కరోనా వైరస్ కారణంగా 8 నెలలుగా స్కూళ్లు, కాలేజీలు మూతపడ్డాయి. ఎన్నో పరీక్షలు కూడా వాయిదా పడ్డాయి. ఐతే పరిస్థితులు ఇప్పుడిప్పుడే మెరుగుపడుతుండడంతో.. కొన్ని చోట్ల స్కూళ్లు ప్రారంభమయ్యాయి. కానీ మెజారిటీ ప్రాంతాల్లో మాత్రం ఇంకా తెరచుకోలేదు. విద్యార్థులు ఆన్లైన్లోనే పాఠాలు వింటున్నారు. కోవిడ్ తర్వాత ఆన్లైన్ విద్యకు డిమాండ్ పెరిగింది. ఈ క్రమంలోనే కేంద్రం కొత్త పథకం తెచ్చిందని సోషల్ మీడియాలో ఓ సందేశం వైరల్ అవుతోంది. ఆన్లైన్ పాఠాలు వినే విద్యార్థులకు నరేంద్ర మోదీ ప్రభుత్వం.. విద్యార్థులకు ఉచితంగా ల్యాప్‌లాప్‌లు అందిస్తోందని కొందరు వాట్సప్, ఫేస్బుక్లో ప్రచారం చేస్తున్నారు.
అంతేకాదు ఓ లింక్‌ను ఇచ్చి.. అందులో పేర్లను నమోదు చేసుకోవాలని ఆ సందేశంలో పేర్కొన్నారు. ఇది నిజమని నమ్మి.. చాలా మంది షేర్ చేస్తున్నారు. తెలిసిన వారికి ఫోన్ చేసి చెబుతున్నారు. ఈ క్రమంలో ఉచిత ల్యాప్‌టాప్‌ల ప్రచారంపై PIB (Press Information bureau) ఫ్యాక్ట్ చెక్ టీమ్ స్పందించింది. ఇది ఫేక్ న్యూస్ అని కొట్టిపారేసింది. ఈ ప్రచారంలో నిజం లేదని.. ప్రజలెవరూ దీన్ని నమ్మకూడదని సూచించింది. కేంద్ర ప్రభుత్వం అలాంటి పథకాన్నేమీ తీసుకురాలేదని క్లారిటీ ఇచ్చింది. గుర్తు తెలియని వ్యక్తులు పంపించే లింక్స్‌ని ఓపెన్ చేసి వివరాలు నమోదు చేయడం మంచిది కాదని..మీ వ్యక్తిగత వివరాలను తస్కరణకు గురయ్యే అవకాశముందని తెలిపింది.
दावा: एक #WhatsApp मैसेज में यह दावा किया जा रहा है कि ऑनलाइन शिक्षा को ध्यान में रखते हुए सरकार छात्रों को मुफ्त लैपटॉप प्रदान कर रही है।#PIBFactCheck : यह दावा #फ़र्ज़ी है। केंद्र सरकार ने ऐसी कोई घोषणा नहीं की है। ऐसे किसी फ़र्ज़ी लिंक या वेबसाइट पर निजी जानकारी साझा न करें। pic.twitter.com/uMdMRbX7EJ
— PIB Fact Check (@PIBFactCheck) November 28, 2020
సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు.. ఏవేవో పోస్టులు కనిపిస్తున్నాయి. వేలాది వార్తలు దర్శనమిస్తాయి. మరి అందులో ఏవి నిజమైనవి? ఏవి తప్పుడు ప్రచారాలో.. తెలియక జనాలు తికమకపడుతున్నారు. ఫేస్బుక్, ట్విటర్లో కొందరు ఉద్దేశపూర్వకంగా చేసే అసత్య ప్రచారాలను నిజమని నమ్ముతున్నారు. అలాంటి వాటిని గుడ్డిగా నమ్మకూడదు. దాని గురించి వార్తల్లో ఎక్కడైనా వచ్చిందా అని ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవడం మంచిది. కాగా, కేంద్ర ప్రభుత్వ పథకాలు, నిర్ణయాల, ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించి అంశాలపై తప్పుడు ప్రచారం జరుగుతుంటే వాటిపై PIB ఫ్యాక్ట్ చెక్ స్పష్టత ఇస్తుందన్న విషయం తెలిసిందే.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Fact Check, Online classes, Pm modi