Home /News /national /

EXCLUSIVE 2021 ENDS WITH AADHAAR BOOM AS DECEMBER AUTHENTICATIONS HIT RECORD 156 CRORE AND COUNTING GH VB

Exclusive: 2021 డిసెంబర్‌లో రికార్డు స్థాయిలో ఆధార్ అథెంటికేషన్‌లు.. ఎందుకో తెలుసా..?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

గతేడాది డిసెంబర్ నెలలో 29వ తేదీ నాటికి ఏకంగా 156 కోట్ల ఆధార్ అథెంటికేషన్‌లు జరిగాయి. డిసెంబర్ నెల మొత్తంలో ఈ సంఖ్య 170 కోట్లకు చేరుకుందని సీనియర్ ప్రభుత్వ అధికారి ఒకరు News18.comకి తెలిపారు. ఇలా ఎందుకు జరుగుతున్నాయంటే..

భారతీయుల జీవితంలో అంతర్భాగమైన ఆధార్ కార్డు(Aadhar Card) ఇప్పుడు అన్నిచోట్లా తప్పనిసరిగా మారింది. పని చిన్నదైనా.. పెద్దదైనా ఆధార్ అథెంటికేషన్‌(Authentication)లేనిదే జరగడం లేదు. ఇన్‌కమ్ టాక్స్(Income Tax), బ్యాంకు అకౌంటు(Bank Account), పెన్షన్, గ్యాస్ కనెక్షన్, ప్రభుత్వ సబ్సిడీలు, పాసుపోర్టు, జన్ ధన్ యోజన(Jan Dhan Yojana), పీఎఫ్ ఇలా అన్నింటిలోనూ అత్యంత కీలకమైన డాక్యుమెంట్‌గా ఆధార్ కార్డు మారిపోయింది. ఐతే ఆధార్‌ అన్ని పనుల్లో అనుసంధానం అవుతున్న నేపథ్యంలో రికార్డు స్థాయిలో అథెంటికేషన్‌ల సంఖ్య నమోదవుతోంది. గతేడాది డిసెంబర్ నెలలో 29వ తేదీ నాటికి ఏకంగా 156 కోట్ల ఆధార్ అథెంటికేషన్‌లు జరిగాయి. డిసెంబర్ నెల మొత్తంలో ఈ సంఖ్య 170 కోట్లకు చేరుకుందని సీనియర్ ప్రభుత్వ అధికారి ఒకరు News18.comకి తెలిపారు. ఆధార్ సేవలు ప్రారంభమైనప్పటి నుంచి అత్యధిక నెలవారీ అథెంటికేషన్‌ల సంఖ్య ఇదే కావడం విశేషం. దీనితో భారతదేశంలో 2021 సంవత్సరం ఆధార్ వినియోగం విజృంభణతో ముగిసిందని చెప్పవచ్చు.

Explained: 2021లో అత్యధిక పులుల మరణాలు.. దశాబ్దంలోనే ఎక్కువ.. ఎందుకు ఇలా జరుగుతోంది..?


సరళంగా చెప్పాలంటే.. అథెంటికేషన్/ప్రామాణీకరణ అనేది ఒక సేవ లేదా ప్రభుత్వ ప్రయోజనాన్ని పొందడానికి ఒక వ్యక్తి ఆధార్‌ని ఉపయోగించడం. ఇంతకు ముందు ఆధార్ అథెంటికేషన్ల నెలవారీ అత్యధిక సంఖ్య 146 కోట్లు. 2021లో సెప్టెంబర్‌లో ఈ స్థాయిలో ప్రజలు ఆధార్ కార్డుని వినియోగించారు. ఏప్రిల్, మేలలో కోవిడ్-19 సెకండ్ వేవ్ సమయంలో అథెంటికేషన్ల సంఖ్య 100 కోట్ల కంటే దిగువకు పడిపోయింది. అంటే డిసెంబర్ సంఖ్య ఆ సమయం నుంచి 70 శాతం పెరుగుదల నమోదు చేసిందని చెప్పవచ్చు.

భారతదేశంలో ప్రస్తుతం 131 కోట్ల మంది ప్రజలు ఆధార్ నంబర్‌ని కలిగి ఉన్నారు. దీని అర్థం ప్రజలు వివిధ రకాల సేవలు లేదా ప్రయోజనాలు పొందేందుకు ఒకటి కంటే ఎక్కువసార్లు ఆధార్ నంబర్‌ను ఉపయోగించారని సూచిస్తుంది. డిసెంబర్ నెలలో 29 నాటికి జరిగిన 156 కోట్ల ఆధార్ అథెంటికేషన్లలో రికార్డు స్థాయిలో 28 కోట్లు ఈ-కేవైసీ (e-KYC) అథెంటికేషన్లు జరిగాయి. ఇవి అధిక డిజిటల్ వినియోగాన్ని కూడా చూపుతున్నాయి. తాజా డేటా ప్రకారం, ప్రస్తుతం భారతదేశంలో 87% పైగా కరెంట్, సేవింగ్స్ బ్యాంక్ ఖాతాలు ఆధార్‌తో అనుసంధానం అయ్యాయి.

54 మంత్రిత్వ శాఖలకు చెందిన దాదాపు 311 కేంద్ర సంక్షేమ పథకాలు ఆధార్‌ని ఉపయోగించే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (DBT) ప్లాట్‌ఫామ్‌ పరిధిలోకి రావడం విశేషం. రైతుల కోసం తీసుకొచ్చిన పీఎం-కిసాన్ నిధి పథకం కూడా ఆధార్ ప్లాట్‌ఫామ్‌పైనే ఆధారపడింది. ఈ పథకంలో దాదాపు 10 కోట్ల మంది రైతులకు ప్రతి నాలుగు నెలలకు ఒక్కొక్కరికి రూ.2,000 బదిలీ చేస్తున్నారు. ఇంకా, పేదలకు ఉచిత ఆహార ధాన్యాలు పంపిణీ చేస్తున్న ప్రధానమంత్రి ఉజ్వల యోజన, పీఎం గరీబ్ కళ్యాణ్ యోజన కూడా ఆధార్ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగిస్తాయి.

Explained: భారత్‌లో కోవిడ్ వ్యాక్సిన్ బూస్టర్ డోసులు.. డోసుల మధ్య గ్యాప్ ఎంత ఉండాలి.. పూర్తి వివరాలు తెలుసుకోండి..


ఎలక్టోరల్ రోల్‌లను ఆర్డర్‌లో క్రమబద్ధీకరించడానికి, దేశంలో నివాస స్థలాలను మారినప్పుడు ఓటరు తన ఐడీ కార్డును మార్చుకునే సౌలభ్యాన్ని అందించడానికి ఓటరు ఐడీ కార్డులను స్వచ్ఛందంగా ఆధార్‌తో లింక్ చేయడానికి ప్రభుత్వం ఇటీవల ఒక చట్టాన్ని తీసుకువచ్చింది. అంతేకాదు కోవిడ్-19 టీకాలు తీసుకోవాలన్నా ఆధార్ ఉండి తీరాల్సిందే. దీనితో అథెంటికేషన్‌ల పెరుగుదలకు టీకాలు కూడా ప్రధాన కారణం అవుతున్నాయి. అవినీతిని అరికట్టడానికి, కోవిడ్-19 లాక్‌డౌన్ సమయంలో ప్రజలు ప్రయోజనాలు పొందేలా చేయడానికి ఆధార్ ఆధారిత డీబీటీ పథకం చాలా ఉపయోగపడుతుందని.. ఇది ఒక గేమ్-ఛేంజర్ అని పీఎం మోదీ అనేక సందర్భాల్లో పేర్కొన్నారు.
Published by:Veera Babu
First published:

Tags: AADHAR, UIDAI

తదుపరి వార్తలు