దేశ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేని వర్షాలతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. నదులు, జలాశయాలు కళకళలాడుతున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో వాతావరణ శాఖ అప్రమత్తంగా ఉంది. ఎప్పటికప్పుడు పరిస్థితులు అంచనా వేసుకుంటూ ప్రజలను ముందస్తుగా హెచ్చిరిస్తోంది. ఈ క్రమంలో గతంలో వర్షాలు కురిసినప్పుడు పసుపు, నారింజ, ఎరుపు రంగు వార్నింగ్స్ ఇస్తూ వచ్చింది. అసలేంటా రంగులు, ఏ రంగు దేనికి దేనికి సూచన, మనం ఏ రంగు వార్నింగ్ వచ్చినప్పుడు అప్రమత్తమవ్వాలి?
వాతావరణ పరిస్థితుల తీవ్రతను తెలియజేయడానికి భారత వాతావరణ శాఖ (ఐఎండీ) రంగుల విధానాన్ని ప్రవేశపెట్టింది. విపత్తు నిర్వహణ శాఖ వీటిని ప్రకటిస్తుంది. ఇలా రంగుల రూపంలో చెబితే ఎక్కువమందికి సులభంగా విషయం అర్థమవుతుందనేది దీని ఉద్దేశం. దానికి తగ్గట్టుగా తర్వాతి పరిస్థితిని అర్థం చేసుకొని అవసరమైన చర్యలు తీసుకోవచ్చు. తొలి రోజుల్లో ఆకుపచ్చ రంగు, పసుపు, నారిజం, ఎరుపు అంటూ నాలుగు రకాల రంగులు వాడేవారు. ఆకుపచ్చ అంటే ఎలాంటి చర్యలు అవసరం లేదని, పసుపు అంటే సిద్ధంగా ఉండమని, నారింజ అంటే సంసిద్ధులుకండి అని, ఎరుపు అంటే చర్యలు తీసుకోమని అర్థం.
ఈ రంగుల కేటాయింపును ఐఎండీ ఐదు రోజుల వాతావరణ స్కీమ్ ఆధారంగా నిర్ణయిస్తూ ఉంటుంది. మెట్రోలాజికల్ అంశాలు, హైడ్రోలాజికల్ అంశాలు, జియోఫిజికల్ ఫ్యాక్టర్స్ పరిగణలోకి తీసుకొని వర్షాల తీవ్రతను అంచనా వేసి అందుకుతగ్గ రంగు హెచ్చరికలు జారీ చేస్తారు. దేశంలో అన్ని ప్రాంతాల్లోనూ ఇదే కలర్ కోడ్‌ను వినియోగిస్తారు. అయితే ఆ హెచ్చరికతో పాటు ఇచ్చే సబ్ డివిజనల్ హెచ్చరిక మాత్రం ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా ఉంటుంది.
వర్షం పడే అవకాశం లేనప్పుడు ఆటోమేటిగ్గా ఆకుపచ్చ సూచిక ఉంటుంది. అప్పటికే వరదలు ఉండి భారీ వర్షం కురిసే పరిస్థితులు వస్తే అప్పుడు నారింజ కానీ ఎరుపు కానీ ఇస్తారు. ఐసోలేట్ అయ్యే పరిస్థితులు వస్తే పసుపు హెచ్చరిక జారీ చేస్తారు. ఐసోలేట్‌గా ఉన్నప్పుడు వరుసగా మూడు రోజులు భారీ వర్షపాతం నుంచి అతి భారీ వర్షపాతం కురిస్తే... తొలి రెండు రోజులు నారింజ, మూడో రోజు ఎరుపు రంగు హెచ్చరిక జారీ చేస్తారు. భారీ వర్షం నుంచి అత్యంత భారీ వర్షం కురిసినప్పుడు దానికి ఎరుపు రంగు హెచ్చరిక జారీ చేస్తారు.
ఇవి కూడా చదవండి:
Rain Alert: తెలంగాణకు రెడ్ అలర్ట్.. హైదరాబాద్‌తో పాటు ఈ జిల్లాల్లో నేడు భీకర వర్షాలు
Hyderabad: హైదరాబాద్‌లో వర్ష బీభత్సం.. 21 సె.మీ. వాన.. ఈ ప్రాంతాలు జలమయం
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Heavy Rains, IMD, Imd hyderabad, Weather report