హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

UP Exit Polls 2022: యూపీలో బీజేపీదే గెలుపు.. కాంగ్రెస్ అట్టర్‌ ఫ్లాప్.. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు

UP Exit Polls 2022: యూపీలో బీజేపీదే గెలుపు.. కాంగ్రెస్ అట్టర్‌ ఫ్లాప్.. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు

అఖిలేష్ యాదవ్, యోగి ఆదిత్యనాథ్

అఖిలేష్ యాదవ్, యోగి ఆదిత్యనాథ్

UP Exit Polls 2022: ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఎవరి వైపు మొగ్గు చూపాయి. బీజేపీయే మళ్లీ అధికారం చేపడుతుందా? లేదంటే కమల దళానికి సమాజ్‌వాదీ పార్టీ షాకిస్తుందా? ఆ వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.

దేశవ్యాప్తంగా ఎంతో ఆసక్తి రేపిన ఐదు రాష్ట్రాల ఎన్నికలు  (5 state Elections) ప్రశాంతంగా ముగిశాయి. యూపీలో ఇవాళ సాయంత్రమే ఏడో దశ పోలింగ్ (UP Assembly elections 2022) ముగిసింది. ఎన్నికలు ముగియడంతో ఆ రాష్ట్రాల్లో ఎవరు గెలుస్తారన్న దానిపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా అతి పెద్ద రాష్ట్రమైన  ఉత్తర ప్రదేశ్‌ (Utter Pradesh) లో ఎవరు గెలుస్తారోనని అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఐతే ఎన్నికల సమయంలో ఓటర్ నాడి ఎలా ఉందో  తెలుసుకునేందుకు పలు సర్వే సంస్థలు ప్రయత్నించాయి. ఈ మేరకు ఇవాళ సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ అంచనాలను విడుదల చేశాయి. యూపీలో మొత్తం 403 అసెంబ్లీ స్థానాలున్నాయి. ప్రభుత్వ ఏర్పాటు చేయాలంటే 202 సీట్లలో విజయం సాధించాలి.  మరి ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఎవరి వైపు మొగ్గు చూపాయి..? బీజేపీయే మళ్లీ అధికారం చేపడుతుందా? లేదంటే కమల దళానికి సమాజ్‌వాదీ పార్టీ షాకిస్తుందా? యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) పాలనకే ప్రజలు జై కొట్టారా? లేదంటే అఖిలేష్‌ యాదవ్‌ (Akhilesh Yadav)ని నమ్మారా? ఆ వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.

Punjab Exit Polls: కాంగ్రెస్‌కు ఆప్ బిగ్ షాక్.. పంజాబ్‌లో చీపురు పార్టీదే హ

పీ-మార్క్ (P-Mark):

పీ -మార్క్ సర్వే ప్రకారం.. ఉత్తర్ ప్రదేశ్‌లో బీజేపీయే మళ్లీ అధికారం చేపడుతుంది. కమల పార్టీ కూటమికి 240 సీట్లు వస్తాయి. సమాజ్‌వాదీ పార్టీ 140 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వస్తుంది. బీఎస్పీ, కాంగ్రెస్ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోాయాయి. బీఎస్పీకి 17,  కాంగ్రెస్‌కు 4 సీట్లు వచ్చే అవకాశముంది. గతంలో పోల్చితే బీజేపీకి సీట్లు బాగా తగ్గినా.. మళ్లీ ఆ పార్టీదే అధికారమని పీ-మార్క్ సర్వే అభిప్రాయపడింది.

న్యూస్  ఎక్స్ -పోల్‌స్ట్రాట్ (Nesws x- PolStrat):

న్యూస్ ఎక్స్ -పోల్‌స్ట్రాట్ ఎగ్జిట్ పోల్స్ కూడా యూపీలో మళ్లీ బీజేపీయే గెలుస్తుందని అంచనా వేసింది. గతంలో పోల్చితే సీట్లు తగ్గుతాయని వెల్లడించింది. కమల దళానికి  211 నుంచి 255 సీట్లు వస్తాయని న్యూస్ ఎక్స్-పోల్‌స్ట్రాట్ తెలిపింది. సమాజ్‌వాదీ 146 నుంచి 160 స్థానాల్లో విజయం సాధిస్తుందని అంచనా వేసింది.  బీఎస్పీ 14 నుంచి 24 సీట్లు వచ్చే అవకాశముంది. కాంగ్రెస్ పార్టీ ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. ఆ పార్టీకి 4- 6 స్థానాలు మాత్రమే దక్కే అవకాశముందని పేర్కొంది.

Assembly Elections 2022: ఐదు రాష్ట్రాల ఎన్నికలు సమాప్తం.. ఏ రాష్ట్రంలో ఎంత పోలింగ్

మ్యాట్రిజ్ పోల్ (Matrize-Poll):

మ్యాట్రిజ్ పోల్ కూడా బీజేపీ వైపే మొగ్గుచూపింది. మొత్తం 403 అసెంబ్లీ సీట్లున్న యూపీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే కనీసం 202 సీట్లు సాధించాలి. ఐతే బీజేపీ 211 నుంచి 225 సీట్లు సాధిస్తుందని మ్యాట్రిజ్ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసింది. సమాజ్‌వాదీకి 146 నుంచి 160 సీట్లు దక్కే ఛాన్స్ ఉంది. బీఎస్పీ 14-24 స్థానాలకే పరిమితమయ్యే అవకాశాలున్నాయి. ఇక కాంగ్రెస్ అట్టర్ ఫ్లాప్ అయిందని..కేవలం 4-6 స్థానాల్లో మాత్రమే విజయం సాధించవచ్చని మ్యాట్రిజ్ పోల్ పేర్కొంది.

ఈటీజీ రీసర్చ్ (ETG RESEARCH):

ఈటీజీ రీసర్చ్ సర్వే ప్రకారం.. ఉత్తర ప్రదేశ్‌లో బీజేపీకి 230 నుంచి 245 స్థానాలు వస్తాయి. సమాజ్‌వాదీ పార్టీ 150 నుంచి 165 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వస్తుంది. బీఎస్పీ 5-10, కాంగ్రెస్ 2-6 సీట్లకు మాత్రమే పరిమితమవుతుంది. ఇతర పార్టీలు కూడా పెద్దగా ప్రభావం చూపలేదు.

దాదాపు అన్ని సంస్థలూ యూపీలో  మళ్లీ బీజేపీదే విజయమని అంచనా వేశాయి. సీట్లు తగ్గినప్పటికీ... ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు పరిపడా స్థానాలను గెలుచుకుంటుందని అభిప్రాయపడ్డాయి.  బీజేపీకి సమాజ్‌వాదీ పార్టీ గట్టి పోటీ ఇచ్చినప్పుటికీ.. ప్రభుత్వం ఏర్పాటు చేసేంతగా సీట్లు గెలవదని స్పష్టం చేశాయి.   మిగతా పార్టీల ప్రభావం పెద్దగా లేదని వెల్లడించాయి.

ఎగ్జిట్ పోల్స్‌కు సంబంధించి మరిన్ని వివరాలు షేర్‌చాట్‌‌లో చూసేందుకు కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కాగా, యూపీలో మొత్తం ఏడు దశల్లో ఎన్నికలు జరిగాయి. పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్‌తో పాటు యూపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను కూడా మార్చి 10నే ప్రకటిస్తారు. ఈసారి ఎన్నికల్లో బీజేపీ (BJP), సమాజ్‌వాదీ పార్టీ (Samajwadi Party) మధ్యే ప్రధానంగా పోటీ ఉందని అవకాశముందని విశ్లేషకులు ముందు నుంచీ అభిప్రాయపడ్డారు. వీరితో పోల్చితే కాంగ్రెస్, బీఎస్పీ పార్టీ కాస్త వెనుకంజలో ఉన్నట్లు చెప్పారు. ఈసారి యూపీలో కాంగ్రెస్ పార్టీకి ప్రియాంక గాంధీ నాయకత్వం వహించినప్పటికీ పెద్దగా ప్రభావం చూపలేదని అంచనా వేశారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కూడా దాదాపు అలానే ఉన్నాయి. మరి ఇవే నిజమవుతాయా? లేదంటే ఊహించని ఫలితాలు వస్తాయా? అనేది తెలియాలంటే మార్చి 10 వరకు వేచి చూడక తప్పదు.

First published:

Tags: Akhilesh Yadav, Exit Polls 2022, UP Assembly Elections 2022, Uttar Pradesh Assembly Elections, Yogi adityanath

ఉత్తమ కథలు