హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Shocking: మా అక్కను పోలీసులే హింసించి చంపేశారు... మృతురాలి సోదరి ఆవేదన..

Shocking: మా అక్కను పోలీసులే హింసించి చంపేశారు... మృతురాలి సోదరి ఆవేదన..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Uttar pradesh: చందౌలీ జిల్లాలో అమానుష ఘటన సంభవించింది. పోలీసులు.. రైడ్ లో భాగంగా స్థానికంగా ఒక ఇంటిలో ప్రవేశించి వ్యాపారి కుతూరు పట్ల దురుసుగా ప్రవర్తించారు.

Family Claims Woman Dead Assault By police: కొన్ని సందర్భాలలో పోలీసులు నిందితుల పట్ల దారుణంగా వ్యవహరించిన ఉదంతాలు తరచుగా వార్తలలో నిలుస్తున్నాయి. కొందరు కావాలనే పోలీసులు తమ అధికారాన్ని అడ్డంపెట్టుకుని బాధితులను భయభ్రాంతులకు గురిచేస్తుంటారు. మరికొందరు తాము చెప్పినట్లే వినాలంటూ ప్రజలను హింసిస్తుంటారు. కొన్ని చోట్ల పోలీసులు.. ఫిర్యాదులు చేయడానికి వచ్చిన మహిళలు, యువతుల పట్ల నీచంగా కూడా ప్రవర్తిస్తుంటారు.

తమ కోరిక తీర్చాలని వారిని వేధిస్తుంటారు. కొన్ని సంఘటనలలో వారి వ్యాపారంలో తమకు కమిషన్ ఇవ్వాలంటూ బెదిరిస్తుంటారు. ఒక వేళ ఇవ్వకపోతే.. దాడులు చేస్తు అక్రమంగా కేసులు బనాయిస్తుంటారు. అయితే,కొందరు పోలీసులు తప్పులు చేయడం వలన డిపార్ట్ మెంట్ కి సమాజంలో చెడ్డ పేరు వస్తుంది. అయితే, యూపీలో పోలీసులు ఒక కుటుంబాన్ని వేధించిన ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.

పూర్తి వివరాలు.. యూపీలో పోలీసులు ఒక కుటుంబాన్ని భయభ్రాంతులకు గురిచేశారు. రైడ్ లో భాగంగా పోలీసులు.. చందౌలీ జిల్లాలోని ఒక వ్యాపారి ఇంటికి వెళ్లారు. అతను ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. అయితే, రైడ్ సమయంలో వ్యాపారి ఇంటిలో లేడు. కానీ పోలీసులు మాత్రం.. అతని కుటుంబంపై తమ ప్రతాపాన్ని చూపెట్టారు. అతని కుటుంబ సభ్యుల పట్ల దురుసుగా ప్రవర్తించారు. ఇంటిలోని వస్తువులను చిందరవందరగా పాడేశారు. అంతటితో ఆగకుండా.. వ్యాపారి కూతురుని హింసించారు. ఆ కుటుంబాన్ని ఇష్టమోచ్చినట్లు కోట్టారు. దీంతో వ్యాపారి కూతురు కిందపడిపోయింది.

పోలీసులు వెళ్లిపోయాక... ఆమెను ఆస్పత్రికి తరలించంగా అప్పటకే చనిపోయిందని వైద్యులు తెలిపారు. కాగా, పోలీసుల హింసిచడం వలన తమ సోదరి చనిపోయిందని మృతురాలి సోదరి ఆరోపించింది. ప్రస్తుతం ఈ ఘటన యూపీలో తీవ్ర దుమారాన్నిరేపింది. పోలీసుల వాదన మరో విధంగా ఉంది. నిందితుడిపై ఇప్పటికే నాన్ బెయిలేబుల్ వారెంట్ ఉందని అన్నారు. నిందితుడు కావాలనే తప్పించుకుని తిరుగుతున్నాడని, అతడిని అరెస్టు చేయాడానికి తాము.. వెళ్లామని తెలిపారు. ఇప్పటికే పోలీసులు ముందు జాగ్రత్తగా  ఆ ప్రాంతంలో అదనపు బలగాలను మోహరించారు.  మరోవైపు ఈ ఘటనను సమాజ్ వాది పార్టీ ఖండించింది. యూపీలో పోలీసులు రౌడీలుగా మారి ప్రజలను హింసిస్తున్నారని తీవ్ర స్థాయిలో మండిపడింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

Girl Dies Of Food Poisoning In Kerala

కేరళలోని కాసర్ గోడ్ లో షాకింగ్ ఘటన జరిగింది. పాఠశాల విద్యార్థులు తమ స్కూల్ పక్కన ఉన్న దుకాణంలో నుంచి తినుబండారాలు తిన్నారు. కొందరు అక్కడే ఉన్న జ్యూస్ ను తాగారు. అయితే, కాసేపటికే వారికి తీవ్రంగా వాంతులు అయ్యాయి. వెంటనే వారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. ఆస్పత్రికే తరలించే లోపే ఒక బాలిక చనిపోయింది.

అదే విధంగా, మరో 18 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కాగా, తల్లిదండ్రులు హుటాహుటీన ఆస్పత్రులకు తరలి వచ్చారు. విద్యార్థులను చూసిన వైద్యులు ఫుడ్ పాయిజన్ అయ్యిందని ప్రాథమికంగా తెలిపారు. ప్రస్తుతం  విద్యార్థుల ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. పాఠశాల యజామాన్యం ఫిర్యాదు మేరకు పోలీసులు దుకాణ యజమానిపై కేసు నమోదు చేశారు. చనిపోయిన బాలికది కరివల్లోర్ గ్రామమని పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. పోలీసులు దుకాణంలోని శాంపుల్స్ తీసుకుని ల్యాబ్ కు తరలించారు.

Published by:Paresh Inamdar
First published:

Tags: Female harassment, Harassment on women, Police, Uttar pradesh

ఉత్తమ కథలు