FACT CHECK SENDING ANY NEGATIVE POST OR VIDEO AGAINST PM MODI CAN LEAD TO ARREST HERE IS TRUTH GH SK
Fact Check: వాట్సప్‌లో ప్రధాని మోదీకి వ్యతిరేకంగా మెసేజ్‌లు పంపితే అరెస్ట్ చేస్తారా?
(ప్రతీకాత్మక చిత్రం)
సోషల్ మీడియా ప్లాట్‌ఫాంల ద్వారా చేసే అన్ని కాల్స్‌ను అధికారులు రికార్డ్ చేసి, వాటిని సేవ్ చేస్తారని ఈ ఫేక్ మెస్సేజ్‌లో రాశారు. యూజర్లు వాడే డివైజ్‌లు కూడా మంత్రిత్వ శాఖ సిస్టమ్‌కు కనెక్ట్ అవుతాయని, అందువల్ల ఎవరికీ తప్పుడు మెస్సేజ్‌లు పంపకుండా జాగ్రత్త వహించాలని పేర్కొన్నారు.
గత రెండు రోజులుగా కొత్త ఐటీ నిబంధనల అమలు.. వాటిపై వాట్సాప్, ట్విట్టర్ అసంతృప్తి వ్యక్తం చేయడం.. ఆ సంస్థల వాదనను కేంద్రం ఖండించడం.. వంటి వార్తలను టెక్ ప్రపంచం నిశితంగా గమనిస్తోంది. కొత్త నిబంధనలకు సోషల్ మీడియా కంపెనీలు కట్టుబడి ఉండాల్సిందేనని కేంద్రం తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో వాట్సాప్ గ్రూపుల్లో గురువారం రాత్రి షేర్ చేసిన నకిలీ మెస్సేజ్ ఒకటి వైరల్ అవుతోంది. వాట్సాప్ మెస్సేజ్‌లు, కాల్స్, వీడియో కాల్స్‌కు సంబంధించి శుక్రవారం నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయని దాంట్లో రాశారు. యూజర్లు జాగ్రత్తగా ఉండాలని పేర్కొన్నారు. వాట్సాప్‌తో పాటు ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ వంటి అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలను కేంద్రం పర్యవేక్షిస్తోందని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టే వారిని అరెస్టు చేస్తారని రాశారు. ఇవి కొంతమంది వినియోగదారులను భయాందోళలకు గురిచేశాయి.
సోషల్ మీడియా ప్లాట్‌ఫాంల ద్వారా చేసే అన్ని కాల్స్‌ను అధికారులు రికార్డ్ చేసి, వాటిని సేవ్ చేస్తారని ఈ ఫేక్ మెస్సేజ్‌లో రాశారు. యూజర్లు వాడే డివైజ్‌లు కూడా మంత్రిత్వ శాఖ సిస్టమ్‌కు కనెక్ట్ అవుతాయని, అందువల్ల ఎవరికీ తప్పుడు మెస్సేజ్‌లు పంపకుండా జాగ్రత్త వహించాలని పేర్కొన్నారు. అయితే ఇవన్నీ అపోహలేనని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇలాంటి నకిలీ వార్తలను నమ్మి అనవసరంగా ఆందోళన చెందవద్దని అధికార వర్గాలు ప్రకటించాయి.
రాజకీయాలు, ప్రస్తుత పరిస్థితులకు సంబంధించి.. ప్రభుత్వానికి, ప్రధానమంత్రికి వ్యతిరేకంగా ఎలాంటి చెడు పోస్ట్ లేదా వీడియోలు పంపవద్దని ఈ వైరల్ మెస్సేజ్‌లో ఉంది. ‘అమల్లోకి వచ్చిన కొత్త నియమాల ప్రకారం.. ప్రస్తుతం ఏదైనా రాజకీయ లేదా మతపరమైన సమస్యలపై మెస్సేజ్‌లు రాయడం, పంపడం నేరం. అలా చేసిన వారిని ఎలాంటి వారెంట్ లేకుండానే అరెస్టు చేయవచ్చు. దానిపై సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తారు. ఇది చాలా తీవ్రమైనది. అందువల్ల అందరూ జాగ్రత్తగా ఉండాలి’ అని ఈ నకిలీ మెస్సేజ్‌లో రాశారు.
వాట్సాప్ మెస్సేజ్‌కు మూడు టిక్ మార్క్స్ ఉంటాయని కూడా ఈ ఫేక్ మెస్సేజ్‌లో ఉంది. ‘మెస్సేజ్‌కు మూడు బ్లూ టిక్ మార్క్‌లు వస్తే.. ప్రభుత్వం మెస్సేజ్‌ను గమనించిందని అర్థం. రెండు బ్లూ కలర్, ఒకటి రెడ్ కలర్ టిక్ మార్క్ కనిపిస్తే.. ప్రభుత్వం మీపై చర్యలు తీసుకోవచ్చు. ఒక బ్లూ కలర్, రెండు రెడ్ కలర్ టిక్ మార్క్‌లు వస్తే.. ప్రభుత్వం మీ వివరాలను తనిఖీ చేస్తోందని అర్థం. మెస్సేజ్‌కు మూడు రెడ్ మార్క్‌లు వస్తే.. ప్రభుత్వం మీపై చర్యలు ప్రారంభించిందని భావించాలి’ అని వైరల్ మెస్సేజ్‌లో ఆకతాయిలు రాశారు.
ఆ మెస్సేజ్ చివర్లో.. "బాధ్యతాయుతమైన పౌరుడిగా ఉండండి.. మీ స్నేహితులతో దీన్ని పంచుకోండి" అని రాసి ఉంది. ఈ వాక్యాన్ని చూస్తేనే, అది నకిలీ వార్త అని తెలుస్తోంది. అందువల్ల ఇలాంటి ఫేక్ మెస్సేజ్‌లను నమ్మవద్దని, వాటిని షేర్ చేసి నకిలీ వార్తలను వైరల్ చేయవద్దని అధికార వర్గాలు తెలిపాయి.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.