హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Punjab Exit Polls: కాంగ్రెస్‌కు ఆప్ బిగ్ షాక్.. పంజాబ్‌లో చీపురు పార్టీదే హవా..

Punjab Exit Polls: కాంగ్రెస్‌కు ఆప్ బిగ్ షాక్.. పంజాబ్‌లో చీపురు పార్టీదే హవా..

చన్నీ, భగవంత్ మాన్ సింగ్ (ఫైల్ ఫోటో)

చన్నీ, భగవంత్ మాన్ సింగ్ (ఫైల్ ఫోటో)

Punjab: ఏ రాష్ట్రంలో అధికారం ఎవరిది అనే దానిపై ముందే సంకేతాలు ఇవ్వనున్న ఎగ్జిట్ పోల్స్.. కాంగ్రెస్ పార్టీకి పెద్ద షాక్ ఇచ్చాయి.

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. మార్చి 10న ఫలితాలు రానున్నాయి. అయితే అంతకంటే ముందే వచ్చిన ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఆసక్తికరంగా ఉన్నాయి. ఏ రాష్ట్రంలో అధికారం ఎవరిది అనే దానిపై ముందే సంకేతాలు ఇవ్వనున్న ఎగ్జిట్ పోల్స్.. కాంగ్రెస్ పార్టీకి పెద్ద షాక్ ఇచ్చాయి. ఇప్పటివరకు పంజాబ్‌లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ.. మళ్లీ అధికారం దక్కించుకునేందుకు ఎన్నో వ్యూహాలు రచించింది. ముఖ్యమంత్రి కూడా మార్చింది. కానీ ఆ పార్టీకి ఓటమి తప్పదని ఎగ్జిట్ పోల్ అంచనాలు చెబుతున్నాయి. పంజాబ్ అసెంబ్లీలో మొత్తం 117 స్థానాలు ఉండగా.. 59 స్థానాలు సాధించిన పార్టీ అధికారంలోకి వస్తుంది. పలు మీడియా సంస్థలు వెల్లడించిన ఎగ్జిట్ పోల్స్‌లో అధికారం ఆప్‌కు దక్కే అవకాశం ఉందని తేలింది.

అయితే కొన్ని సంస్థలు మాత్రం ఆప్, కాంగ్రెస్ మధ్య పోటీ హోరాహోరీగా ఉంటుందని వెల్లడించాయి. Axis my india నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్‌ అంచనాలు కాంగ్రెస్‌కు 19- 31 సీట్లు, ఆప్‌కు 76 90 సీట్లు, శిరోమణి ఆకాళీదల్‌కు 7- 11 ‘సీట్లు, బీజేపీకి 1- 4 సీట్లు రావొచ్చని పేర్కొంది. సీ ఓటర్ ఎగ్జిట్ పోల్స్ సైతం పంజాబ్‌లో అధికారం ఆప్‌కే దక్కొచ్చని అంచనా వేసింది. కాంగ్రెస్ పార్టీకి 41-49 సీట్లు, ఆప్‌కు 59-57 సీట్లు, బీజేపీ, శిరోమణి అకాళీదళ్ వంటి పార్టీలకు 3-13 సీట్లు రావొచ్చని అభిప్రాయపడింది.

Punjab Exit Polls: కాంగ్రెస్‌కు ఆప్ బిగ్ షాక్.. పంజాబ్‌లో చీపురు పార్టీదే హవా..

UP Exit Polls 2022: యూపీలో బీజేపీదే గెలుపు.. కాంగ్రెస్ అట్టర్‌ ఫ్లాప్.. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు

ఎగ్జిట్ పోల్స్‌కు సంబంధించి మరిన్ని వివరాలు షేర్‌చాట్‌‌లో చూసేందుకు కోసం ఇక్కడ క్లిక్ చేయండి

టుడే చాణక్య ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రకారం కాంగ్రెస్‌కు 54, ఆప్‌కు 54 ఇతరులకు 9 సీట్లు వచ్చే అవకాశం ఉంది. ఎంఆర్‌సీ ఎగ్జిట్ పోల్స్ ఫలితాల ప్రకారం కాంగ్రెస్‌కు 55, ఆప్‌కు 55, ఇతరులకు 7 సీట్లు రావొచ్చని వెల్లడైంది. మొత్తానికి పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పోటీ కాంగ్రెస్, ఆప్ మధ్యే ఉంటుందని.. ఇందులో ఆప్‌ అదికారంలోకి వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి.

First published:

Tags: Punjab, Punjab Assembly Elections 2022

ఉత్తమ కథలు