మహారాష్ట్రలో హైడ్రామా... సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం

పార్లమెంట్‌లో NCP నేత శరద్ పవార్... ప్రధాని మోదీని కలిసిన తర్వాతే... పరిణామాలు మారాయి. మహారాష్ట్రలో ఓ సీఎం పూర్తిస్థాయిలో పరిపాలించి, మళ్లీ ఆయనే సీఎం అయిన సందర్భం ఇదివరకు లేదు. ఆ రికార్డు ఫడ్నవీస్‌కి దక్కినట్లైంది.

news18-telugu
Updated: November 23, 2019, 11:00 AM IST
మహారాష్ట్రలో హైడ్రామా...  సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం
దేవేంద్ర ఫడ్నవీస్
  • Share this:
మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం అత్యంత సీక్రెట్‌గా అర్థరాత్రి జరిగిపోయింది. మహారాష్ట్ర కొత్త సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేశారు. ఉప ముఖ్యమంత్రిగా NCP నేత అజిత్ పవార్ ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ భగత్ సింగ్ కోషియారీ... దేవేంద్ర ఫడ్నవీస్‌ను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమని ఆహ్వానించడం, ఆయన వెంటనే సీఎంగా ప్రమాణం చేయడం అన్నీ చకచకా జరిగిపోయాయి. ఐతే... నిన్నటి వరకూ... కాంగ్రెస్, శివసేనతో కలిసిన ఎన్సీపీ... రాత్రికి రాత్రి పార్టీలో చీలిక రావడంతో... ప్లేట్ తిప్పేసింది. వెంటనే బీజేపీతో చేతులు కలిపింది. దాంతో... మహారాష్ట్రలో బీజేపీ, ఎన్సీపీ ప్రభుత్వం ఏర్పాటైనట్లైంది. ఐతే... ఈ విషయం తెల్లారే వరకూ బయటకు తెలియనివ్వకుండా బీజేపీ జాగ్రత్తపడి... శివసేన రాజకీయాలకు బ్రేక్ వేసింది. ప్రధాని మోదీ... ఫడ్నీవీస్, అజిత్ పవార్‌కి శుభాకాంక్షలు తెలిపారు.మహారాష్ట్రలో నిన్నటివరకూ రాష్ట్రపతి పాలన ఉండేది. దాన్ని రద్దు చేస్తూ... రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్... హోంశాఖకు లేఖ పంపారు. దాంతో మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలనను ఎత్తివేస్తూ కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఆ తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది.

రాష్ట్రపతి ఉత్తర్వు
మహారాష్ట్ర సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తున్న దేవేంద్ర ఫడ్నవీస్


ప్రజల మద్దతు తమ పక్షానే ఉందని... ఫడ్నవీస్ తెలిపారు. పార్లమెంట్‌లో NCP నేత శరద్ పవార్... ప్రధాని మోదీని కలిసిన తర్వాతే... పరిణామాలు మారాయి. మహారాష్ట్రలో ఓ సీఎం పూర్తిస్థాయిలో పరిపాలించి, మళ్లీ ఆయనే సీఎం అయిన సందర్భం ఇదివరకు లేదు. ఆ రికార్డు ఫడ్నవీస్‌కి దక్కినట్లైంది.

శుభాకాంక్షలు తెలుపుకుంటున్న దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్


288 అసెంబ్లీ సీట్లున్న మహారాష్ట్రలో బీజేపీ 105 స్థానాల్లో విజయం సాధించింది. శివసేన 56 సీట్లు గెలిచింది. ఇక ఎన్సీపీ 54, కాంగ్రెస్ పార్టీ 44 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే కనీసం 145 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉండాలి. ఆ లెక్కన బీజేపీ+ఎన్సీపీ కలిపి... 105+54 = 159. అందువల్ల ప్రభుత్వ ఏర్పాటుకు ఎలాంటి సమస్యా లేకుండా పోయింది.


Pics : అందాల విందు చేస్తున్న అన్వేషి జైన్ఇవి కూడా చదవండి :

మలైకా అరోరాకి చేదు అనుభవం... కొంపముంచిన డ్రెస్...

జగన్ 6 నెలల పాలనపై పవన్ కళ్యాణ్ 6 అస్త్రాలు...

గుంటూరులో హైటెక్ వ్యభిచారం... 70 జంటలు అరెస్ట్

నిత్యానంద ఆచూకీ లభ్యం... ఆ దేశంలో...

త్వరలో కొత్త బార్లు... ఇవీ రూల్స్
Published by: Krishna Kumar N
First published: November 23, 2019, 8:19 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading