దూర ప్రయాణం చేయాలనుకుంటే అందరూ ముందుగా రైలు ప్రయాణాన్నే ఎంచుకుంటారు. అందులోనూ స్లీపర్ క్లాస్ టికెట్లకే మొదటి ప్రాధాన్యత ఇస్తారు. ఎంచక్కా పడుకొని సుఖవంతంగా ప్రయాణం చేయవచ్చు. రాత్రివేళల్లో హాయిగా నిద్రపోవచ్చు. ఐతే రైళ్లలో నిద్రకు సంబంధించి సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. రైలు ప్రయాణాలంటే నిద్రపోవాలంటే ఇకపై 10 శాతం అదనపు చార్జీ చెల్లించాలంటూ ప్రచారం జరుగుతోంది. పలు వార్తా సంస్థలు సైతం కథనాలను ప్రచురించాయి. మరి ఇందులో నిజమెంత?
ఐతే ఈ వార్తలపై PIB ఫ్యాక్ట్ చెక్ టీమ్ స్పందించింది. ఇందులో నిజంలేదని.. ఇది ఫేన్ న్యూస్ అని కొట్టిపారేసింది. రైళ్లో నిద్రపోవాలంటే ఇకపై 10శాతం అదపు చార్జీలను చెల్లించాలని వస్తున్న వార్తలు నిరధారమైనవవి స్పష్టం చేసింది. ఇలాంటి అసత్య ప్రచారాలను నమ్మవద్దని ప్రజలకు సూచించింది. 10శాతం చెల్లింపునకు సంబంధించి రైల్వే బోర్డు కేవలం సూచన మాత్రమే చేసిందని.. దీనిపై నిర్ణయం తీసుకోలేదని క్లారిటీ ఇచ్చింది.
कुछ मीडिया रिपोर्ट्स में दावा किया जा रहा है कि जो यात्री ट्रेन में नींद लेकर सफर करना चाहें, रेलवे उनसे 10% अधिक किराया वसूल सकता है।#PIBFactCheck: यह दावा #भ्रामक है। यह केवल #Railwayboard को दिया गया एक सुझाव था। @RailMinIndia ने ऐसी कोई घोषणा नहीं की है। pic.twitter.com/M4UFasUo6V
— PIB Fact Check (@PIBFactCheck) March 13, 2021
మరోవైపు ఏసీ కోచ్‌లో ఉండే బెడ్ రోల్స్ చార్జీలు పెరిగాయని కూడా ప్రచారం జరుగుతోంది. దీనిపై మాత్రం రైల్వేశాఖ ఇప్పటి వరకు స్పందించలేదు.
ఫేస్బుక్, ట్విటర్ ఓపెన్ చేస్తే చాలు.. ఏవేవో పోస్టులు కనిపిస్తున్నాయి. వేలాది వార్తలు దర్శనమిస్తాయి. వాట్సప్‌కు కుప్పలు తెప్పలుగా వార్తలు సందేశాల రూపంలో వస్తున్నాయి. మరి అందులో ఏవి నిజమైనవి? ఏవి తప్పుడు ప్రచారాలో.. తెలియక జనాలు తికమకపడుతున్నారు. సోషల్ కొందరు ఉద్దేశపూర్వకంగా చేసే అసత్య ప్రచారాలను నిజమని నమ్ముతున్నారు. గుడ్డిగా ఫార్వర్డ్ చేసి చిక్కుల్లోపడుతున్నారు. అందుకే వాట్సాప్‌లో వచ్చే ప్రతి వార్తనూ నమ్మవద్దు. ఇతర మీడియా విభాగాల్లో చెక్ చేసిన తర్వాతే ధృవీకరించుకోవాలి. లేదంటే ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. అసలే సోషల్ మీడియాపై కేంద్రం కఠినమైన నిబంధనలను తెచ్చింది. ఐనప్పటికీ ఇంకా ఎన్నో పుకార్లు, తప్పుడు వార్తలు షికారు చేస్తూనే ఉన్నాయి.
కాగా, కేంద్ర ప్రభుత్వ పథకాలు, నిర్ణయాల, ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించి అంశాలపై తప్పుడు ప్రచారం జరుగుతుంటే వాటిపై PIB ఫ్యాక్ట్ చెక్ స్పష్టత ఇస్తుందన్న విషయం తెలిసిందే.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Fact Check, Fake news, False news, Indian Railways, Irctc