హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Agriculture: కేవలం సెంటు భూమిలో మొక్కల సాగు.. నెలకు లక్ష సంపాదిస్తున్న రైతు

Agriculture: కేవలం సెంటు భూమిలో మొక్కల సాగు.. నెలకు లక్ష సంపాదిస్తున్న రైతు

రైతు సురేశ్ ప్రసాద్

రైతు సురేశ్ ప్రసాద్

Agriculture: ఒక్కసారి మొక్కలను సిద్ధం చేసి విక్రయిస్తే.. లక్ష రూపాయల వరకు వస్తాయి. ఇందులో ఖర్చులు పోను... రూ.80 వేల వరకు నికర లాభం వస్తుంది.

  • Local18
  • Last Updated :
  • Hyderabad, India

మన దేశంలో రైతుల పరిస్థితి అంతమాత్రంగానే ఉంటుంది. మార్కెట్‌లో మంచి రేటు ఉన్నప్పుడు దిగుబడి రాదు. దిగుబడి ఎక్కువగా ఉన్నప్పుడు రేటు ఉండదు. ఈ కారణం వల్లే ఎంతో మంది రైతులు ఆర్థిక సమస్యలు కొట్టుమిట్టాడుతున్నారు. ఐతే కొందరు రైతులు మాత్రం అధునాతన టెక్నాలజీని ఉపయోగించి.. వాణిజ్య పంటలను సాగు చేసి.. తక్కువ ఖర్చుతోనే.. లక్షల ఆదాయం పొందుతున్నారు. బీహార్‌ (Bihar)కు చెందిన సురేశ్ ప్రసాద్ కూడా ఈ కోవ‌లోకే వస్తాడు. ఒక్క సెంటు భూమితోనే అద్భుతాలు చేస్తున్నాడు. ప్రతి నెలా లక్ష రూపాయలు సంపాదిస్తున్నాడు. ఒక్క సెంటు భూమితో ఇంత ఆదాయం వస్తుందా? అని మీరు ఆశ్చర్యపోవచ్చు. కానీ ఇది నిజం..!

బీహార్‌లోని సివాన్ జిల్లా గోరియాకోఠి మండలానికి చెందిన రైతు సురేశ్ ప్రసాద్‌కు తమ గ్రామంలో ఒక్క సెంటు భూమి ఉంది. తక్కువ భూమే ఉన్నప్పటికీ.. అందులో అనేక రకాల మొక్కలను సాగుచేస్తున్నాడు. ఇజ్రాయెల్ టెక్నాలజీ (Israel Technology)ని ఉపయోగించి మొక్కలను ఉత్పత్తి చేస్తున్నాడు. తనకున్న సెంటు భూమిలో పాలీ హౌస్‌ను ఏర్పాటు చేసి.. ఇజ్రాయెల్ టెక్నాలజీతో నర్సరీని నడుపుతున్నాడు సురేశ్ ప్రసాద్. తన నర్సరీలో విత్తనాల ద్వారా.. పలు రకాల పూలు, పండ్ల మొక్కలను పెంచుతున్నాడు. కేవలం నెల రోజుల్లోనే 20వేల మొక్కలను సిద్ధం చేస్తాడు. ఒక్కో మొక్కను రూ.5 విక్రయించి.. లక్ష రూపాయల వరకు సంపాదిస్తున్నాడు.

 Jail: ఖైదీలకు వేదమంత్రాలు నేర్పిస్తున్నారు.. పౌరోహిత్యంలో శిక్షణ! ఎక్కడో తెలుసా

నర్సరీలో మొక్కలను సిద్ధం చేసేందుకు 200 ట్రేలను ఉపయోగిస్తున్నారు. ఒక ట్రేలో 98 నుండి 100 మొక్కలను ఉత్పత్తి చేస్తారు. ఈ మొత్తం ప్రక్రియలో వారికి రూ.20-25 వేలు మాత్రమే ఖర్చవుతుంది. ఒక్కసారి మొక్కలను సిద్ధం చేసి విక్రయిస్తే.. లక్ష రూపాయల వరకు వస్తాయి. ఇందులో ఖర్చులు పోను... రూ.80 వేల వరకు నికర లాభం వస్తుంది.

సురేష్ ప్రసాద్ ఇజ్రాయెల్ టెక్నాలజీలో శిక్షణ తీసుకున్నాడు. ఆ తర్వాత ఈ పద్ధతిని అనుసరించి వ్యవసాయం ప్రారంభించాడు. ఇజ్రాయెల్ టెక్నిక్ చాలా బాగుందని.. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం పొందవచ్చని చెబుతున్నాడు సురేష్ ప్రసాద్. ఏడాదికి మూడు నెలల పాటు మొక్కలను సిద్ధం చేసి విక్రయిస్తున్నట్లు వెల్లడించారు. ఈ టెక్నాలజీ గురించి తెలుసుకునేందుకు చుట్టుపక్కల అనేక మంది రైతులు ఆయనకు వద్దకు వెళ్తారు. సురేశ్ ప్రసాద్ ఎంతో ఓపిగ్గా.. వారిందరికీ టెక్నాలజీ గురించి వివరించారు. వారు కూడా ఈ పద్దతిలో వ్యవసాయం చేసేందుకు, నర్సరీని నడిపేందుకు తన వంతు సాయం చేస్తారు.

First published:

Tags: Agriculture, Bihar, Farmer, Success story

ఉత్తమ కథలు