హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Farm Laws: సాగు చట్టాల రద్దుపై నేతల స్పందన.. ఎవరు ఏమన్నారంటే..

Farm Laws: సాగు చట్టాల రద్దుపై నేతల స్పందన.. ఎవరు ఏమన్నారంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Farm Laws: రైతులపై ఉన్న ప్రేమతో ఈ నిర్ణయం తీసుకోలేదని.. అన్నదాతల సుదీర్ఘ పోరాటం వల్లే సాధ్యమయిందని కాంగ్రెస్‌తో పాటు ఇతర పార్టీల నేతలు అభిప్రాయపడుతున్నారు.

ఇప్పుడు దేశవ్యాప్తంగా సాగు చట్టాల రద్దు గురించే చర్చ జరుగుతోంది. ప్రధాని మోదీ ప్రకటించిన సంచలన నిర్ణయంపై ఇటు రాజకీయ పక్షాలు.. అటు రైతులు.. చర్చించుకుంటున్నారు. కేంద్రం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. ఐతే రైతులపై ఉన్న ప్రేమతో ఈ నిర్ణయం తీసుకోలేదని.. అన్నదాతల సుదీర్ఘ పోరాటం వల్లే సాధ్యమయిందని కాంగ్రెస్‌తో పాటు ఇతర పార్టీల నేతలు అభిప్రాయపడుతున్నారు. ఇది రైతులు సాధించిన విజయమని కొనియాడుతున్నారు. అన్నదాతల పోరాటం చరిత్రలో నిలిచిపోతుందని ప్రశంసిస్తున్నారు. ఏడాది కాలంగా కుటుంబాన్ని.. పొలాన్ని వదిలేసి.. ఉద్యమం చేయడం వల్లే కేంద్రం చట్టాలను వెనక్కి తీసుకుందని చెబుతున్నారు. మరి సాగు చట్టాల రద్దుపై ఎవరు ఏమన్నారో ఇక్కడ చూద్దాం.

''సాగు చట్టాలను వెనక్కి తీసుకుంటూ ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయాన్ని మేం స్వాగతిస్తున్నాం. పార్లమెంట్‌లో చట్టాల రద్దు బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించాల్సి ఉంది. అప్పటి వరకు వేచి చూస్తాం. ఒకవేళ అప్పుడు నిజంగా చట్ట సభల వేదికగా సాగు చట్టాలను రద్దు చేస్తే,  ఏడాది కాలంగా రైతులు చేస్తున్న పోరాటానికి అది చారిత్రక విజయం అవుతుంది.''

-సంయుక్త్ కిసాన్ మోర్చా

''మా ఆందోళనలను ఇప్పుడే విరమించం. పార్లమెంట్‌లో సాగు చట్టాలను రద్దు చేసే వరకు ఎదుచూస్తాం. మద్దతు ధరతో పాటు రైతుల సమస్యలపైనా చర్చ జరగాలి.''

-రాకేశ్ తికాయత్, భారతీయ కిసాన్ యూనియన్ నేత

''దేశ రైతుల తమ సత్యాగ్రహంతో అహంకారం తలను దించుకునేలా చేశారు. అన్యాయంపై విజయం సాధించినందుకు అభినందనలు.''

-రాహుల్ గాంధీ

''అధికారంలో ఉన్న వారి బలం కట్టే ప్రజా బలమే గొప్పది. ఇది మరోసారి నిరూపితమయింది. రైతులు అలుపెరగని పోరాటంతో తమ డిమాండ్లను సాధించుకున్నారు. జై జవాన్. జై కిసాన్.''

''బీజేపీ క్రూర చర్యలకు వెనక్కి తగ్గకుండా  అలుపెరగని పోరాటం చేసిన ప్రతి రైతుకీ నా అభినందనలు. ఇది మీ విజయం. ఈ పోరాటంలో ప్రాణఆలు కోల్పోయిన రైతు కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా.''

- మమతా బెనర్జీ

''ఇది రైతుల విజయం. రోజుల తరబడి వారు ఆందోళన చేేస్తున్నారు. ఇప్పటి వరకు 700 మంది మరణించారు.  దీనికి కేంద్రమే బాధ్యత వహించాలి. కేంద్రం పెద్ద తప్పు చేసింది. ఈ విషయమై పార్లమెంట్‌లో మాట్లాడతాం.''

-మల్లిఖార్జున ఖర్గే

కేంద్రం నిర్ణయంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పంజాబ్, హర్యానాలకు చెందిన అన్నదాతలు పండగ చేసుకుంటున్నారు. ఇది రైతుల విజయమని వేడుకలు చేసుకుంటున్నారు. ఐనప్పటికీ తమ ఆందోళనలను ఉపసంహరించుకోబోమని.. పార్లమెంట్‌లో చట్టాలు రద్దయ్యే వరకు పోరాటం కొనసాగుతుందని చెబుతున్నారు.

First published:

Tags: Farm Laws, Farmer, New Agriculture Acts, PM Narendra Modi

ఉత్తమ కథలు