రూ.9కే విమాన టికెట్...'బికినీ ఎయిర్‌లైన్స్' బంపర్ ఆఫర్

ప్రతీకాత్మక చిత్రం

గతంలో ఎయిర్‌హోస్టెస్‌ డ్రెస్సింగ్ విషయంలో వియత్‌జెట్ సంస్థ వివాదంలో నిలిచింది. విమాన సిబ్బంది బికినీలు ధరించి ప్రయాణికులకు ఆహ్వానం పలకడం అప్పట్లో దుమారం రేపింది.

 • Share this:
  వియత్నాంకు చెందిన 'వియత్‌జెట్ ఎయిర్' సంస్థ...'బికినీ ఎయిర్‌లైన్స్‌'గా చాలా ఫేమస్..! ఎయిర్ హోస్టెస్ బికినీ ధరించి ప్రయాణికులకు ఆహ్వానం పలకడం గతంలో వియత్నాంలో పెద్ద దుమారాన్నే రేపింది. ఐతే వియత్‌జెట్ సంస్థ భారత్‌లోనూ సర్వీసులను ప్రారంభిస్తోంది. డిసెంబరు 6 నుంచి హోచి మిన్-ఢిల్లీ, హనోయ్-ఢిల్లీ రూట్లో విమానాలను నడుపుతామని ప్రకటించింది. ఇండియా‌లోకి ఎంట్రీ ఇస్తున్న సందర్భంగా ప్రత్యేక ఆఫర్‌తో ముందుకొచ్చింది వియత్‌జెట్. రూ.9 ప్రారంభ ధరతో టికెట్లు అందిస్తున్నట్లు ప్రకటించింది. 'గోల్డెన్ డేస్' పేరిట ఆగస్టు 20-22 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని తెలిపింది.

  హోచి మిన్-న్యూఢిల్లీ రూట్‌లో వారానికి నాలుగు రోజులు విమానాలను నడపనుంది. సోమ, బుధ, శుక్ర, ఆది వారాల్లో ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయి. హోచిమిన్‌లో రాత్రి 7 గంటలకు విమానం బయలుదేరి రాత్రి 10.50కి ఢిల్లీ చేరుకుంటుంది. ఇక రిటర్న్ ఫ్లైట్ రాత్రి 11.50కి బయలుదేరి ఉదయం 06.10కి హోచిమిన్ సిటీకి చేరుకుంటుంది.

  ఇక హనోయ్-న్యూఢిల్లీలో వారానిని మూడు రోజుల విమానాలను నడుపుతామని ఓ ప్రకటనలో తెలిపింది వియత్ జెట్. మంగళ, గురు, శనివారాల్లో ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయి. హనోయ్‌‌లో రాత్రి 07.10కి విమానం బయలుదేరి రాత్రి 10.50కి న్యూఢిల్లీకి చేరుకుంటుంది. ఇక రిటర్న్ ఫ్లైట్ ఢిల్లీలో రాత్రి 11.50కి బయలుదేరి ఉదయం 05.20కి హనోయ్ చేరుకుంటుంది.

  www.VietJet.com లేదా వియత్‌జెట్ మొబైల్ ద్వారా ప్రయాణికులు విమాన టికెట్లు బుక్ చేసుకోవచ్చని సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. డిసెంబరు 6, 2019- మార్చి 28, 2020 మధ్య ట్రావెల్ ప్లాన్ చేసుకునే ప్రయాణికులు ఆగస్టు20-22 వరకు టికెట్లు బుక్ చేసుకుంటేనే 'గోల్డెన్ డేస్' ఆఫర్ వర్తిస్తుందని తెలిపారు.


  కాగా, వియత్‌జెట్‌ 2011లోొ తన సర్వీసులు ప్రారంభించింది. ప్రపంచవ్యాప్తంగా 129 మార్గాల్లో రోజుకు 400 విమానాలను నడుపుతోంది. ఇప్పటి వరకు 8 కోట్ల మందికి సేవలందించింది. డిసెంబరు నుంచి భారత్‌తో తన సేవలను ప్రారంభించబోతోంది. గతంలో ఎయిర్‌హోస్టెస్‌ డ్రెస్సింగ్ విషయంలో వియత్‌జెట్ సంస్థ వివాదంలో నిలిచింది. విమాన సిబ్బంది బికినీలు ధరించి ప్రయాణికులకు ఆహ్వానం పలకడం అప్పట్లో దుమారం రేపింది. ఈ వ్యవహారంలో వియత్‌జెట్ సంస్థకు వియత్నాం పౌరవిమానయాన ప్రాధికార సంస్థ భారీగా జరిమానా కూడా విధించింది.

  First published: