కరోనా మహమ్మారి ప్రపంచాన్ని సంక్షోభంలోకి నెట్టేసింది. మనుషుల ముక్కూ మొహాలు ఒకరికొకరు తెలియకుండా చేసింది. ఇప్పుడు ప్రపంచమంతా మాస్క్ జపం చేస్తోంది. అయితే ఇలా వాడి పడేసిన మాస్క్‌ల విషయంలో ఎవరూ జాగ్రత్తలు తీసుకోవట్లేదు. వినియోగించాక వాటిని నిర్లక్ష్యంగా పడేయడం వల్ల మూగజీవాలకు ప్రాణహాని కలుగుతోంది. ఈ విషయాన్ని ధ్రువీకరిస్తోంది ఒక వైరల్ వీడియో. సుప్రియా సాహూ అనే ఐఏఎస్ అధికారి ట్విట్టర్లో పెట్టిన ఈ వీడియోలో.. ఒక కుక్క కడుపులో నుంచి వాడి పడేసిన మాస్కును తొలగించినట్లు తెలిపారు. తమిళనాడులో సైబీరీయజన్ జాతికి చెందిన శునకం కడుపులోంచి పశువైద్యులు మాస్క్‌ను బయటకు తీశారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
The masks we carelessly throw away can end up killing animals.A team of veterinarians from TN University of Veterinary & animal sciences at Chennai successfully removed a face mask from the stomach of a Siberian Husky dog. Video not for faint hearted.Please ensure safe disposal pic.twitter.com/rdC72gjxLr
— Supriya Sahu IAS (@supriyasahuias) June 12, 2021
కోవిడ్ సోకకుండా మాస్క్ ధరించడం ఎంతటి ముఖ్యమో అందరికీ తెలిసిందే. అయితే మాస్క్ లను చెత్తకుండీలోనే వేయాలని, వాటిని నిర్లక్షంగా పడేయడం వల్ల మూగజీవాలు వాటిని తిని ప్రాణం మీదకు తెచ్చుకుంటున్నాయని సుప్రియా సాహూ పేర్కొన్నారు. నెటిజన్ల నుంచి ఈ విషయంపై చక్కటి స్పందన వచ్చింది. ఎవరో పారేసిన మాస్క్‌ను ఈ కుక్క తిన్నట్లు అర్థమవుతోంది. అందువల్ల ఇకనుంచైనా మనమంతా మరింత బాధ్యతగా ఉండాలని నెటిజన్లు పేర్కొన్నారు.
‘ప్రకృతిని, అందులోని ప్రాణులను రక్షించుకోవాలి. మూగజీవాలకు కూడా బాధ, ఆవేదన ఉంటాయి’ అని ఒక నెటిజన్ ఈ వీడియో పోస్టుకు కామెంట్ రాశారు. ఇలా మాస్క్‌లు ఎక్కడంటే అక్కడ పడేయకూడదనే మంచి విషయం చెప్పారంటూ మరొకరు పేర్కొన్నారు. సైబీరీయన్ జాతి శునకాలు చాలా ఖరీదైనవని, బహుశా అది ఇంట్లోనే ప్రమాదవశాత్తూ మాస్క్ ను తిని ఉంటుందని, లేదా వాకింగ్ సమయంలో ఈ పని చేసి ఉండవచ్చని మరో నెటిజన్ సందేహం వ్యక్తం చేశాడు.
మాస్క్ లను, పీపీఈ కిట్ల విషయంలో అన్ని దేశాలూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. దక్షిణ ఫ్రాన్స్ లోని యాంటిబ్స్ ప్రాంతంలో ఆపరేషన్ క్లీన్ సీ అనే స్వచ్ఛంద సంస్థ ఇటీవల మెడిటెర్రానియన్ సముద్రజలాల్లో కొన్ని మాస్క్‌లు, గ్లవ్స్‌ను కనుగొంది. ఈ సముద్రానికి సమీపంలోనే ఒక రిసార్ట్ ఉండటం గమనార్హం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Coronavirus, Covid-19, Face mask, Tamil nadu