నిన్నగాక మొన్ననే జాతీయహోద సంపాదించుకున్న పార్టీ... పంజాబ్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను సైతం ఊడ్చిపడేసిన ఆమ్ ఆద్మీ పార్టీ(AAP).. ఆ తర్వాత గుజరాత్,(gujarat) గోవా(Goa) ఎన్నికల్లోనూ ఖాతా తెరిచి ఊహించినదాని కంటే వేగంగా జాతీయ రాజకీయాల్లోకి దూసుకొచ్చింది. ఈ ఏడాది జరగనున్న కర్ణాటక, చత్తీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ ఎన్నికలపై ఆప్ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ (arvind Kejriwal)కేజ్రీవాల్ ఇప్పటికే తనదైన శైలిలో ప్రణాళికలు రచించుకున్నారు. మరి కొన్ని రోజుల్లో ఈ నాలుగు రాష్ట్రాల్లో పర్యటించడానికి డేట్ కూడా ఫిక్స్ చేసుకున్నారు. ఈ నాలుగు రాష్ట్రాల్లో ఆప్ మార్క్ చూపించాలని.. తమ పార్టీని మరింత విస్తరించాలని ప్లాన్ రెడీ చేసుకున్నారు. ఈ మార్చిలోనే ఈ నాలుగు రాష్ట్రాల్లో కేజ్రీవాల్ పర్యటించనున్నారు. ఇంతలోనే ఢిల్లీ లిక్కర్ స్కామ్ (delhi Liquor scam)కేజ్రీవాల్‌కు గట్టి షాక్ ఇచ్చింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను(manish sisodia) సీబీఐ అరెస్ట్ చేయడం.. కోర్టు కస్టడీకి అప్పగించడం చకచకా జరిగిపోయాయి. ఇది కేజ్రీవాల్ రైట్ హ్యాండ్‌కు తగిలిన గాయం.. ఢిల్లీ రాజకీయాలతో పాటు, పార్టీలో అన్ని తానై చూసుకునే సిసోడియా లేకుండా కేజ్రీవాల్ ఇప్పుడేం చేస్తారన్నది ఆసక్తిగా మారింది.
సిసోడియా చేతిలోనే 18శాఖలు:
ఢిల్లీలో మొత్తం 33 శాఖలున్నాయి. ప్రభుత్వంలో కేజ్రీవాల్‌తో పాటు ఆరుగురు కేబినేట్ మంత్రులుండగా.. గతేడాది మనీలాండరింగ్ కేసులో సత్యేంద్ర జైన్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ED) అరెస్టు చేసింది. దీంతో సిసోడియాకు 18శాఖలు కేటాయించగా.. పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్‌కు మూడు శాఖలు ఇచ్చారు. అంటే సగం కంటే ఎక్కువ పోర్ట్‌ఫోలియోలు సిసోడియా చేతిలోనే ఉన్నాయి. అవి కూడా చిన్నచితకా డిపార్ట్‌మెంట్‌లు కావు.. అన్నిటికంటే కీలకమైన ఆర్థికశాఖ కూడా సిసోడియా చేతిలోనే ఉంది. నిజానికి సిసోడియా చెప్పకుండా ఢిల్లీలో ఏ పని జరగదంటారు. సిసోడియా ఉన్నాడు కాబట్టే కేజ్రీవాల్‌కు ధైర్యమంటారు. ఢిల్లీ ప్రభుత్వం మొత్తాన్ని సిసోడియా చేతిలో పెట్టిన కేజ్రీవాల్ ఇన్నాళ్లు జాతీయ రాజకీయాలపై ప్రత్యేకమైన దృష్టి సారించారు. చాలా చోట్ల అనుకున్న ఫలితాలు సాధించారు కూడా. ఇప్పుడు సిసోడియాకు బెయిల్ వస్తుందో లేదో తెలియదు.. ఒక వేళ వచ్చినా.. మళ్లీ ఎప్పుడు అరెస్ట్ అవుతారో తెలియదు.. ఈ లెక్కలన్ని చూస్తే సిసోడియా మళ్లీ ఒకప్పటిలా ఢిల్లీ ప్రభుత్వ కార్యకలాపాలు చూసుకోలేరు.. సిసోడియాకు కాదని వేరొకరికి ఈ పనిని అప్పగించినా ఆయన లాగా చేస్తారని గ్యారెంటీ లేదు.. ఇదంతా కేజ్రీవాల్‌కు పెద్ద తలనొప్పిగా మారింది.
పెరగనున్న పనిభారం, సమీపిస్తోన్న ఎన్నికలు:
2022 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో 92 సీట్లకు 117 స్థానాలను గెలుచుకున్న ఆప్ చారిత్రాత్మక విజయం తర్వాత..గోవాలో రెండు స్థానాలు, గుజరాత్ లో ఐదు స్థానాలను గెలుచుకోవడంతో జాతీయ పార్టీగా గుర్తింపు పొందింది. ప్రజా సమస్యలు, విద్య , ఆరోగ్య సంరక్షణపై తమ విజన్‌ను మిగిలిన రాష్ట్రాలకు తీసికెళుతోంది.దేశమంతటా విస్తరించాలనే లక్ష్యంతో ఉంది. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తోంది. కేజ్రీవాల్ విజన్‌ను దేశంలోని ప్రతి ఇంటికి, ప్రతి వ్యక్తికి చేరవేయడమే టార్గెట్‌గా పనిచేస్తోంది. ఈ ఏడాది కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు ఉండడంతో సౌత్‌లోనూ తమ ప్రభావాన్ని చూపించాలని ఎంతో ఆశగా ఉంది. అయితే సిసోడియా అరెస్టుతో కేజ్రీవాల్‌కు పనిభారం పెరిగే అవకాశాలున్నాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు. పంజాబ్, గోవా ఎన్నికలపై కేజ్రీవాల్ పెట్టిన శ్రద్ద.. రానున్న ఎన్నికలపై పెట్టడం కష్టమేనంటున్నారు. కేజ్రీవాల్ దేశమంతా తిరిగిన మనసు మాత్రం ఢిల్లీలోనే ఉంటుందని.. సిసోడియా బాధ్యతలు ఇప్పుడు ఎవరికి ఇవ్వాలన్నదే సీఎం ముందున్న అది పెద్ద సవాల్ అంటున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.