హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Repeal A Law: చట్టాన్ని రద్దు చేయడం అంటే ఏంటి? వ్యవసాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం ఎలా రద్దు చేయనుంది?.. తెలుసుకోండి

Repeal A Law: చట్టాన్ని రద్దు చేయడం అంటే ఏంటి? వ్యవసాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం ఎలా రద్దు చేయనుంది?.. తెలుసుకోండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

చట్టాన్ని రద్దు చేయడం అంటే ఏంటి? ప్రభుత్వం ఒక చట్టాన్ని ఎలా రద్దు చేస్తుంది? చట్టాన్ని రద్దు చేసే ప్రక్రియ ఏంటి? లాంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

సడలని ధైర్యంతో ఏడాది కాలంగా రైతులు చేసిన పోరాటానికి తలొగ్గి మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) శుక్రవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. సాగు చట్టాలను రద్దు చేసే ప్రక్రియ రాబోయే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో జరుగుతుందని కూడా మోదీ స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు స్టే విధించిన ఈ చట్టాల రద్దు ప్రక్రియ త్వరలోనే పూర్తి కానుంది. ఈ క్రమంలో చట్టాన్ని రద్దు చేయడం అంటే ఏంటి? ప్రభుత్వం ఒక చట్టాన్ని ఎలా రద్దు చేస్తుంది? చట్టాన్ని రద్దు చేసే ప్రక్రియ ఏంటి? లాంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ఒక చట్టాన్ని రద్దు(repeal) చేయడం అంటే ఏంటి?

ఒక చట్టాన్ని చట్టబద్ధంగా చెల్లనిది (nullify a law) గా చేయడాన్నే చట్టాన్ని రద్దు(repeal) చేయడం అంటారు. ఆచరణాత్మకంగా ఎలాంటి ప్రయోజనాలు లేని ఏదైనా ఒక చట్టాన్ని చట్టబద్ధంగా చెల్లనిదిగా పరిగణిస్తే అది రద్దయినట్లు లెక్క. ఒక చట్టం ఉనికిలో ఉండటం అనవసరమని భావించినప్పుడు ఆ చట్టాన్ని తిరిగి వెనక్కి తీసుకోగల అధికారం పార్లమెంటుకు ఉంటుంది.

రైతు చట్టాల రద్దుతో మారనున్న ఆ రాష్ట్ర రాజకీయాలు.. కొత్త ఎత్తులు.. కొత్త పొత్తులు ?

చట్టాలకు "సన్‌సెట్ క్లాజ్ (sunset clause)" అనే నిబంధనను కూడా పెట్టొచ్చు. అలాంటి నిబంధనల వల్ల చట్టాలు ముందస్తుగా పేర్కొన్న నిర్దిష్ట తేదీ తర్వాత ఎలాంటి ప్రభావం చూపని, చెల్లని (invalid) చట్టాలుగా మారతాయి. యాంటీ-టెర్రర్ లెజిస్లేషన్ టెర్రరిస్ట్ అండ్ డిస్ట్రప్టివ్ యాక్టివిటీస్ (నివారణ) చట్టం 1987 (TADA) సన్‌సెట్ నిబంధనను కలిగి ఉంది. ఇది 1995లో రద్దు చేయడానికి అనుమతి పొందింది. సన్‌సెట్ నిబంధన లేని చట్టాల కోసం, చట్టాన్ని రద్దు చేయడానికి పార్లమెంటు మరొక చట్టాన్ని/బిల్లును ఆమోదించాల్సి ఉంటుంది. దీని అర్థం ఫలానా చట్టాన్ని ఎందుకు రద్దు చేస్తున్నారో మరొక చట్టంలో పేర్కొనడమే. చట్టాన్ని రద్దు చేసే మరొక చట్టం కూడా చట్టమే అవుతుంది.

Farm Laws Timeline: ఆర్డినెన్స్ నుంచి రద్దు వరకు.. సాగు చట్టాల విషయంలో ఎప్పుడు ఏం జరిగింది?

ప్రభుత్వం ఒక చట్టాన్ని ఎలా రద్దు చేస్తుంది?

రాజ్యాంగంలోని ఆర్టికల్ 245 భారతదేశమంతటా లేదా ఏదైనా ఓ ప్రాంతానికి చట్టాలను రూపొందించే అధికారాన్ని పార్లమెంటుకు ఇస్తుంది. ఇదే నిబంధన ఒక చట్టాన్ని రద్దు చేసే అధికారాన్ని కూడా పార్లమెంటుకు కల్పిస్తుంది. ఒక చట్టాన్ని పూర్తిగా, పాక్షికంగా లేదా ఇతర చట్టాలకు విరుద్ధంగా ఉన్నంత సమయం వరకు కూడా రద్దు చేయవచ్చు. అయితే రాష్ట్రానికి చట్టాలు చేసే అధికారం రాష్ట్ర శాసనసభలకు ఉంటుంది.

Farm Laws: సాగు చట్టాల రద్దుపై నేతల స్పందన.. ఎవరు ఏమన్నారంటే..

చట్టాన్ని రద్దు చేసే ప్రక్రియ ఏంటి ?

ఆర్డినెన్స్ లేదా చట్టం అనే రెండు మార్గాల ద్వారా చట్టాలను రద్దు చేయవచ్చు. ఆర్డినెన్స్‌ ద్వారా చట్టాన్ని రద్దు చేయాలంటే.. దానిని ఆరు నెలల్లోగా పార్లమెంటు ఆమోదించిన చట్టం ద్వారా భర్తీ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ పార్లమెంటు ఆమోదించకపోతే ఆ ఆర్డినెన్స్ రద్దు అవుతుంది. అప్పుడు రద్దయిన చట్టాన్ని పునరుద్ధరించవచ్చు. వ్యవసాయ చట్టాల(farm laws)ను రద్దు చేసేందుకు ప్రభుత్వం చట్టాన్ని (legislation) కూడా తీసుకురావచ్చు.

Narendra Modi: ప్రధాని మోదీ సంచలన ప్రకటన.. కొత్త వ్యవసాయ చట్టాలు రద్దు

దీనిని పార్లమెంటు ఉభయసభలు(రాజ్యసభ, లోక్‌సభ) ఆమోదించాలి. ఇది అమలులోకి వచ్చే ముందు రాష్ట్రపతి ఆమోదం పొందాలి. మూడు వ్యవసాయ చట్టాలను ఒకే చట్టం ద్వారా రద్దు చేయవచ్చు. సాధారణంగా ఇందుకు రద్దు, సవరణ(Repealing and Amendment)పేరుతో బిల్లులు ప్రవేశపెడతారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం 2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆరు రద్దు, సవరణ చట్టాలను ఆమోదించి వాడుకలో లేని 1,428 చట్టాలను రద్దు చేసింది.

First published:

Tags: Farm Laws

ఉత్తమ కథలు