PM Kanya Aashirwad Yojana: కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రధాని కన్య ఆశీర్వాద పథకం తెచ్చిందనీ... ఈ స్కీమ్ కింద కేంద్రం దేశంలోని ప్రతి అమ్మాయికీ రూ.2,000 ఇస్తుందని... సోషల్ మీడియాలో పోస్టులు చక్కర్లు కొడుతున్నాయి. ఇది చదవి చాలా మంది ఈ పథకాన్ని ఎలా పొందాలి, ఎలా అప్లై చేసుకోవాలి అని అడుగుతున్నారు. కొందరైతే... ఇలాంటి పథకం తెచ్చిన విషయమే తమకు తెలియదని అంటున్నారు. మరికొందరు బాలికల సంక్షేమం కోసం కేంద్రం మరో అడుగు ముందుకు వేసిందని మెచ్చుకుంటున్నారు. ఈ పథకం అందరూ పొందేలా ఈ పోస్టును అందరికీ షేర్ చేస్తాను అంటున్నారు మరికొందరు. ఇలా ఆ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. లైక్స్, షేరింగ్స్ పెరిగాయి.
వాస్తవమేంటంటే... అసలు ఇలాంటి పథకాన్ని కేంద్రం ప్రవేశపెట్టలేదు. అందువల్ల ఆ దిక్కుమాలిన పోస్టును మనం నమ్మాల్సిన పనిలేదు. ఇలాంటి అసత్య ప్రచారాలు సోషల్ మీడియాలో ఎక్కువైపోవడంతో... ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) స్వయంగా వీటిని ఖండించడం ప్రారంభించింది. తాజా పోస్ట్ కూడా ఈ సంస్థ దృష్టికి వచ్చింది. ఇదెక్కడి నుంచి పుట్టింది అనుకుంటూ దాన్ని ఖండిస్తూ... ట్వి్ట్టర్లో అధికారిక ప్రకటన చేసింది. ఇలాంటి పథకాన్ని కేంద్రం ప్రవేశపెట్టలేదని క్లారిటీ ఇచ్చింది.
दावा: प्रधानमंत्री कन्या आशीर्वाद योजना के तहत सभी बेटियों को मिलेगी ₹2000 की नगद राशि हर महीने ।
हकीकत: यह दावा झूठा है। केंद्र सरकार द्वारा ऐसी कोई भी योजना नहीं चलाई जा रही है|
निष्कर्ष: #FakeNews pic.twitter.com/kGqyH6LGEh
— PIB Fact Check (@PIBFactCheck) February 10, 2020
మహిళలు, బాలికలు, శిశువుల సంరక్షణ, పథకాలకు సంబంధించిన వివరాలను కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారిక వెబ్సైట్లో చూసి తెలుసుకోవచ్చు. ఆ సైట్లో ఇలాంటి పథకం వివరాలు ఏవీ లేవు. అంటే ఎవరో కావాలనే ఇలాంటి అసత్య ప్రచారం చేస్తూ... సొంత ప్రయోజనాలు పొందుతున్నారని మనం అర్థం చేసుకోవచ్చు.
ఇది కూడా చదవండి:Vastu Shastra: ఇంట్లో ఈ వస్తువులు ఉంటే అపశకునమే... ఇలా చెయ్యండి
సోషల్ మీడియాతో డేంజరే:
ఈ రోజుల్లో ప్రతీదీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చాలా మంది కావాలని లేని పోనివి క్రియేట్ చేసి... షేర్ చేసి... ప్రజల్ని మోసం చేయడం ద్వారా ఆనందం పొందుతూ ఉంటారు. అదో రకమైన సైకో మెంటాలిటీ. అలాంటి వారు ఇలాంటివి క్రియేట్ చేసి... ప్రజల్లోకి వదిలేస్తారు. అందువల్ల సోషల్ మీడియాలో కనిపించే ప్రతీదీ మనం నమ్మేయకూడదు. ఏదైనా అధికారిక వర్గాల నుంచి వచ్చిన వాటినే నమ్మితే, ఏ సమస్యా ఉండదని PIB తెలిపింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Fact Check, Narendra modi, National News