Home /News /national /

EXIT POLL ESTIMATIONS RELEASED FOR UTTAR PRADESH UTTARAKHAND PUNJAB GOA AND MANIPUR ASSEMBLY ELECITONS AK

Exits Polls: ఉత్తరప్రదేశ్‌ మళ్లీ బీజేపీదే.. వెల్లడించిన ఎగ్జిట్ పోల్స్ అంచనాలు.. మిగతా నాలుగు రాష్ట్రాల్లో వారిదే అధికారం

Exit Polls: యూపీలో మరోసారి బీజేపీకి అధికారం దక్కుతుందా ? సమాజ్‌వాదీ పార్టీ కూటమి అధికారంలోకి వస్తుందా ? అన్న అంశంపై అనేక ప్రీ పోల్ సర్వేలు తమ అంచనాలను వెల్లడించాయి.

Exit Polls: యూపీలో మరోసారి బీజేపీకి అధికారం దక్కుతుందా ? సమాజ్‌వాదీ పార్టీ కూటమి అధికారంలోకి వస్తుందా ? అన్న అంశంపై అనేక ప్రీ పోల్ సర్వేలు తమ అంచనాలను వెల్లడించాయి.

Exit Polls: యూపీలో మరోసారి బీజేపీకి అధికారం దక్కుతుందా ? సమాజ్‌వాదీ పార్టీ కూటమి అధికారంలోకి వస్తుందా ? అన్న అంశంపై అనేక ప్రీ పోల్ సర్వేలు తమ అంచనాలను వెల్లడించాయి.

    దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలు పూర్తయ్యాయి. ఈ రాష్ట్రాల్లో దేశంలోని అత్యంత కీలక రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ కూడా ఉండటంతో.. అందరి దృష్టి ఈ ఎన్నికలపై నెలకొంది. యూపీలో మరోసారి బీజేపీకి అధికారం దక్కుతుందా ? సమాజ్‌వాదీ పార్టీ కూటమి అధికారంలోకి వస్తుందా ? అన్న అంశంపై అనేక ప్రీ పోల్ సర్వేలు తమ అంచనాలను వెల్లడించాయి. ఉత్తరప్రదేశ్‌తో పాటు పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ అసెంబ్లీలకు ఎన్నికలు పూర్తయ్యాయి. అయితే ఎన్నికలు పూర్తయి తరువాత వచ్చే ఎగ్జిట్ పోల్ అంచనాలు ఎవరి వైపు మొగ్గు చూపుతాయన్న దానిపై అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. కొద్దిసేపటి క్రితం యూపీలో చివరి విడత ఎన్నికలు కూడా పూర్తి కావడంతో.. ఎగ్జిట్ పోల్ అంచనాలను పలు మీడియా సంస్థలు ప్రకటించాయి.

    ఉత్తరప్రదేశ్‌లో బీజేపీదే అధికారం అని దాదాపు అన్ని సంస్థల ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేశాయి. Matrize సంస్థ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం బీజేపీ కూటమికి 262- 277, ఎస్పీ కూటమికి 119- 134, బీఎస్పీకి 7-15, కాంగ్రెస్‌కు 3-8 సీట్లు రానున్నాయి. P-Marq ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రకారం బీజేపీకి కూటమికి 240, ఎస్పీ కూటమికి 140, బీఎస్పీకి 17, కాంగ్రెస్‌కు 4, ఇతరులకు 2 సీట్లు రావొచ్చు. Polstrat ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రకారం బీజేపీ కూటమికి 211-225, ఎస్పీ కూటమికి 116-160, బీఎస్పీకి 14-24, కాంగ్రెస్‌కు 4-6 సీట్లు రానున్నాయి. ETG Research ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రకారం బీజేపీ కూటమికి 230-245, ఎస్పీ కూటమికి 150-165, బీఎస్పీకి 5-10, కాంగ్రెస్‌కు 2-6, ఇతరులకు 2-6 సీట్లు వచ్చే అవకాశం ఉంది.

    పంజాబ్‌లో కాంగ్రెస్ పార్టీకి షాక్ తగలనున్నట్టు ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. అధికార కాంగ్రెస్ పార్టీ గద్దె దిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు పేర్కొన్నాయి. Times Now Veto అంచనాల ప్రకారం కాంగ్రెస్‌కు 22, ఆప్‌కు 70, బీజేపీకి 5, శిరోమణి అకాశీదల్‌కు 19, ఇతరులకు ఒక్క సీటు రావొచ్చు. Axis My India కాంగ్రెస్‌కు 19-31, ఆప్‌కు 76-90, బీజేపీకి 1-4, శిరోమణి అకాశీదల్‌కు 7-11, ఇతరులకు 0-2 సీట్లు వచ్చే అవకాశం ఉంది. ETG Research ఎగ్జిట్ పోల్స్ ప్రకారం ప్రకారం కాంగ్రెస్‌కు 23-27, ఆప్‌కు 70-75, బీజేపీకి 3-5, శిరోమణి అకాశీదల్‌కు 7-13 సీట్లు వచ్చే ఛాన్స్ ఉంది. Jan ki Baat ఎగ్జిట్ పోల్స్ ప్రకారం కాంగ్రెస్‌కు 18-31, ఆప్‌కు 60-84, బీజేపీకి 3-7, శిరోమణి అకాళీదల్‌కు 12-19 సీట్లు రావొచ్చు.

    ఉత్తరాఖండ్‌లో కాంగ్రెస్, బీజేపీ మధ్య పోటాపోటీ ఉండొచ్చని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. C Voter సంస్థ అంచనాల ప్రకారం కాంగ్రెస్‌కు 31, బీజేపీకి 37, ఇతరులకు 2 సీట్లు వచ్చే అవకాశం ఉంది. Jan Ki Baat ఎగ్జిట్ పోల్స్ అంచనా ప్రకారం కాంగ్రెస్‌కు 27-35, బీజేపీకి 32-41, ఇతరులకు 5 సీట్లు రావొచ్చు.Times Now Veto అంచనాల ప్రకారం కాంగ్రెస్‌కు 31, బీజేపీకి 37, ఇతరులకు 2 సీట్లు వచ్చే ఛాన్స్ ఉంది.

    గోవా‌లో కాంగ్రెస్, బీజేపీ మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్టుగా ఉంటుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ఇక్కడ ఇతరులు కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. CNX ఎగ్జిట్ పోల్స్ ప్రకారం కాంగ్రెస్‌కి 11-17, బీజేపీికి 16-22, ఇతరులకు 5-9 సీట్లు వచ్చే అవకాశం ఉంది. P Marq అంచనాల ప్రకారం కాంగ్రెస్‌ 13-17‌, బీజేపీకి 13-17, ఇతరులకు 2-4 సీట్లు రావొచ్చు. Jan ki baat ఎగ్జిట్ పోల్స్ ప్రకారం కాంగ్రెస్‌కు 14-19, బీజేపీకి 13-19, ఇతరులకు 5-10 సీట్లు రావొచ్చు. Times Now Veto ఎగ్జిట్ పోల్స్ ప్రకారం కాంగ్రెస్‌కు 16, బీజేపీకి 14, ఇతరులకు 6 సీట్లు వచ్చే అవకాశం ఉంది.

    మణిపూర్‌లో అధికారం బీజేపీకి దక్కే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. Designboxed అంచనా ప్రకారం కాంగ్రెస్‌కు 12-17, బీజేపీకి 32-38, ఎన్‌పీపీకి 2-4, ఇతరులకు 2-5 సీట్లు వచ్చే అవకాశం ఉంది. P Marq అంచనా ప్రకారం కాంగ్రెస్‌కు 11-17, బీజేపీకి 27-31, ఎన్‌పీపీకి 6-10, ఇతరులకు 5-13 సీట్లు వచ్చే అవకాశం ఉంది. Jan Ki baat అంచనా ప్రకారం కాంగ్రెస్‌కు 10-14, బీజేపీకి 22-28, ఎన్‌పీపీకి 7-8, ఇతరులకు 12-18 సీట్లు వచ్చే అవకాశం ఉంది. CNX అంచనా ప్రకారం కాంగ్రెస్‌కు 12-17, బీజేపీకి 26-31, ఎన్‌పీపీకి 6-10, ఇతరులకు 7-12 సీట్లు వచ్చే అవకాశం ఉంది.

    Punjab Exit Polls: కాంగ్రెస్‌కు ఆప్ బిగ్ షాక్.. పంజాబ్‌లో చీపురు పార్టీదే హవా..

    UP Exit Polls 2022: యూపీలో బీజేపీదే గెలుపు.. కాంగ్రెస్ అట్టర్‌ ఫ్లాప్.. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు

    ఎగ్జిట్ పోల్స్‌కు సంబంధించి మరిన్ని వివరాలు షేర్‌చాట్‌‌లో చూసేందుకు కోసం ఇక్కడ క్లిక్ చేయండి

    యూపీలో 403 శాసనసభ నియోజకవర్గాలు ఉండగా.. ఉత్తరాఖండ్‌లో 70, పంజాబ్‌లో 117, గోవాలో 40, మణిపూర్‌లో 60 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. యూపీలో ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకు ఎన్నికలు జరగ్గా.. ఉత్తరాఖండ్, గోవాల్లో ఫిబ్రవరి 14న, ఎన్నికలు జరిగాయి. పంజాబ్‌లో ఫిబ్రవరిలో 20న ఎన్నికలు జరిగాయి. మణిపూర్‌లో ఫిబ్రవరి 27, మార్చి 3న రెండు దశల్లో పోలింగ్ జరిగింది. మార్చి 10న ఈ రాష్ట్రాలకు సంబంధించిన ఓట్లను లెక్కించనున్నారు.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Assembly Election 2022, Exit polls, Uttar Pradesh Assembly Elections

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు