ఫణి తుఫాను బాధితుల కోసం ఫేస్‌బుక్ ప్రత్యేక ఆప్షన్...

తుఫాను ప్రాంతంలోని ప్రజలు తమ సన్నిహితులు, కుటుంబ సభ్యులు, ఇతర స్నేహితులకు తమ క్షేమ సమాచారాన్ని అందించేందుకు ఫేస్ బుక్ "ఐ యామ్ సేఫ్" అనే ఆప్షన్ ను యాక్టివేట్ చేసింది. ఫేస్ బుక్ యాప్ ఓపెన్ చేసిన వెంటనే ఈ ఆప్షన్ కనింపించేలా డిజైన్ చేయడం విశేషం.

news18-telugu
Updated: May 3, 2019, 4:49 PM IST
ఫణి తుఫాను బాధితుల కోసం ఫేస్‌బుక్ ప్రత్యేక ఆప్షన్...
విరుచుకుపడుతున్న ఫణి తుఫాను
  • Share this:
సోషల్ మీడియా నెట్ వర్కింగ్ దిగ్గజం ఫేస్‌బుక్ ఫణి తుఫాను నేపథ్యంలో వినూత్న రీతిలో సేవలను అందిస్తోంది. ముఖ్యంగా తుఫాను ప్రాంతంలోని ప్రజలు తమ సన్నిహితులు, కుటుంబ సభ్యులు, ఇతర స్నేహితులకు తమ క్షేమ సమాచారాన్ని అందించేందుకు ఫేస్ బుక్ "ఐ యామ్ సేఫ్" అనే ఆప్షన్ ను యాక్టివేట్ చేసింది. ఫేస్ బుక్ యాప్ ఓపెన్ చేసిన వెంటనే ఈ ఆప్షన్ కనింపించేలా డిజైన్ చేయడం విశేషం. ముఖ్యంగా ఈ ఆప్షన్ భారత్ లోని ఫేస్ బుక్ పేజ్ వ్యూయర్లకు కల్పించారు. అలాగే తుఫాను ప్రభావిత ప్రాంతాలకు చెందిన వారికి వీలుగా ఈ యాప్ ను డిజైన్ చేశారు. మీరు సురక్షితంగా ఉన్నట్లయితే ఐయామ్ సేఫ్ అనే ఆప్షన్ ను ఎంపిక చేసుకుంటే సరి, అప్పుడు మీ సన్నిహితులకు ఫేస్ బుక్ ద్వారా తెలుసుకునే వీలుంది.

ఇదిలా ఉంటే ఫొణి తుఫాను ఒడిశా తీరాన్ని దాటింది. తీర ప్రాంతాల్లో భారీగా ఆస్తినష్టం సంభవించింది. ప్రాథమిక అంచనా ప్రకారం ఫొణి తుఫాను తీరం దాటే సమయంలో 150-175 కేఎంపీహెచ్ వేగంతో ఉధృతమైన గాలులు వీచినట్లు ఐఎండీ తన అప్డేట్స్ లో తెలిపింది. మరోవైపు తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో రవాణా వ్యవస్థ కూడా పూర్తిగా స్తంభించింది. ఇదిలా ఉంటే ఒడిశాలో దాదాపు 10 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించడం విశేషం. గంజాం జిల్లా నుంచి అత్యధికంగా సుమారు 3 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అదేసమయంలో పూరీ జిల్లా నుంచి 1.3 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు స్పెషల్ రిలీఫ్ కమిషనర్ ఆఫీస్ ఒక ప్రకటనలో తెలిపింది.
First published: May 3, 2019, 3:54 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading