Home /News /national /

EXCITING NEWS FOR TWITTER USERS NEW FEATURE AVAILABLE ONLY FOR THESE USERS UMG GH

Twitter Spaces: ట్విట్టర్ యూజర్స్ కు అదిరిపోయే న్యూస్.. అందుబాటులో కొత్త ఫీచర్.. వాళ్లకు మాత్రమే!

 ట్విట్టర్ యూజర్స్ కు అదిరిపోయే న్యూస్.. అందుబాటులో కొత్త ఫీచర్..  ఈ  యూజర్స్ కు మాత్రమే!

ట్విట్టర్ యూజర్స్ కు అదిరిపోయే న్యూస్.. అందుబాటులో కొత్త ఫీచర్.. ఈ యూజర్స్ కు మాత్రమే!

ట్విట్టర్(Twitter) స్పేసెస్‌లోని ఆడియోను అందరితో షేర్ చేసుకునేలా ఓ క్లిప్పింగ్ (Clipping) టూల్‌ను లాంచ్ చేసినట్లు తాజాగా ట్విట్టర్ ప్రకటించింది. ఈ ఫీచర్‌తో ఒక స్పేస్‌లో పార్టిసిపెంట్లు మాట్లాడే ఆడియోలో 30 సెకన్లను కట్ చేసుకుని ఆ ఆడియో క్లిప్‌ను ట్వీట్ ద్వారా షేర్ చేసుకోవచ్చు.

ఇంకా చదవండి ...
ప్రముఖ మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ (Twitter) కొద్ది నెలల క్రితం iOS, ఆండ్రాయిడ్(Android) యూజర్ల కోసం 'స్పేసెస్ (Spaces)' ఫీచర్​ను పరిచయం చేసిన విషయం తెలిసిందే. ఈ అద్భుతమైన ఫీచర్ సాయంతో యూజర్లు లైవ్‌లోనే ఆడియో చాట్ చేసుకుంటున్నారు. అయితే ఈ స్పేసెస్‌లోని ఆడియోను అందరితో షేర్ చేసుకునేలా ఓ క్లిప్పింగ్ (Clipping) టూల్‌ను లాంచ్ చేసినట్లు తాజాగా ట్విట్టర్ ప్రకటించింది. ఈ ఫీచర్‌తో ఒక స్పేస్‌లో పార్టిసిపెంట్లు మాట్లాడే ఆడియోలో 30 సెకన్లను కట్ చేసుకుని ఆ ఆడియో(Audio) క్లిప్‌ను ట్వీట్ ద్వారా షేర్ చేసుకోవచ్చు. ఈ ఆడియో క్లిప్ షేరింగ్ ఫీచర్ ఇప్పుడు క్రమంగా ట్విట్టర్ యూజర్లందరికీ అందుబాటులోకి వస్తోందని.. ప్రస్తుతం తమ ప్లాట్‌ఫామ్‌లో Spaces క్లిప్‌లను షేర్ చేయవచ్చని ట్విట్టర్ ప్రకటించింది.

ఇదీ చదవండి: Air Ambulance: అద్భుతం..గుండె ఆపరేషన్ కోసం .. అమెరికా నుంచి చెన్నైకు ఎయిర్ అంబులెన్స్.. చదివితే చేతులెత్తి మొక్కుతారు !



"మేం iOS, ఆండ్రాయిడ్ ఫోన్లు వాడే ప్రతి ఒక్కరికీ ఆడియో క్లిప్పింగ్‌ను విడుదల చేస్తున్నాం!" అని కంపెనీ ఓ ట్వీట్ చేసింది. ప్రస్తుతం, ఈ ఫీచర్ ట్విట్టర్ వెబ్ యూజర్లకు అందుబాటులో లేదు. అయితే త్వరలోనే అన్ని భాషల్లోకి  తెస్తామని ట్విట్టర్ తెలిపింది. ఈ ఫీచర్‌తో వినియోగదారులు ఇప్పుడు మైక్రోబ్లాగింగ్(Micro Blogging) సైట్‌లో ఇతరులతో షేర్ చేయడానికి లైవ్ లేదా రికార్డ్ చేసిన స్పేస్‌ల నుంచి 30 సెకన్ల ఆడియోను క్రియేట్ చేయవచ్చు. అలా క్రియేట్ చేసిన ఆడియోని షేర్ చేయవచ్చు. షేర్ చేసిన ఆడియో 30 రోజుల వరకు అందుబాటులో ఉంటుంది. ఈ కొత్త టూల్ అనేది యూజర్లు వారి స్పేస్‌లపై ఆసక్తిని పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది. అదే సమయంలో మొత్తం రికార్డింగ్‌ను షేర్ చేయకుండా ఆడియో చాట్‌లోని ముఖ్యమైన పార్ట్‌లను హైలైట్ చేయడానికి యూజ్ అవుతుంది. తద్వారా ఫాలోవర్స్ మొత్తం ఆడియో స్ట్రీమ్ వినకుండా కావాల్సింది మాత్రమే విని టైమ్‌ చాలా సేవ్ చేసుకోగలుగుతారు.

https://twitter.com/TwitterSpaces/status/1549839672339218435?t=is6M88VJkbdXw5t9sRyvrw&s=19



ట్విట్టర్ యూజర్లు తాము హోస్ట్ చేసే స్పేసెస్‌ను రికార్డు చేసుకోవచ్చు. అయితే ఈ ఆడియో స్పేసెస్‌ కింద కత్తెర గుర్తుగా ఉండే క్లిప్పింగ్ ఫీచర్‌తో 30 సెకండ్ల ఆడియోని షేర్ చేసుకోవచ్చు. అంతేకాదు లైవ్ ఆడియో నుంచి కూడా క్లిప్స్‌ షేర్ చేసుకోవచ్చు. Spaces లో పాల్గొనేవారు ఎన్ని క్లిప్‌లనైనా షేర్ చేయవచ్చు. హోస్ట్ కాకుండా స్పీకర్, co-hostగా ఉన్నా క్లిప్ షేర్ చేయడం కుదురుతుంది. రికార్డ్ చేసిన లేదా లైవ్ స్పేస్‌లో క్లిప్పింగ్ ఐకాన్‌పై క్లిక్ చేయడం ద్వారా ఆడియో షేర్ చేయవచ్చు. ఈ ఆడియో క్లిప్ లైవ్ స్పేస్‌ ముగిసిన తర్వాత కూడా పబ్లిక్‌కి అందుబాటులో ఉంటుందని గమనించాలి. Twitter Spaces ప్రారంభించడాన్ని ప్రేరేపించిన సోషల్ ఆడియో యాప్ క్లబ్‌హౌస్ 2021 సెప్టెంబర్‌లో క్లిప్పింగ్ ఫీచర్‌ను విడుదల చేసింది. ఈ ఫీచర్ పబ్లిక్ రూమ్‌లలో మోస్ట్ రీసెంట్ అయిన 30 సెకన్ల ఆడియోను కట్ చేసి ఎక్కడైనా షేర్ చేయడానికి వీలు కల్పిస్తుంది.
Published by:Mahesh
First published:

Tags: Android, Ios, Social Media, Tech news, Twitter

తదుపరి వార్తలు