Fact Check Unlock 5.0: సోషల్ మీడియా తేనెపూసిన కత్తి లాంటిది. అందులో వచ్చే చాలా వార్తలు తేనెలా తియ్యగా ఉంటాయి. ఇంకే ముంది అద్భుతం జరిగిపోతుంది అంటాయి... తీరా చూస్తే ఏమీ ఉండదు. వాటిని నమ్మామంటే... చేదు గుళికలవుతాయి. సోషల్ మీడియాలో 90 శాతం ఇలాంటి వార్తలే చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా కొత్త పుకారు పుట్టింది. కరోనా వల్ల దేశ ప్రజలు కష్టాల పాలయ్యారు కాబట్టి... వారిని అదుకోవడానికి... ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ప్రత్యేక ప్యాకేజీ సిద్ధం చేశారనీ... అన్‌లాక్ 5.0లో భాగంగా... ప్రతి ఒక్కరి బ్యాంక్ అకౌంట్లో రూ.3000 జమ చెయ్యబోతున్నారనే వార్త చక్కర్లు కొడుతుంది. ప్రధాన మంత్రి మన్ధన్ యోజన కింద ఉన్న అకౌంట్లలోకి ఈ డబ్బు వస్తుందని యూట్యూబ్‌లో ఓ వీడియో ఊదరగొడుతోంది. అది కాస్తా వైరల్ అయ్యింది.
అంతా ఉత్తిదే:
నిజమేంటంటే... కేంద్ర ప్రభుత్వం ఇలాంటి ప్రకటన ఏదీ చెయ్యలేదు. ఆ వీడియో పూర్తిగా ఫేక్ అని తేలింది. ఈ ఫేక్ న్యూస్‌ని ఖండిస్తూ... ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో... ఓ ట్వీట్ పెట్టింది. "ఓ యూట్యూబ్ వీడియోలో... కేంద్ర ప్రభుత్వం నెలకు రూ.3000 చొప్పున అన్ని అకౌంట్లలోనూ డబ్బు జమ చేస్తుందని ఉంది. అలాంటి స్కీమ్ ఏదీ లేదు. కేంద్ర ప్రభుత్వం అలా డబ్బు ఇవ్వట్లేదు" అని ట్వీట్లో స్పష్టం చేసింది.
दावा: एक #YouTube वीडियो में यह दावा किया जा रहा है कि केंद्र सरकार प्रधानमंत्री मानधन योजना के तहत सभी के खातों में प्रति माह 3000 रुपए की नगद राशि दे रही है।#PIBFactCheck: यह दावा फ़र्ज़ी है। केंद्र सरकार ऐसी किसी योजना के तहत प्रति माह 3000 रुपए नहीं दे रही है। pic.twitter.com/ZwcFRNfijt
— PIB Fact Check (@PIBFactCheck) October 5, 2020
నిజంగా అలా కేంద్రం డబ్బు ఇస్తే... పేదలకు ప్రయోజనమే. కానీ ఇవ్వకపోయినా... ఇస్తుందని ప్రచారం చేయడం మాత్రం కరెక్టు కాదు. అది చట్టరీత్యా నేరం కూడా. ఇలాంటి అసత్య వార్తలతో ప్రజలు మోసపోకూడదనే... కేంద్ర ప్రభుత్వం డిసెబర్ 2019లో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB)ని ఏర్పాటు చేసింది. ఈ సంస్థ... కేంద్ర ప్రభుత్వ పథకాలపై తప్పుడు ప్రచారం జరిగితే... వాటిని ఖండిస్తూ... ప్రజలకు సరైన సమాచారం అందిస్తుంది. ఇది నిరంతరం సోషల్ మీడియాను గమనిస్తూనే ఉంటుంది.
ప్రజలకు కేంద్రం సూచన:
నెటిజన్లు ఇలాంటి నకిలీ వార్తలు చదివినప్పుడు... అది నిజమో కాదో తెలియకుండా... ఇతరులకు షేర్ చేయవద్దని కేంద్రం కోరుతోంది. ఎందుకంటే నకిలీ వార్తలు త్వరగా ఎక్కువగా షేర్ అవుతాయి. కానీ... వాటి వల్ల ప్రజలు తప్పుదారి పడతారు. అధికారిక సమాచారాన్ని మాత్రమే షేర్ చెయ్యాలని కేంద్రం కోరుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Fact Check