వ్యవసాయ రంగంలో విప్లవాత్మక సంస్కరణలు అంటూ కేంద్రం తీసుకొచ్చిన మూడు చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటన చేసిన 10 రోజుల వ్యవధిలోనే చట్టపరమైన ప్రక్రియ పూర్తికావొచ్చింది. సాగు చట్టాల రద్దు బిల్లు-2021 (Farm Laws Repeal Bill 2021)ను లోక్ సభ ఆమోదించింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల తొలిరోజైన సోమవారం నాడే సాగు చట్టాల రద్దు బిల్లును వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ సభలో ప్రవేశపెట్టగా.. భారీ మెజార్టీతో బిల్లు ఆమోదం పొందింది. అయితే
సాగు చట్టాల రద్దు బిల్లుపై సభలో చర్చ జరపాలని, అసలా చట్టాలను కేంద్రం ఎందుకు తెచ్చిందో, ఎవరి కోసం తెచ్చిందో, తీరా ఎన్నికల ముందు ఎందుకు ఉపసంహరించుకుందో సమగ్రంగా చర్చ జరగాల్సిందేనని కాంగ్రెస్ సహా పలు విపక్షపార్టీలు పట్టుపట్టాయి. సాగు చట్టాలు చేసినప్పుడూ చర్చ చేయలేదు, కనీసం రద్దు బిల్లుపైన అయినా చర్చకు అనుమతించాలంటూ కాంగ్రెస్ ఎంపీలు స్పీకర్ ను కోరారు. అందుకు అనుమతి లభించకపోవడంతో మోదీ సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
విపక్షాల అరుపులు, నినాదాలపై అధికార పక్షం నుంచి అదే స్థాయిలో ప్రతిస్పందన వచ్చింది. ఉదాత్తమైన ఉద్దేశాలతో తీసుకొచ్చిన సాగు చట్టాలను కొందరు రైతులు సరిగా అర్థం చేసుకోలేకపోయినందున వాటిని రద్దు చేసుకుంటున్నామంటూ ప్రధాని నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో స్పష్టత ఇచ్చారని, మోదీ స్వయంగా రైతులకు క్షమాపణలు చెప్పడమే సరిపోతుందని, అలాంటప్పుడు సాగు చట్టాల రద్దుపై సభలో చర్చ అనవసరమని అధికార బీజేపీ ఎంపీలు వాదించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bjp, Congress, Farm Laws, Farmers Protest, Parliament Winter session, Pm modi