ఇండియన్ రైల్వేస్‌కు చెందిన ఐఆర్సీటీసీ టూరిస్ట్‌లకు బంపరాఫర్ ప్రకటించింది. సౌత్ ఇండియా టూర్ కోసం స్పెషల్ ప్యాకేజీని అందిస్తున్నట్లు ప్రకటించింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’, ‘దేఖో అప్నా దేశ్’ వంటి కార్యక్రమాలను చేపడుతోంది. ఈ ప్రోగ్రామ్ కింద ఐఆర్సీటీసీ విలాసవంతమైన, సరసమైన టూర్ ప్యాకేజీని అందిస్తోంది. దక్షణాదిలోని తిరుపతి, చెన్నై, త్రివేండ్రం, కన్యాకుమారి, రామేశ్వరం, మదురై వంటి ప్రదేశాలను సందర్శించడానికి అవకాశం కల్పిస్తుంది. మీరు ఆగస్టు లేదా సెప్టెంబరులో దక్షిణ భారతదేశాన్ని సందర్శించాలని ప్లాన్ చేస్తున్నట్లయితే, ఐఆర్సీటీసీ టూర్ ప్యాకేజీ మీకు బెస్ట్ చాయిస్ కావచ్చు.
టూర్ మొత్తం 6 రాత్రులు, 7 పగళ్లు ఉంటుంది. పర్యాటకుల బస, ప్రయాణానికి సంబంధించిన ఏర్పాట్లను ఐఆర్సీటీసీ చూసుకుంటుంది. ప్యాకేజీకి ధర ఒక్కో టూరిస్ట్‌కు రూ. 45,260 నుండి ప్రారంభమవుతుంది. ఈ టూర్ ఢిల్లీ నుండి ప్రారంభమవుతుంది. పర్యాటకులను విమానంలో చెన్నైకి తీసుకెళ్తారు. అక్కడి నుంచి త్రివేండ్రం, మదురై వెళ్లనున్నారు. రామనాథస్వామి ఆలయం, మీనాక్షి ఆలయం, తిరుమల శ్రీ వెంకటేశ్వర ఆలయం వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలను సందర్శించనున్నారు.
* టూర్ ప్యాకేజీ ధరలు
ఐఆర్సీటీసీ సౌత్ ఇండియా టూర్ ఫ్యాకేజీ ధరలు ఇలా ఉన్నాయి. ట్రిపుల్ ఆక్యుపెన్సీపై ఒక్కో వ్యక్తికి ప్యాకేజీ ధర రూ.45,260గా నిర్ణయించింది. డబుల్ ఆక్యుపెన్సీపై ఒక్కొ టూరిస్ట్‌కు రూ.47,190 ఖర్చు అవుతుంది. చివరగా ఒక వ్యక్తికి సింగిల్ ఆక్యుపెన్సీకి రూ. 59,760గా ఐఆర్సీటీసీ నిర్ణయించింది. 5-11 సంవత్సరాల మధ్య వయసు పిల్లలు ఉన్న ప్రతి వ్యక్తి (మంచం ఖర్చుతో) నుంచి రూ. 40,120 వసూలు చేయనున్నారు. 5 - 11 సంవత్సరాల మధ్య వయసు ఉన్న పిల్లల ప్రతి వ్యక్తి నుంచి (మంచం ఖర్చు లేకుండా) రూ. 35,610 వసూలు చేయనున్నారు.
* టూర్ ప్యాకేజీ హైలైట్స్
ప్యాకేజీ పేరు - సౌత్ ఇండియా డివైన్ టూర్ ప్యాకేజీ ఎక్స్ ఢిల్లీ
కవర్ అయ్యే ప్రదేశాలు - తిరుపతి, చెన్నై, త్రివేండ్రం, కన్యాకుమారి, రామేశ్వరం, మదురై
టూర్ వ్యవధి - 6 రాత్రులు, 7 రోజులు
బయలుదేరే తేదీలు - ఆగస్టు 19, సెప్టెంబర్ 16
భోజన ప్లాన్ - బ్రేక్ ఫాస్ట్, రాత్రి భోజనం
* బుకింగ్ ఇలా..
ఐఆర్సీటీసీ వెబ్సైట్ www.irctctourism.com ను సందర్శించి ఈ టూర్ ప్యాకేజీని టూరిస్ట్‌లు బుక్ చేసుకోవచ్చు. అలాగే ఐఆర్సీటీసీ టూరిస్ట్ ఫెసిలిటేషన్ సెంటర్లు, జోనల్, ప్రాంతీయ ఆఫీస్‌లకు వెళ్లి కూడా బుకింగ్ చేసుకోవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: IRCTC, IRCTC Tourism, Tourist place, Train tickets