నిర్భయ రేపిస్టులకు ఉరి మళ్లీ వాయిదా..

Nirbhaya : అనుకున్నట్లే అయ్యింది. నిర్భయ రేపిస్టుల ఉరి మరోసారి వాయిదా పడింది. జనవరి 22న నలుగురు దోషులకు పడాల్సిన ఉరి శిక్షను వాయిదా వేశారు.

news18-telugu
Updated: January 16, 2020, 3:42 PM IST
నిర్భయ రేపిస్టులకు ఉరి మళ్లీ వాయిదా..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
అనుకున్నట్లే అయ్యింది. నిర్భయ రేపిస్టుల ఉరి మరోసారి వాయిదా పడింది. జనవరి 22న నలుగురు దోషులకు పడాల్సిన ఉరి శిక్షను వాయిదా వేశారు. దోషి ముఖేశ్ పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్ రాష్ట్రపతి వద్ద ఉంది. ఈ రోజు ఉదయం ఢిల్లీ ప్రభుత్వం సహా లెఫ్టినెంట్ గవర్నర్ దోషి పిటిషన్‌ను తిరస్కరించారు. ఈ మేరకు లెఫ్టినెంట్ గవర్నర్ కేంద్ర హోం శాఖకు లేఖ రాశారు కూడా. అయితే.. రాష్ట్రపతి క్షమాభిక్ష తిరస్కరించాక కూడా దోషులకు ఉరిశిక్షను అమలు చేయడానికి 14 రోజుల గడువు ఇవ్వాలని 2014లో ఒక తీర్పులో భాగంగా సుప్రీం కోర్టు తెలిపింది. దీంతో 22న పడాల్సిన ఉరి శిక్ష వాయిదా వేయాల్సి వచ్చింది.

2012లో నిర్భయపై సామూహిక అత్యాచారం చేసి, చంపిన నేరస్థులు ముకేష్ (32), పవన్ గుప్తా (25), వినయ్ శర్మ (26), అక్షయ్‌కుమార్ సింగ్ (31)లకు ఉరి శిక్ష అమలు కావాల్సి ఉంది.
First published: January 16, 2020, 3:40 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading