Home /News /national /

FACT CHECK IS PM MODI GOVT DEPOSITING 1 LAKH TO POOR UNDER SAB KA SATH SAB KA VIKAS YOJANA SK

Fact Check: అందరి ఖాతాల్లోకి రూ.లక్ష.. మోదీ ప్రభుత్వం నిజంగానే డబ్బులు ఇస్తోందా?

ఫ్రతీకాత్మకచిత్రం

ఫ్రతీకాత్మకచిత్రం

Fact check: సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్‌గా మారింది. 'సబ్ కా సాథ్ సబ్ కా వికాస్ యోజన' అనే కొత్త పథకానికి ప్రధాని నరేంద్ర మోదీ శ్రీకారం చుట్టారని.. ఆ పథకం కింద అందరి ఖాతాల్లోకి రూ. లక్షలు జమచేస్తున్నారని ప్రచారం జరుగుతోంది.

    కరోనా వైరస్ వల్ల అన్ని రంగాలు కుదేలయ్యాయి. కరోనా మహమ్మారి నుంచి ఇప్పుడిప్పుడే మన దేశం కోలుకుంటోంది. అంతేకాదు మొన్నటి వరకు కుదేలైన రంగాలు కూడా మళ్లీ తేరుకుంటున్నాయి. ఐతే ఇప్పటికే ఎంతో నష్టపోయిన పేదలకు నేరుగా డబ్బులు ఇవ్వాలని ఎప్పటి నుంచో డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఆత్మనిర్భర్ ప్యాకేజీలు ప్రకటించినా సామాన్యుడికి పైసా ఉపయోగం లేదని.. వారి ఖాతాల్లోకి డబ్బులు జమ చేస్తే న్యాయం జరుగుతుందని ప్రతిపక్షాలు కూడా కోరుతున్నాయి. ఇలాంటి తరుణంలో సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్‌గా మారింది. 'సబ్ కా సాథ్ సబ్ కా వికాస్ యోజన' అనే కొత్త పథకానికి ప్రధాని నరేంద్ర మోదీ శ్రీకారం చుట్టారని.. ఆ పథకం కింద అందరి ఖాతాల్లోకి రూ. లక్షలు జమచేస్తున్నారని ప్రచారం జరుగుతోంది.

    ''లక్ష రూపాయలను పొందే సదవకాశాన్ని వినియోగించుకోండి. సబ్ కా సాథ్ సబ్ కా వికాస్ పేరిట ఇచ్చిన హామీని ప్రధాని మోదీ అమలు చేయబోతున్నారు. ఈ పథకం కింద ప్రతి ఒక్కరి ఖాతాల్లో రూ.లక్ష రూపాయల చొప్పున జమచేస్తున్నారు. ఈ పథకం కింద డబ్బులు పొందాలంటే మీ ఆధార్ కార్డు, ఓటర్ ఐడీ, బ్యాంక్ అకౌంట్‌ ఫొటోలను ఈ వాట్సప్ నెంబర్‌కు పంపించండి.'' అంటూ ఓ మెసేజ్ వాట్సప్‌లో చక్కర్లు కొడుతోంది. ఈ ప్రచారంపై PIB ఫ్యాక్ట్ చెక్ టీమ్ స్పందించింది. ఇందులో నిజంలేదని.. ఇది ఫేన్ న్యూస్ అని కొట్టిపారేసింది. సబ్‌కా సాథ్ సబ్‌కా వికాస్ యోజన పేరిట కేంద్ర ప్రభుత్వం ఎలాంటి పథకాన్ని తీసుకురాలేదని స్పష్టం చేసింది. ఇలాంటి అసత్య ప్రచారాలను నమ్మవద్దని ప్రజలకు సూచించింది.

    ఫేస్‌బుక్, ట్విటర్ ఓపెన్ చేస్తే చాలు.. ఏవేవో పోస్టులు కనిపిస్తున్నాయి. వేలాది వార్తలు దర్శనమిస్తాయి. ఇవి చాలదన్నట్లు వాట్సప్‌కు కుప్పలు తెప్పలుగా వార్తలు సందేశాల రూపంలో వస్తున్నాయి. మరి అందులో ఏవి నిజమైనవి? ఏవి తప్పుడు ప్రచారాలో.. తెలియక జనాలు తికమకపడుతున్నారు. సోషల్ కొందరు ఉద్దేశపూర్వకంగా చేసే అసత్య ప్రచారాలను నిజమని నమ్ముతున్నారు. అందుకే వాట్సాప్‌లో వచ్చే ప్రతి వార్తనూ నమ్మవద్దు. ఇతర మీడియా విభాగాల్లో చెక్ చేసిన తర్వాతే ధృవీకరించుకోవాలి.

    కాగా, కేంద్ర ప్రభుత్వ పథకాలు, నిర్ణయాల, ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించి అంశాలపై తప్పుడు ప్రచారం జరుగుతుంటే వాటిపై PIB ఫ్యాక్ట్ చెక్ స్పష్టత ఇస్తుందన్న విషయం తెలిసిందే.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Fact Check, Fake news, PM Narendra Modi

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు