‌ను ఖండించారు. ప్రపంచమంతా అహింసా దినోత్సవాన్ని జరుపుకుంటుంటే..బీజేపీ ప్రభుత్వం మాత్రం రైతులపై హింసకు పాల్పడుతోందని మండిపడ్డారు.

  ఢిల్లీలోని కిసాన్ ఘాట్‌కు వెళ్లేందుకు ప్రయత్నించిన రైతులను శివారులోనే పోలీసులు అడ్డుకున్నారు. బారికేడ్లను ఏర్పాటు చేసి భారీగా బలగాలను మోహరించారు. ఐనప్పటికీ రైతులు వెనక్కి తగ్గకుండా..ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో రైతులపై పోలీసులు లాఠీచార్జ్ చేసి..వాటర్ కెనాన్లను ప్రయోగించారు. రబ్బర్ బుల్లెట్లు, భాష్ప వాయువు గోళాలను ప్రయోగించడంతో పలువురు రైతులు గాయపడ్డారు. దీనిపై పోలీసులు వివరణ ఇచ్చారు. కొందరు రైతులు ట్రాక్టర్ ట్రాలీల సాయంతో బారికేడ్లను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారని..మరికొందరు కర్రలు పట్టుకొని వచ్చారని తెలిపారు. తప్పనిసరి పరిస్థితుల్లోనే వాటర్ కెనాన్లు, టియర్ గ్యాస్‌ను ప్రయోగించాల్సి వచ్చిందని చెప్పారు.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Farmers Protest, New Delhi

  ఉత్తమ కథలు