FAIZABAD MAN CHOSEN FOR PADMA SHRI LIES BEDRIDDEN AWAITING TREATMENT SU
సామాజిక సేవతో పద్మశ్రీ అవార్డుకు ఎంపికయ్యాడు.. నేడు అనారోగ్యంతో మంచాన పడ్డాడు.. వైద్యానికి డబ్బులేక అవస్థలు..
మహ్మద్ షరీఫ్(ఫైల్ ఫొటో)
అతని సామాజిక సేవను గుర్తించి కేంద్ర ప్రభుత్వం గతేడాది పద్మశ్రీ పురస్కారం ప్రకటించింది. అయితే ప్రస్తుతం తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు.. వైద్యం చేయించుకోవడానికి డబ్బులు లేవు.
అతని సామాజిక సేవను గుర్తించి కేంద్ర ప్రభుత్వం గతేడాది పద్మశ్రీ పురస్కారం ప్రకటించింది. అయితే ప్రస్తుతం తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు.. వైద్యం చేయించుకోవడానికి డబ్బులు లేవు. వివరాలు.. ఉత్తరప్రదేశ్‌లోని ఫైజాబాద్‌కు చెందిన మహ్మద్ షరీఫ్ గత 25 ఏళ్ల కాలంలో 25వేలకు గుర్తుతెలియని మృతదేహాలకు అంత్యక్రియల నిర్వహించాడు. దీనిని గుర్తించిన ప్రభుత్వం ఆయనకు 2020లో పద్మశ్రీ అవార్డుకు ఎంపికచేసింది. అయితే వయస్సు పైబడటంతో కొన్ని రోజులుగా షరీఫ్ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. పూర్తిగా మంచానికే పరిమితమయ్యాడు. పూర్తిగా అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. అయితే పేదరికం కారణంగా కుటుం సభ్యులు షరీఫ్‌కు వైద్యం చేయించలేపోతున్నారు. షరీఫ్‌కు వైద్యం చేయించేందుకు వీలుగా ప్రభుత్వం పెన్షన్ మంజూరు చేయాలని కోరుతున్నారు.
షరీఫ్ కొడుకు షగీర్ మాట్లాడుతూ.. "గతేడాది నా తండ్రి షరీఫ్ పద్మ శ్రీ అవార్డుకు ఎంపిక చేయబడ్డట్టు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నుంచి లేఖ వచ్చింది. జనవరి 31, 2020న కేంద్ర హోం శాఖ కార్యదర్వి అజయ్‌కుమార్ భల్లా పేరుతో ఆ లేఖ వచ్చింది. అవార్డు ప్రధానం చేసే తేదీని త్వరలోనే తెలియజేస్తామని అందులో పేర్కొన్నారు. ఫైజాబాద్ బీజేపీ ఎంపీ లల్లు సింగ్ సిఫారస్ మేరకు నా తండ్రిని ఈ అవార్డుకు ఎంపిక చేశారు. అయితే అవార్డు స్టేటస్ గురించి లల్లు సింగ్‌ను అడిగినప్పుడు ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇంకా అవార్డు అందుకోలేదా అంటూ మమల్ని ప్రశ్నించారు. ఆ విషయాన్ని పరిశీలిస్తానని మాతో చెప్పారు. ప్రస్తుతం కుటుంబ పోషణ భారంగా మారింది. ఇంటి ఖర్చులకు కూడా తీవ్రంగా శ్రమించాల్సి వస్తోంది. డబ్బులు లేకపోవడం వల్ల అనారోగ్యంతో బాధపడుతున్న నా తండ్రికి వైద్యం కూడా చేయించలేకపోతున్నాం" అని చెప్పాడు.
ఇక, తాను ప్రైవేటు డ్రైవర్‌గా పనిచేసి నెలకు రూ. 7,000 సంపాదిస్తున్నట్టు షగీర్ చెప్పాడు. అయితే తన తండ్రి చికిత్సకే నెలకు కనీసం రూ. 4 వేలు ఖర్చవుతుందని తెలిపాడు. ఇంతకాలం చికిత్స కోసం స్థానిక వైద్యుడిపై ఆధారపడ్డామని.. ఇప్పుడు ఆ ఖర్చులను కూడా భరించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశాడు.