Godavari Boat | గోదావరి బోటు ప్రమాదంపై మోదీ తీవ్ర సంతాపం.. తెలుగులో ట్వీట్

తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు వద్ద గోదావరి నదిలో బోటు మునిగింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో పడవలో 61 మందికి పైగా పర్యాటకులు ఉన్నట్టు తెలుస్తోంది.

news18-telugu
Updated: September 15, 2019, 6:40 PM IST
Godavari Boat | గోదావరి బోటు ప్రమాదంపై మోదీ తీవ్ర సంతాపం.. తెలుగులో ట్వీట్
గోదావరిలో పడవ బోల్తా ఘటనపై ట్వీట్ చేసిన ప్రధాని మోదీ
news18-telugu
Updated: September 15, 2019, 6:40 PM IST
గోదావరిలో బోటు ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ‘ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లాలో ఈ రోజు జరిగిన బోటు ప్రమాదం ఒక అతి బాధాకరమైన ఘటన. మృతుల కుటుంబాలకు నా తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నాను. ప్రమాద స్థలం వద్ద సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి.’ అని తెలుగులో ట్వీట్ చేశారు. అంతకు ముందు నరేంద్ర మోదీ ఇదే అంశాన్ని ఇంగ్లీష్‌లో ట్వీట్ చేశారు. 15 నిమిషాల తర్వాత తెలుగులో ట్వీట్ చేశారు.





ప్రధాని మోదీతోపాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా గోదావరి బోటు ప్రమాదం ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పడవ ప్రమాదం దురదృష్టకరమని, తనను తీవ్రంగా కలచివేసిందంటూ ట్వీట్ చేశారు.



తూర్పుగోదావరి జిల్లాలో గోదావరి నదిలో బోటు మునిగింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో పడవలో 61 మందికి పైగా పర్యాటకులు ఉన్నట్టు తెలుస్తోంది. వారిలో హైదరాబాద్, వరంగల్, విశాఖ, రాజమండ్రికి చెందిన పర్యాటకులు ఉన్నారు. పడవ బోల్తా పడిన సమయంలో లైఫ్ జాకెట్లు వేసుకున్న వారిలో మొత్తం 24 మంది బయట పడినట్టు చెబుతున్నారు. అయితే, ఎంతమంది గల్లంతయ్యారనే విషయంపై క్లారిటీ రాలేదు.

 

First published: September 15, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...