'CJI ఎందుకు హెల్మెట్ పెట్టుకోలేదు'.. సారీ చెప్పిన లాయర్ ప్రశాంత్ భూషణ్

చివరి నలుగురు సీజేఐలపై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోనని తెలిపారు. ఆ నలుగురు సీజేఐలు భారత ప్రజాస్వామ్య విలువలను నాశనం చేశారని ప్రశాంత్ భూషణ్ గతంలో విమర్శలు చేశారు.

news18-telugu
Updated: August 4, 2020, 8:52 PM IST
'CJI ఎందుకు హెల్మెట్ పెట్టుకోలేదు'.. సారీ చెప్పిన లాయర్ ప్రశాంత్ భూషణ్
ప్రశాంత్ భూషణ్
  • Share this:
అడ్వొకేట్ ప్రశాంత్ భూషణ్..! ఈయన ఏం చేసినా సంచలనమే..! ఏకంగా న్యాయవ్యవస్థల తీర్పులను, చట్ట సభల నిర్ణయాలను బాహాటంగానే తప్పుబట్టుతారు. అలా ఎన్నో అంశాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చివరకు సీజేఐని కూడా వదలకుండా ఆరోపణలు చేశారు. ఈ క్రమంలోనే కోర్టు ధిక్కరణ కింద ప్రస్తుతం సుప్రీంకోర్టులో విచారణ ఎదుర్కొంటున్నారు ప్రశాంత్ భూషణ్. విచారణలో భాగంగా గతంలో తాను చేసిన వ్యాఖ్యలు, సోషల్ మీడియా పోస్ట్‌లపై 134 పేజీల అఫిడవిట్‌ను ఆయన కోర్టుకు సమర్పించారు.

అందులో ఓకే ఒక్క అంశంపై మాత్రం క్షమాపణలు చెప్పారు ప్రశాంత్ భూషణ్. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎస్ఏ బాబ్డే రూ.50 లక్షల విలువైన బైక్‌పై వెళ్తూ హెల్మెట్ ధరించలేదని గతంలో ప్రశాంత్ భూషన్ ట్వీట్ చేశారు. ఐతే ఆ సమయంలో హెల్మెట్ లేకుండా జస్టిస్ బాబ్డే బైక్ నడపలేదు. వాస్తవానికి బైక్ స్టాండ్ వేసి ఉంటే, దానిపై ఆయన కూర్చున్నారు. ఐతే బైక్‌కు స్టాండ్ వేసి ఉన్న విషయాన్ని గమనించకుండా ట్వీట్ చేశానని.. అందుకు సారీ చెబుతున్నట్లు కోర్టుకు తెలిపారు ప్రశాంత్ భూషణ్.

ఆ ఒక్క విషయం తప్ప గతంలో తాను చేసిన అన్ని వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. చివరి నలుగురు సీజేఐలపై చేసిన వ్యాఖ్యలను కూడా ఉపసంహరించుకోనని తెలిపారు. ఆ నలుగురు సీజేఐలు భారత ప్రజాస్వామ్య విలువలను మంటగలిపారని ప్రశాంత్ భూషణ్ గతంలో విమర్శలు చేశారు. ఇప్పుడు కూడా ఆ వ్యాఖ్యలను సమర్థించుకుంటున్నారు. ఈ సుమోటో కంటెంప్ట్ కేసుపై జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరపనుంది. జులై 24న జరిగిన విచారణ తర్వాత ప్రశాంత్ భూషణ్ చేసిన పలు వివాదాస్పద ట్వీట్లను ట్విటర్ ఇండియా తొలగించిన విషయం తెలిసిందే.

కాగా, సహారా-బిర్లా డైరీ కేసు నుంచి జడ్జి లోయా మృతి వరకు, కహికోపుల్ ఆత్మహత్య నుంచి మెడికల్ ప్రవేశాల కుంభకోణాల వరకు, మాస్టర్ ఆఫ్ రోస్టర్ కాంట్రవర్సీ నుంచి అసోం ఎన్ఆర్సీ వరకు, ఆర్టికల్ 370 రద్దు నుంచి పౌరసత్వం చట్ట సవరణ వరకు.. ఇలా ఎన్నో అంశాలపై బాహాటంగానే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ప్రశాంత్ భూషణ్.
Published by: Shiva Kumar Addula
First published: August 4, 2020, 8:44 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading