నసీరుద్దీన్ షా కామెంట్స్‌పై దుమారం.. బీజేపీ తీవ్ర నిరసనలు

లిటరరీ ఫెస్టివల్‌లోకి నసీరుద్దున్ షా ఎంట్రీని అడ్డుకునేందుకు రైట్ వింగ్ గ్రూప్స్ ప్రయత్నించడంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. నసీరుద్దున్ షా వస్తే పరిస్థితులు ఎక్కడికి దారితీస్తాయోనన్న భయంతో.. పోలీసులు ఆయన్ను రావద్దని విజ్ఞప్తి చేశారు.

news18-telugu
Updated: December 22, 2018, 10:00 AM IST
నసీరుద్దీన్ షా కామెంట్స్‌పై దుమారం.. బీజేపీ తీవ్ర నిరసనలు
నసీరుద్దీన్ షా(File)
  • Share this:
బాలీవుడ్ విలక్షణ నటుడు నసీరుద్దీన్ షా కామెంట్స్‌పై దుమారం రేగుతోంది. ఓ పోలీస్ అధికారి చావు కన్నా.. ఆవు చనిపోవడమే ప్రాముఖ్యతను సంతరించుకుంటోందని ఆయన వ్యాఖ్యానించారు. ఉత్తరప్రదేశ్ బులంద్ షహర్‌లో మూక దాడిలో పోలీస్ అధికారి మరణించిన సంఘటనను ఉద్దేశించి.. షా ఈ కామెంట్స్‌ చేశారు. అయితే షా చేసిన ఈ కామెంట్స్‌పై బీజేపీ సహా రైట్ వింగ్స్ నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది.

ఇదే క్రమంలో శుక్రవారం ఆయన అజ్మీర్ లిటరరీ ఫెస్టివల్ ప్రారంభోత్సవానికి వెళ్లాల్సి ఉండగా.. బీజేపీ కార్యకర్తలు ఆయన్ను అడ్డుకుంటామని హెచ్చరించారు. లిటరరీ ఫెస్టివల్ ప్రాంగణం ఎదుట నిరసనకు దిగి నసీరుద్దీన్ షా క్షమాపణలు చెప్పాల్సిందిగా డిమాండ్ చేశారు. నసీరుద్దీన్ షా ముఖచిత్రంతో ముద్రించిన లిటరరీ ఫెస్టివల్ పోస్టర్స్‌ను తగలబెట్టారు.

విషం అనేది ఇప్పటికే అంతటా విస్తరించింది. దాన్ని తీసి మళ్లీ బాటిల్‌లోనే బంధించడం కష్టసాధ్యమైన పని. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటున్నవారు శిక్షల నుంచి తప్పించుకుంటున్నారు. చాలా చోట్ల మనం చూస్తూనే ఉన్నాం. ఓ పోలీస్ అధికారి చావు కంటే... ఒక ఆవు చనిపోయిందన్న విషయమే ప్రాధాన్యతను సంతరించుకుంటోంది. నా పిల్లల గురించి తలుచుకుంటే భయమేస్తోంది. ఎందుకంటే.. వాళ్లకు ఏ మతమూ లేదు. రేప్పొద్దున ఎవరైనా మూక వారిని చుట్టు ముట్టి మీరు హిందువా? ముస్లిమా? అని అడిగితే.. వాళ్ల వద్ద సమాధానం ఉండదు. పరిస్థితి చూస్తుంటే ఇప్పట్లో దారికొచ్చేలా కనపడట్లేదు. అయితే ఇవి నన్ను భయపెట్టడం కాదు.. ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయి.
నసీరుద్దీన్ షా,(హర్ష్ మందెర్ నిర్వహిస్తున్న కార్వాన్-ఏ-మొహబ్బత్‌తో వారం రోజుల క్రితం చేసిన కామెంట్స్)


లిటరరీ ఫెస్టివల్‌లోకి నసీరుద్దున్ షా ఎంట్రీని అడ్డుకునేందుకు రైట్ వింగ్ గ్రూప్స్ ప్రయత్నించడంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. నసీరుద్దున్ షా వస్తే పరిస్థితులు ఎక్కడికి దారితీస్తాయోనన్న భయంతో.. పోలీసులు ఆయన్ను రావద్దని విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన షా.. ఒక భారతీయుడిగా తాను స్పందించానని, నన్ను బెదిరించేంత తప్పు ఏమి చేశానో అర్థం కావడం లేదని అన్నారు.
First published: December 22, 2018, 8:18 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading