హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Army Job Scam: ఆర్మీ జాబ్స్‌లో స్కామ్.. ఉద్యోగం రాకుండానే సైన్యంలో పని చేసిన యువకుడు

Army Job Scam: ఆర్మీ జాబ్స్‌లో స్కామ్.. ఉద్యోగం రాకుండానే సైన్యంలో పని చేసిన యువకుడు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Army Job Scam: ఓ సాబ్‌స్కామ్‌ ద్వారా ఓ యువకుడు నాలుగు నెలలపాటు ఇండియన్‌ ఆర్మీలో పని చేశాడు. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో అతనికి జాబ్‌ రాలేదని, మోసపోయాడని తెలిసింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఇద్దరిని అరెస్ట్‌ చేశారు.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

Army Job Scam:  ఆర్మీలో జాబ్ రావాలంటే ఆషామాషీ వ్యవహారం కాదు. ఎగ్జామ్ క్లియర్ చేయాలి. ఈవెంట్స్‌లో పాస్ అవ్వాలి. కానీ ఇవేమీ లేకుండా.. ఆశ్చర్యపరిచే ఓ సాబ్‌స్కామ్‌ ద్వారా ఓ యువకుడు ఆర్మీలో చేరాడు. జాబ్ రాకుండానే... నాలుగు నెలలపాటు ఇండియన్‌ ఆర్మీ (Indian Army)లో పని చేశాడు. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో అతనికి జాబ్‌ రాలేదని, మోసపోయాడని తెలిసింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఇద్దరిని అరెస్ట్‌ చేశారు. మరొకరు పరారీలో ఉన్నాడు. ఈ జాబ్‌స్కామ్‌ (Indian Army Job Scam) వెనకున్న వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

* యూనిఫాం, ఐడీతో నాలుగు నెలలపాటు పని చేసిన యువకుడు

పఠాన్‌కోట్‌లోని 272 ట్రాన్సిట్ క్యాంప్‌లో 108 ఇన్‌ఫాంట్రీ బెటాలియన్ TA (టెరిటోరియల్ ఆర్మీ) 'మహర్'లో తనకు ఉద్యోగం లభించిందని ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ యువకుడు భావించాడు. ID, యూనిఫాం అందుకొని నాలుగు నెలలపాటు పనిచేశాడు. చివరికి అతను ఉద్యోగానికి రిక్రూట్‌ కాలేదని తెలిసింది. మనోజ్ కుమార్ నాలుగు నెలలు పని చేశాడని, జులైలో విధుల్లో చేరాడని, నెలకు రూ.12,500 జీతం కూడా అందుకున్నాడని మంగళవారం ఆర్మీ వర్గాలు తెలిపాయి.

* మాజీ సైనిక ఉద్యోగి స్కామ్‌

ఘజియాబాద్‌కు చెందిన మనోజ్‌ కుమార్ 20 ఏళ్ల వయసులో జాబ్‌ స్కామ్‌లో చిక్కుకొన్నాడు. భారత సైన్యంలో సిపాయిగా చేరి రాజీనామా చేసిన మీరట్‌లోని దౌరాలా ప్రాంతానికి చెందిన రాహుల్ సింగ్ అనే వ్యక్తి మనోజ్‌ కుమార్‌ను మోసం చేశాడు. అతని నుంచి రూ.16 లక్షలు తీసుకుని రిక్రూట్ చేశాడు. రిక్రూట్‌మెంట్ స్కామ్‌లో సింగ్‌ సహాయకులలో ఒకరిని మంగళవారం అరెస్టు చేశారు.

MI(మిలిటరీ ఇంటెలిజెన్స్) తెలిపిన వివరాల ఆధారంగా.. మీరట్ పోలీసులు రాహుల్ సింగ్, అతని సహచరులలో ఒకరైన బిట్టు సింగ్‌ను అరెస్టు చేశారు. మరో సహాయకుడు రాజా సింగ్ పరారీలో ఉన్నాడు. టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా వద్ద ఉన్న ఎఫ్‌ఐఆర్ కాపీ మేరకు.. కుమార్‌ ఫైల్‌ చేసిన ఎఫ్‌ఐఆర్‌తో నిందితులు ముగ్గురిపై IPC సెక్షన్లు 420 (మోసం), 467 (విలువైన భద్రతను ఫోర్జరీ చేయడం), 471 (మోసం), 406 (నేరపూరిత విశ్వాస ఉల్లంఘన), 323 (స్వచ్ఛందంగా గాయపరచడం), 506 (నేరపూరిత బెదిరింపు), 120B (నేరపూరిత కుట్ర) సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి.

2019 అక్టోబర్ 22న ఆర్మీలో చేరిన రాహుల్ సింగ్ (25) ఆరోగ్య కారణాలతో రాజీనామా చేశాడు. ఉద్యోగంలో ఉన్న సమయంలో అతను ఉన్నత స్థాయి అధికారిలా నటించేవాడు. యువ ఔత్సాహికులను రిక్రూట్‌ చేసుకోవడం సాయం చేస్తానని చెప్పుకునేవాడు. అతనితోపాటు ఉన్న మరో ఇద్దరు ఈ వివరాలను చెప్పి యువకులను ఆకర్షించేవారు. అలా వారి మాయలో పడిన వ్యక్తే కుమార్. రిక్రూట్ అయినట్లు మనోజ్‌ కుమార్‌ను నమ్మించడానికి సింగ్ అతన్ని యూనిఫాంలో పోస్ట్‌కి పిలిచి, సెంట్రీ డ్యూటీని నిర్వహించడానికి అతనికి రైఫిల్‌ను అందజేసినట్లు ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా దగ్గర ఉన్న వీడియోలో కుమార్ రైఫిల్‌ని పట్టుకుని ఉన్నట్లు తెలుస్తోంది.

Lavil Siva Temple: 600 ఏళ్లనాటి శివాలయం పునరుద్ధరణకు ముస్లింల తోడ్పాటు.. కేరళలో మత సామరస్యం

దీని గురించి కుమార్ మాట్లాడుతూ.. తనను 272 ట్రాన్సిట్ క్యాంప్‌కు పిలిచారని, సీనియర్‌గా నటిస్తున్న ఆర్మీ అధికారి క్యాంపు లోపలికి తీసుకెళ్లారని చెప్పాడు. వంట చేసే నైపుణ్యాలు, శారీరక పరీక్ష నిర్వహించారన్నారు. కొన్ని రోజులకు రిక్రూట్ అయ్యానని రాహుల్ సింగ్ సమాచారం ఇచ్చాడని తెలిపాడు. ప్రారంభంలో అనేక ఉద్యోగాలు చేయాల్సి వచ్చిందని, ఇన్సాస్ రైఫిల్ కూడా అందజేశారని, క్యాంప్‌లోనే సెంట్రీగా పోస్ట్ చేశారని చెప్పాడు. సమయం గడిచేకొద్దీ, నేను ఇతర జవాన్లతో మాట్లాడిన సందర్భంలో వారికి నా అపాయింట్‌మెంట్ లెటర్. ఐడీ చూపినప్పుడు అవి నకిలీవని చెప్పారని వివరించాడు.

First published:

ఉత్తమ కథలు