Home /News /national /

FARMER FROM MADHYA PRADESH DIED DUE TO CORONA VIRUS EVEN AFTER GETTING TREATMENT FOR 8 MONTHS AK

8 నెలల క్రితం కరోనా.. అప్పటి నుంచి ఆస్పత్రిలోనే.. ఎంత ఖర్చు చేశారంటే.. కానీ చివరకు..

కరోనాతో చనిపోయిన రైతు

కరోనాతో చనిపోయిన రైతు

Farmer Died Due To Corona: వింధ్య ప్రాంతంలోని ప్రగతిశీల రైతుల్లో ధరమ్‌జయ్ సింగ్ తన పేరును నిలబెట్టుకున్నాడు. అతని కుటుంబానికి దాదాపు 200 ఎకరాల భూమి ఉంది.

    కరోనా కారణంగా మన దేశంలో ఎంతో మంది కన్నుమూశారు. వైద్యులు ఎంతగానో శ్రమించినా.. కొంతమందిని కాపాడలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ రైతు కూడా ఇదే రకంగా కరోనాతో పోరాడి చనిపోయాడు. మధ్యప్రదేశ్‌లోని రేవాకు చెందిన ధరమ్‌జయ్ సింగ్ వృత్తి రీత్యా రైతు. అతడు కరోనాతో మరణించాడు. 2021 ఏప్రిల్‌లో ధరమ్‌జయ్‌కు కరోనా వైరస్ సోకింది. అతడిని చికిత్స కోసం రీవా ఆసుపత్రిలో చేర్చారు. అయితే అతడి పరిస్థితి చూసి వేరే చోటికి తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. ఆ తర్వాత చెన్నైలోని ఆస్పత్రిలో చేర్పించారు. ఇక్కడ ఆయన ఏకంగా 8 నెలల పాటు మృత్యువుతో పోరాడాడు. ఆయనకు చికిత్స అందించేందుకు ఆయన కుటుంబం రూ.8 కోట్లు ఖర్చు చేసింది. సుమారు 50 ఎకరాల భూమిని కూడా ఇందుకోసం అమ్మేసింది. అయినప్పటికీ ఆయన ప్రాణాలు దక్కలేదు. అతడి కోసం ఏయే చికిత్సలకు ఎంత డబ్బు ఖర్చు చేశారనే విషయాలను అతడి సోదరుడు ప్రదీప్ సింగ్ వెల్లడించాడు.

    తన తమ్ముడి ప్రాణాలను కాపాడేందుకు కుటుంబంలోని ప్రతి ఒక్కరు తనవంతు కృషి చేశారు. చెన్నై ఆస్పత్రిలో రోజువారీ చికిత్స ఫీజు రూ.3 లక్షల వరకు ఉండేది. ఇందులో వైద్యుల ఫీజుతోపాటు వారిని అక్మో సిస్టమ్‌లో ఉంచడానికి ఛార్జీలు ఉండేవి. ఆక్సిజనేటర్ మార్చడానికి ఫీజు వేరుగా ఉండేది. దీంట్లో ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఎక్కువ కాబట్టి నెలకు 3-4 సార్లు మార్చుకోవాల్సి వచ్చేది. ప్రతినెలా ఇందుకోసం రూ.70-80 లక్షలు ఖర్చు అయ్యేది. అక్మో నుంచి సోదరులు బయటకు వచ్చేసరికి ఆసుపత్రికి రోజువారి ఖర్చులు దాదాపు లక్ష రూపాయల వరకు అయ్యేవి.

    ఆస్పత్రుల్లో భోజనం ఖర్చు రోజుకు 15-16 వేల రూపాయలు అయ్యేవి. బయట డాక్టర్ని పిలిస్తే ఫీజు కూడా ఉండేది. రేవా నుంచి చెన్నైకి ఎయిర్ అంబులెన్స్ కోసం రూ. 35 లక్షలు ఖర్చు చేశారు. గ్రామస్తులు కూడా వైద్య కోసం సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. కుటుంబ బంధువులు నుంచి కూడా డబ్బులు సేకరించారు. ఎకో సిస్టమ్ రోజువారీ ఖర్చులు సుమారు రూ. 3 లక్షలు. చెన్నైలో నివాసం ఉండేందుకు అద్దెకు ఫ్లాట్ తీసుకున్నట్లు వారు తెలిపారు. ఇక్కడ వసతి, భోజనానికి ప్రత్యేక ఖర్చు ఉండేది.

    Corona Cases: దేశంలో 2.64 లక్షల కోవిడ్ కేసులు.. 239 రోజుల త‌ర్వాత ఇదే అత్య‌ధికం!

    Madhya Pradesh: ఈ నెలంతా స్కూళ్లు తెరవొద్దు, సభలు, వేడుకలకు ఇది సమయం కాదు

    లండన్ వైద్యుడి పర్యవేక్షణలో ధరమ్‌జయ్ సింగ్ చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందారు. డాక్టర్ లండన్ నుంచి వచ్చేవారు. వారి చికిత్స కోసం అనేక ఇతర దేశాల వైద్యులను కూడా సంప్రదించారు. వింధ్య ప్రాంతంలోని ప్రగతిశీల రైతుల్లో ధరమ్‌జయ్ సింగ్ తన పేరును నిలబెట్టుకున్నాడు. అతని కుటుంబానికి దాదాపు 200 ఎకరాల భూమి ఉంది. ఈ భూమిలో స్ట్రాబెర్రీలు, గులాబీలు సాగు చేస్తారు. వ్యవసాయంలో రకరకాల ప్రయోగాలు చేసి రాష్ట్రపతి చేతుల మీదుగా ఆయన అవార్డులు పొందారు. అయితే కరోనాతో సుదీర్ఘకాలం పోరాడి కన్నుమూశారు.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Coronavirus, Madhya pradesh

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు