హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Bihar Exit Polls 2020: బీహార్‌లో సన్‌రైజ్.. లాలు ఫ్యామిలీ నుంచి మూడో ముఖ్యమంత్రి ?

Bihar Exit Polls 2020: బీహార్‌లో సన్‌రైజ్.. లాలు ఫ్యామిలీ నుంచి మూడో ముఖ్యమంత్రి ?

తేజస్వి యాదవ్ (ఫైల్ ఫోటో)

తేజస్వి యాదవ్ (ఫైల్ ఫోటో)

Tejaswi Yadav: నితీష్ పాలనలో బీహారీల్లో పేరుకుపోయిన అసంతృప్తికి గల కారణాలను వెతికి పట్టుకోవడంలో తేజస్వి యాదవ్ విజయం సాధించారు.

బీహార్‌లో ఎన్నికలు ముగిశాయి. ఎగ్జిట్ పోల్ ఫలితాలు కూడా వచ్చేశాయి. ఎన్డీయే, యూపీఏ మధ్య హోరా హోరీ ఉంటుందని దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. అయితే దాదాపు అన్ని సంస్థలు ప్రకటించిన ఎగ్జిట్ పోల్స్‌ ఆర్జేడీ సారథ్యంలోని మహాఘట్‌బంధన్‌దే అధికారమని అంచనా వేశాయి. మొత్తం 243 సీట్లు ఉన్న బీహార్ అసెంబ్లీలో విజయం సాధించడానికి 122 సీట్లు రావాలి. మహాఘట్‌బంధన్‌కు ఆ మేరకు సీట్లు వస్తాయని మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ పేర్కొన్నాయి. ఈ అంచనాలు నిజమైతే బీహార్‌లో మహాఘట్‌బంధన్ విజయం సాధించడం ఖాయం. అప్పుడు ఆ కూటమికి నాయకత్వం వహించనున్న లాలూ చిన్న కుమారుడు తేజస్వీ యాదవ్ బీహార్‌ ముఖ్యమంత్రి అవుతారు.

బీహార్‌ను ఆర్జేడీ తరపున లాలూప్రసాద్ యాదవ్, ఆయన భార్య రబ్రీ దేవి సీఎంగా పాలించారు. తేజస్వి యాదవ్ ముఖ్యమంత్రి అయితే లాలూ ఫ్యామిలీ నుంచి మూడో వ్యక్తి ముఖ్యమంత్రి అయినట్టవుతుంది. ఒకప్పుడు బీహార్ రాజకీయాలను శాసించిన లాలూ.. ఆ తరువాత అవినీతి ఆరోపణలతో జైలు పాలయ్యారు. ఆయన పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్.. తన వింత వ్యవహారశైలితో లాలూ రాజకీయ వారసుడు కాలేకపోయారు. దీంతో అందరి దృష్టి లాలూ చిన్న కుమారుడు తేజస్వి యాదవ్‌పైనే నెలకొంది. 30 ఏళ్ల కుర్రాడు లాలూ వారసత్వాన్ని నిలబెట్టి.. బీహార్ ఎన్నికల్లో మహామహులను తట్టుకుని నిలబడతాడా ? అని చాలామంది సందేహం వ్యక్తం చేశారు.

అయితే తేజస్వి మాత్రం తన తండ్రి శైలికి భిన్నంగా ముందుకు సాగారు. నితీష్ పాలనలో బీహారీల్లో పేరుకుపోయిన అసంతృప్తికి గల కారణాలను వెతికి పట్టుకోవడంలో విజయం సాధించారు. ఉద్యోగాలు లేని బీహార్ యువకులను ఆకర్షించి.. వారితో పాటు వారి పెద్దల ఓట్లను కూడా తమ కూటమి దక్కించుకునేలా చేయడంలో తేజస్వి ముఖ్యభూమిక పోషించాడని చెప్పాలి. మొత్తానికి బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో లాలూ ప్రసాద్ యాదవ్ వారసుడి సారథ్యంలోని కూటమి మెరిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

First published:

Tags: Bihar Assembly Elections 2020, Tejaswi Yadav

ఉత్తమ కథలు