• HOME
 • »
 • NEWS
 • »
 • NATIONAL
 • »
 • FACT CHECK WHAT IS HOP SHOOTS WHO GROW THEM IN BIHAR WHAT IS THE WRONG IN THAT NEWS NK

Fact Check: బీహార్ రైతు హాప్ షూట్స్ సాగు చేశాడా... కేజీ రూ.లక్షకు అమ్మాడా?

Fact Check: బీహార్ రైతు హాప్ షూట్స్ సాగు చేశాడా... కేజీ రూ.లక్షకు అమ్మాడా?

బీహార్ రైతు హాప్ షూట్స్ సాగు చేశాడా... కేజీ రూ.లక్షకు అమ్మాడా? (image credit - twitter)

Fact Check: బీహార్‌లో ఓ రైతు హాప్ షూట్స్ ('Hop Shoots') సాగు చేసి... వాటిని కేజీ రూ.లక్ష చొప్పున అమ్మాడనేది తాజా వార్త. అందులో నిజానిజాలు మనం తెలుసుకుందాం.

 • Share this:
  Fact Check: బీహార్ నుంచి వైరల్ వార్తలు పెద్దగా రావు. ఎన్నికలప్పుడు తప్పితే... మిగతా సమయంలో ఆ రాష్ట్రం అసలు వార్తల్లోనే నిలవదు. అలాంటి బీహార్ నుంచి ఓ సంచలన వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఏంటంటే... బీహార్‌కి చెందిన ఓ రైతు... హాప్ షూట్స్ అనే ఒకరకమైన కూరగాయలను పండించి... వాటిని మార్కెట్‌లో కేజీ రూ.లక్ష చొప్పున అమ్మాడన్నది వార్త. చాలా మంది ఇది నిజమేనేమో అనుకున్నారు. అదేం కూరగాయ.. దాన్ని ఎలా పండించాడు... అని ప్రశ్నలు వేసుకున్నారు. ఇందులో నిజానిజాలను బయటకు లాగేందుకు న్యూస్18 ఫాక్ట్ చెక్ టీమ్ రంగంలోకి దిగింది. దర్యాప్తులో ఈ మొత్తం కహాని పూర్తిగా అబద్ధం అని తేల్చింది.

  కహానీ ప్రకారం... 38 ఏళ్ల రైతు అమ్రేష్ సింగ్ (Amresh Singh) బీహార్‌లోని ఔరంగాబాద్ జిల్లా... కరందీ గ్రామానికి చెందిన వాడు. అతను రూ.2.5 లక్షల పెట్టుబడి పెట్టి... హాప్ షూట్స్ పండించాడు. ఈ రకం మొక్కలను అంతర్జాతీయ కూరగాయల మార్కెట్లలో కొంటూ ఉంటారు. వీటి ధర కేజీ రూ.85,000 నుంచి రూ.1 లక్ష దాకా ఉంటుంది. అమ్రేషన్ సింగ్... తన పొలంలో ఈ పంట పండించాడు. ఎక్కువ దిగుబడి రావాలనే ఉద్దేశంతో... ఎలాంటి రసాయన ఎరువులూ వాడలేదనీ... సాధారణంగానే పండించానని తెలిపాడు.

  ది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ప్రకారం అమ్రేష్ సింగ్... ఈ పంటను ప్రయోగాత్మకంగా వేశాడు. 60 శాతం పంటను అనుకున్న విధంగా పండించగలిగాడు. సీనియర్ ప్రభుత్వాధికారి సుప్రియా సాహుతోపాటూ... చాలా మంది సోషల్ మీడియా యూజర్లు... అమ్రేజ్ పంటపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. అమ్రేష్‌ని మెచ్చుకున్నారు. అతని వల్ల మిగతా రైతులు కూడా ఇలాంటి పంటలు పండిస్తారనీ... అతను మిగతా రైతులకు ఆదర్శంగా నిలిచాడని ప్రశంసించారు. అతను కేజీ హాప్ షూట్లను రూ.లక్ష చొప్పున అమ్మాడని చెప్పారు.

  ఈ పోస్టులు వైరల్ అవ్వడంతో... చాలా మంది అసలు హాప్ షూట్స్ అంటే ఏంటి, ఎలా సాగు చెయ్యాలి, వాటి ధర ఎంత పలుకుతుంది వంటి విషయాలు తెలుసుకునేందుకు ఇంటర్నెట్‌లో సెర్చ్ చేశారు.

  ఐతే.. శనివారం దైనిక్ జాగరణ్ న్యూస్ పేపర్... అసలు ఆ రైతు అలాంటి పంటనే పండించలేదని చెప్పింది. మీడియాకు చెందిన కొందరు అమ్రేష్ గ్రామానికి వెళ్లారు. అక్కడ అలాంటి పంటే కనిపించలేదు. సోషల్ మీడియాలో వచ్చినదంతా వట్టి పుకారే అని తేల్చేశారు. తమకు తెలిసి అక్కడ అలాంటి పంట ఏదీ పండించట్లేదని స్థానిక రైతులు చెప్పారు.

  Hop shoots అంటే ఏంటి:
  ఈ మొక్కల సైంటిఫిక్ నేమ్ humulus-lupulus. వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ లాల్ పర్యవేక్షణలో... వారణాసిలోని కూరగాల పరిశోధనా కేంద్రంలో వీటిని పెంచారు. కొన్ని రిపోర్టుల ప్రకారం... అమ్రేష్... ఈ మొక్కలను సాగు చేయడానికి కొనుక్కున్నాడు. ఈ మొక్కల పువ్వులను హాప్ కోన్స్ లేదా స్ట్రోబైల్ అంటారు. వీటని బీర్ తయారీలో ఉపయోగిస్తారు. మొక్క మిగతా భాగాలను ఆహారంలో, మందులలో ఉపయోగిస్తారు. మొత్తానికి ఆ రైతు ఈ పంట వెయ్యకపోయినా... పరిశోధనలు జరుగుతున్నాయి కాబట్టి త్వరలోనే ఇండియాలో ఈ మొక్కల సాగు మొదలవుతుందని అనుకోవచ్చు.
  Published by:Krishna Kumar N
  First published:

  అగ్ర కథనాలు