Explosion at Factory in Maharashtra: మ‌హారాష్ట్ర పాల్ఘ‌ర్ పారిశ్రామిక వాడ‌లో పేలుడు.. ఒక‌రు మృతి, ఆరుగురికి గాయ‌లు

(ప్రతీకాత్మక చిత్రం)

మహారాష్ట్రలోని(Maharashtra) పాల్ఘర్ జిల్లాలోని తారాపూర్ పారిశ్రామిక ప్రాంతంలోని వస్త్ర కర్మాగారం(Factory)లో జరిగిన భారీ పేలుడులో ఒకరు మరణించగా, మరో ఆరుగురు గాయపడ్డారు.

  • Share this:
    మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలోని తారాపూర్(Tarapur) పారిశ్రామిక ప్రాంతంలోని వస్త్ర కర్మాగారంలో జరిగిన భారీ పేలుడులో ఒకరు మరణించగా, మరో ఆరుగురు గాయపడ్డారు. ఘ‌ట‌న‌కు సంబంధించిన వివ‌రాలు ఇలా ఉన్నాయి.
    ఉదయం 6 గంటల ప్రాంతంలో ఈ ఘ‌ట‌న‌ జరిగింది. మ‌హారాష్ట్రంలోని ప్ర‌ముఖ పారిశ్రామిక వాడ‌ల్లో ఒక్క‌టైన‌ పాల్ఘర్ టైక్స‌టైల్(Textile) క‌ర్మాగారంలో  పేలుడు సంభవించి అగ్ని ప్ర‌మాదం జరిగింది. అక్క‌డ జ‌రిగిన ప్రదేశం నుంచి వచ్చిన శబ్దం దాదాపు ఐదు కిలోమీటర్ల దూరం వినిపించింది. దీంతో జ‌నం భ‌య‌భ్రాంతుల‌కు గుర‌య్యారు. ఘ‌ట‌న‌కు సంబంధించిన వివ‌రాల‌ను జిల్లా విపత్తు నిర్వహణ సెల్ చీఫ్ వివేకానంద్ కదం తెలిపారు. పేలుడు కార‌ణంగా మంట‌లు వ‌చ్చాయి.

    Man escapes without paying Rs.25 lakh bill: రూ.25ల‌క్ష‌ల బిల్లు చేశాడు.. బాత్‌రూం నుంచి ఎంచ‌క్కా చెక్కేశాడు


    ఈ ప్ర‌మాదం తారాపూర్ MIDC, బోయిసర్‌లో ఉన్న యూనిట్‌లో జ‌రిగిన‌ట్టు పీటీఐ నివేదించింది.
    ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి జిల్లా విపత్తు నిర్వహణ సెల్ చీఫ్ వివేకానంద్ కదం మాట్లాడుతూ ప్ర‌మాదం జ‌రిగిని విష‌యం తెలియ‌గానే అన్ని విభాగాలు వేగంగా ప‌ని చేశాయ‌న్నారు. అగ్నిమాప‌క సిబ్బంది, పోలీసులు అప్ర‌మ‌త్త‌మై ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్నార‌ని ఆయ‌న తెలిపారు. అక్క‌డ మంట‌ల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్(Rescue operation) నిర్వ‌హించార‌ని తెలిపారు. ప్ర‌స్తుతం మంటలు అదుపులోకి వ‌చ్చాయ‌ని, కూలింగ్ ఆప‌రేష‌న్ నిర్వ‌హిస్తున్న‌ట్టు కదం తెలిపారు.
    Published by:Sharath Chandra
    First published: