FARMERS AT DELHI BORDERS SINGHU BORDER RETURNING TO HOMES AFTER YEAR LONG PROTEST ENDS MKS
Farmers : ముగిసిన సాగు పోరు -ఢిల్లీ సింఘు బోర్డర్ నుంచి ర్యాలీగా ఇళ్లకు బయలుదేరిన రైతులు
ఢిల్లీ సరిహద్దుల నుంచి రైతుల ఇంటిబాట
ఉద్యమాన్ని ముగిస్తున్నట్లు కిసాన్ మోర్ఛా గురువారం ప్రకటన చేయడంతో ఢిల్లీ సరిహద్దులైన సింఘు, టిక్రి, ఘాజీపూర్ ప్రాంతాలనుంచి శిబిరాలను ఎత్తేసే ప్రక్రియ శుక్రవారమే మొదలైంది. శనివారం ఉదయానికే రైతులు తమ సరంజామాను ట్రాక్టర్లతో సర్దేరి ఎక్కడికక్కడే ర్యాలీగా ఇంటిబాట పట్టారు. విజయయాత్రలు (ఫతే మార్చ్ ) పేరుతో రైతుల నిష్క్రమణ ప్రక్రియ నిరాటంకంగా కొనసాగుతున్నది.
వ్యవసాయ రంగంలో విప్లవాత్మక సంస్కరణలంటూ కేంద్రం తీసుకొచ్చిన మూడు సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఏడాదికిపైగా పోరాటం చేసిన అన్నదాతలు ఆందోళనలు విరమించి ఇంటి బాట పట్టారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా నిర్వహించిన ఆందోళనలకు మోదీ సర్కార్ దిగిరావడం, ఆ చట్టాలను రద్దు చేయడంతో రైతులు తమ నిరసనను ముగించి ఇళ్లకు బయలుదేరారు. ఉద్యమాన్ని ముగిస్తున్నట్లు 40 రైతు సంఘాల సమాఖ్య సంయుక్త్ కిసాన్ మోర్ఛా గురువారంనాడే ప్రకటన చేసిన దరిమిలా వేలాది మంది రైతులు శనివారం నుంచి ఇంటిబాట పట్టారు. ఇన్నాళ్లూ తాము బైఠాయించిన ఢిల్లీ సరిహద్దుల నుంచి రైతులు భారీ ర్యాలీలు, మార్చ్ లతో సొంత ఊళ్లకు బయలుదేరారు..
ఉద్యమాన్ని ముగిస్తున్నట్లు కిసాన్ మోర్ఛా గురువారం ప్రకటన చేయడంతో ఢిల్లీ సరిహద్దులైన సింఘు, టిక్రి, ఘాజీపూర్ ప్రాంతాలనుంచి శిబిరాలను ఎత్తేసే ప్రక్రియ శుక్రవారమే మొదలైంది. శనివారం ఉదయానికే రైతులు తమ సరంజామాను ట్రాక్టర్లతో సర్దేరి ఎక్కడికక్కడే ర్యాలీగా ఇంటిబాట పట్టారు. విజయయాత్రలు (ఫతే మార్చ్ ) పేరుతో రైతుల నిష్క్రమణ ప్రక్రియ నిరాటంకంగా కొనసాగుతున్నది.
గతేడాది నవంబర్ 26 నుంచి పంజాబ్, హర్యానా, యూపీ తదితర రాష్ట్రాలకు చెందిన వేలాది మంది రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో నిరసనలకు దిగారు. సిటీలోని రాంలీలా మైదాన్ కు బయలుదేరిన రైతులను పోలీసులు సరిహద్దుల వద్దే అడ్డుకోవడంతో గత ఏడాది కాలంగా వారు అక్కడే శిబిరాల్లో నిరసనలు కొనసాగిస్తున్నారు. మూడు సాగు చట్టాలను రద్దు చేస్తూ పార్లమెంటులో ప్రభుత్వం బిల్లు పెట్టగా, దానికి రాష్ట్రపతి ఆమోదం లభించడంతో రద్దు ప్రక్రియ గత నెలలోనే ముగిసింది. అయితే, కనీస మద్దతు ధరపై చట్టం తెస్తేగానీ, కొత్త విద్యుత్ చట్టాన్ని ఉపసంహరించుకుంటేగానీ ఆందోళనలు విరమించబోమంటూ రైతులు భీష్మించారు. దీంతో..
కేంద్ర హోం మంత్రి అమిత్ షా నేతృత్వంలోని మంత్రుల బృందం.. రైతు సంఘాల నేతలతో తాజాగా జరిపిన చర్చలు ఫలించాయి. రైతులపై కేసుల ఉపసంహరణ, మద్దతు ధరపై కమిటీ వంటి పెండింగ్ డిమాండ్ల పరిష్కారానికి అంగీకరిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం లిఖితపూర్వకంగా తెలియజేయడంతో రైతులు ఉద్యమాన్ని ముగిస్తున్నట్లు ప్రకటించారు. శనివారం మధ్యాహ్నానికే ఢిల్లీ సరిహద్దుల్లో మళ్లీ సాధారణ పరిస్థితులు రానున్నాయి.
Published by:Madhu Kota
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.