FANS SHOCKED OVER DHANUSH RESPONSE TO AISHWARYA PAYANI MUSIC VIDEO LAUNCH SNR
భార్యభర్తలుగా విడిపోయారు..స్నేహితులుగా కలిసే ఉన్నారు..ఇంతకీ ఎవరా స్టార్ కపుల్..?
Photo Credit:Twitter
Viral News: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ చేసిన ట్వీట్‌పై సోషల్ మీడియాలో హాట్ హాట్ చర్చ జరుగుతోంది. తన మాజీ భార్య ఐశ్వర్య రూపొందించిన పయని మ్యూజిక్ వీడియోని అభినందిస్తూ చేసిన ట్వీట్‌పై ఫ్యాన్స్ నిరాశపడుతున్నారు. ఇంతకీ ధనుష్ ఐశ్వర్యను అలా సంభోధించడంతోనే ఇంత టాపిక్ నడుస్తోంది.
కొత్త వీడియో ..కొత్త హీరో..చూడటానికి కొత్తగానే ఉంది. డైరెక్టర్ చాలా గ్యాప్ తర్వాత చేసిన ప్రయోగం ఇది. సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth)కుమార్తె ఐశ్వర్య (Aishwarya)పయని (Payani)అనే వీడియో మ్యూజిక్‌ని తెరకెక్కించారు. రీసెంట్గా రిలీజైన మ్యూజిక్ వీడియో అందర్ని ఆకట్టుకుంటోంది. కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్(Choreographer Johnny Master), శ్రష్టివర్మ (Shrashtivarma)లీడ్ రోల్స్‌తో మ్యూజిక్ వీడియోని రూపొందించారు డైరెక్టర్ ఐశ్వర్య. ఈవీడియోని రిలీజ్ చేశారు సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్. ఐశ్వర్య సుమారు 9సంవత్సరాల గ్యాప్ తర్వాత చేస్తున్నమ్యూజిక్ వీడియో ఇది. మ్యూజిక్ వీడియో రిలీజ్ సందర్భంగా తలైవా హర్షం వ్యక్తం చేశారు. తన కుమార్తె డైరెక్టర్ చేసిన వీడియోని రిలీజ్ చేయడం ఎంతో సంతోషాన్ని కలిగించిందన్నారు సూపర్ స్టార్. 9సంవత్సరాల తర్వాత మళ్లీ డైరెక్షన్ చేస్తున్న సందర్భంగా ఆమెకు తన శుభాకాంక్షలు తెలియజేశారు రజనీకాంత్. తండ్రి రజనీకాంత్‌తో పాటు మాజీ భర్త ధనుష్ కూడా స్పందించారు. హీరో ధనుష్ (Dhanush)ఐశ్వర్యను స్నేహితురాలు అంటూ ట్వీట్ చేయడంపై ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు. ఐశ్యర్య దర్శకత్వంలో రూపొందిచన ఈ మ్యూజిక్ వీడియో తమిళ వెర్షన్‌ను సూపర్‌స్టార్ రజినీకాంత్ విడుదల చేయగా, తెలుగు వెర్షన్ 'సంచారి'ని అల్లు అర్జున్, మలయాళ వెర్షన్ 'యాత్రక్కారి'ని మోహన్‌లాల్ రిలీజ్ చేశారు.
9ఏళ్ల తర్వాత మళ్లీ..
సినిమాల్లో హీరోలకు అద్భుతమైన డ్యాన్స్ కంపోజ్ చేసి ప్రేక్షకుల్ని మెప్పించే డ్యాన్స్ మాస్టర్ జానీ పయని సాంగ్‌లో ఓ పేద ప్రేమికుడిగా కనిపించారు. ఆయనకు జోడిగా శ్రష్టి వర్మ నటించింది. ఈ పాటకు అంకిత్ తివారీ బాణీలు అందించగా, అనిరుధ్ ఆలపించారు. తమిళంలో సాగే ఈ పాటకు వివేక సాహిత్యం అందించారు. తొమ్మిది సంవత్సరాల క్రితం ఐశ్వర్య త్రీ సినిమాతో దర్శకురాలిగా పరిచయం అయ్యారు. ఆ తర్వాత వయ్ రాజా వయ్, మరియప్ప, అయిరత్తిల్ ఒరువన్ సినిమాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత ఫ్యామిలీ లైఫ్‌లో బిజీగా ఉండటంతో సినిమాలపై ఫోకస్ తగ్గించారు ఐశ్వర్య.
https://t.co/8ySHN7UOjm Tips Music In Association With Prerna V Arora & Aishwarya Rajinikanth Presents Latest Telugu Song #Sanchari
Conceptualised & Directed by Aishwarya Rajinikanth. Sung By Sagar , Music by Ankit Tiwari, and Lyrics by Shreemani.hope you like it !#thankful
ఆ హీరో, డైరెక్టర్ మధ్య ఏం జరుగుతోంది..
పయని మ్యూజిక్ రిలీజ్ సందర్భంగా మరో ఆసక్తికరమైన డెవలప్మెంట్ చోటుచేసుకుంది. మ్యూజిక్ వీడియోని అభినందిస్తూ ఐశ్వర్య భర్త హీరో ధనుష్ ట్వీట్ చేశారు. అదే ఇప్పుడు కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఐశ్వర్యకు ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు ధనుష్. పయని మ్యూజిక్ వీడియోకు దర్శకత్వం వహించిన నా స్నేహితురాలు ఐశ్యర్యకు శుభాకాంక్షలు అంటూ గాడ్ బ్లెస్ అంటూ ట్వీట్ చేశారు ధనుష్. హీరో ధనుష్ తీరు చూసిన నెటిజన్లు కాస్తా అసహనం వ్యక్తం చేస్తున్నారు.
తట్టుకోలేకపోతున్న ఫ్యాన్స్ ..
ధనుష్, ఐశ్వర్య విడాకుల తర్వాత ఐశ్వర్య ట్విట్టర్ ప్రొఫైల్‌లో తన పేరు పక్కన ధనుష్ పేరును అలాగే ఉంచింది. కానీ ధనుష్ మాత్రం ఆమెను స్నేహితురాలు అని పిలవడం నచ్చడం లేదంటూ నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏంటి అన్న అలా అనేశావ్ అంటూ కామెంట్స్‌ని షేర్ చేసుకుంటున్నారు ఇక వీరిద్దరూ మళ్లీ కలుస్తారని ఆశిస్తున్న అభిమానులు.
ఐశ్వర్య సైతం మాజీ భర్తకు ట్వీట్ ద్వారా రిప్లై ఇచ్చారు. ట్విట్టర్ లో వేరు సందేహాలు ఎక్స్ చేంజ్ చేసుకోవడం ఆసక్తికరంగా మారింది. ఈ స్టార్ కిడ్కి సెలబ్రిటీలు మహేష్ బాబు, అల్లు అర్జున్, మోహన్ లాల్ వంటి స్టార్స్ బెస్ట్ విషెష్ తెలియజేశారు.
Published by:Siva Nanduri
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.