కేంద్ర ప్రభుత్వం (Central Govt) సెప్టెంబర్, 2020 తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ దిల్లీ సరిహద్దుల వద్ద పంజాబ్, హరియాణా, ఉత్తర ప్రదేశ్ (Uttar Pradesh) రైతులు ఏడాది పాటు నిరసనలు చేపట్టారు. రైతుల డిమాండ్ల మేరకు ప్రధాని వ్యవసాయ చట్టాలను రద్దు (Farm Laws) చేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో 383 రోజుల సుదీర్ఘ నిరసన కార్యక్రమం తరువాత రైతులు ఢిల్లీ సరిహద్దుల నుంచి ఇంటిబాట పట్టారు. వారందరికీ ఈ సం దర్భం గా దిల్లీ-ఉత్తర్ ప్రదేశ్ సరిహద్దులోని ఘాజీపుర్ వద్ద రైతన్న లకు భారీ వీడ్కోలు లభించింది. అధిక సంఖ్యలో ప్రజలు రైతులకు మద్దతుగా వారికీ వీడ్కోలు చెప్పడానికి వచ్చారు. ఈ సందర్భంగా రైతు ఉద్యమ నేత రాఖేశ్ టికాయత్ ఘాజీపూర్ సరిహద్దు వద్ద నెలకొన్న దృశ్యాలను ట్విట్టర్‌లో షేర్ చేసుకొన్నారు.
పోరాటం ముగిసిన సందర్భంగా రైతులు.. దేశభక్తి గీతాలు, పాటలు పాడుతూ కొద్దిసేపు నృ త్యా లు చేశారు. ‘13నెలల పాటు వీధుల్లో చేసిన పోరాటం ముగిం చి ఈ రోజు తిరిగి ఇం టికి బయలుదేరాము. ఈ సం దర్భం గా ఈ ఉద్య మానికి మద్దతు తెలిపిన దేశ పౌరులం దరికీ హృ దయపూర్వక ధన్య వాదాలు’ అం టూ భారతీయ కిసాన్ యూనియన్ (BKU) నేత రాకేశ్ టికాయిత్ ట్వి టర్లో పేర్కొ న్నా రు.
Repeal of farm laws: రైతు చట్టాల్లో ఏముంది.. అసలు రైతులు ఎందుకు వ్యతిరేకించారు
गाजीपुर बॉर्डर pic.twitter.com/efY52imSoQ
— Rakesh Tikait (@RakeshTikaitBKU) December 15, 2021
వ్యవసాయ చట్టాలపై ఉద్యమ ప్రస్థానం..
- జూన్ 2020: మూడు వ‌్యవసాయ చట్టాల బిల్లును ప్రభుత్వం ప్రవేశ పెట్టింది.
- సెప్టెంబర్ 2020లో పార్లమెంట్ చట్టాలను ఆమోదించింది.
- అక్టోబర్ 2020లో చట్టాలపై దాఖలైన పిటిషన్‌లపై కేంద్రాన్ని సుప్రీం వివరణ కోరింది.
Durga Puja: 'ఇన్‌టాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్' జాబితాలో దుర్గాపూజ.. యునెస్కో ప్రకటన
- నవంబర్ 2020లో పలు చోట్ల రైతులు నిరసనలు చేపట్టారు.
- నవంబర్ 28, 2020లో ఢిల్లీ శివారు ప్రాంతాల్లో రైతుల నిరసనను ఆపాలని ప్రభుత్వం కోరింది. అందుకు రైతులు అంగీకరించలేదు.
- జనవరి 2021లో రైతులతో ప్రభుత్వం చర్చలు జరిపింది. చర్టలు విఫలమయ్యాయి.
- జనవరి 26, 2021న రైతుల ట్రాక్టర్ కవాతులో ఘర్షణ జరిగింది.
Omicron symptoms: అలసట.. రాత్రిళ్లు విపరీతంగా చెమట పట్టడం.. ఒమిక్రాన్ కొత్త లక్షణాలు ఇవే!
- మార్చ్ 2021లో రైతుల చట్టాలను ఉపసంహరించుకోవాలని పంజాబ్ అసెంబ్లీ తీర్మానం చేసింది.
- ఆగస్టు 2021లో రైతుల నిరసనపై లాఠీ చార్జీ జరిగింది.
- నవంబర్ 2021 సాగు చట్టాలు రద్దు చేస్తున్నట్టు ప్రధాని మోదీ కీలక ప్రకటన చేశారు.
- డిసెంబర్ 2021న రైతులు నిరసనను వదిలి ఇంటిబాట పట్టారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.