హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Manmohan Singh: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు అస్వస్థత.. ఎయిమ్స్‌లో చికిత్స

Manmohan Singh: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు అస్వస్థత.. ఎయిమ్స్‌లో చికిత్స

మన్మోహన్ సింగ్ (ఫైల్ ఫోటో)

మన్మోహన్ సింగ్ (ఫైల్ ఫోటో)

Manmohan Singh Health Update: నిన్నటి నుంచి జ్వరంతో బాధపడుతున్న మన్మోహన్ సింగ్ పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని ఎయిమ్స్ వైదులు తెలిపారు.

  మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ (Manmohan Singh)అస్వస్థతకు గురయ్యారు. జ్వరం, అలసట కారణంగా ఆయన నేడు సాయంత్రం ఎయిమ్స్‌లో చేరారు. నిన్నటి నుంచి జ్వరంతో బాధపడుతున్న మన్మోహన్ సింగ్  పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని ఎయిమ్స్ వైదులు తెలిపారు. ప్రస్తుతం ఆయనకు ఫ్లూయిడ్స్ ఎక్కిస్తున్నారు. 88 ఏళ్ల మన్మోహన్ సింగ్ కొద్ది నెలల క్రితం కూడా అనారోగ్యానికి గురయ్యారు. కరోనా సెకండ్ వేవ్ సమయంలో ఆయన కూడా కరోనా (Covid 19) బారిన పడ్డారు. ఎయిమ్స్‌లో చేరి చికిత్స పొందారు. మన్మోహన్ సింగ్ ఆస్పత్రిలో చేరడంపై ఏఐసీసీ కమ్యూనికేషన్ ఇంఛార్జ్ ప్రణవ్ ఝా స్పందించారు.

  Telangana: ఆ కారు బండి సంజయ్ మిత్రుడిదే.. బీజేపీకి టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ కౌంటర్

  మన్మోహన్ సింగ్‌కు సాధారణ చికిత్స జరుగుతోందని అన్నారు. ఆయన పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. మన్మోహన్ సింగ్ ఆరోగ్యంపై వస్తున్న పుకార్లను ఆయన ఖండించారు. ఏదైనా అప్‌డేట్స్ ఉంటే తామే స్వయంగా చెబుతామని వెల్లడించారు. మన్మోహన్ సింగ్ ఆస్పత్రిలో చేరారనే వార్త తెలిసిన వెంటనే కాంగ్రెస్ నేతలు స్పందించారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

  Manchu Vishnu: మంచు విష్ణు అలాంటి రూల్ పెట్టబోతున్నారా ? ప్రకాశ్ రాజ్ మాటలకు అర్థమేంటి ?

  2004లో కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తరువాత మన్మోహన్ సింగ్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. సంకీర్ణ ప్రభుత్వాన్ని విజయవంతంగా నడిపించారు. 2009లో యూపీఏ రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత మన్మోహన్ సింగ్ రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ఆయన సారథ్యంలో యూపీఏ అనేక ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చింది. ప్రధానిగా వ్యవహరించిన సమయంలోనే ఆయనకు ఒకసారి బైపాస్ సర్జరీ కూడా జరిగింది. కొన్ని నెలల విశ్రాంతి తీసుకున్న అనంతరం.. ఆయన తిరిగి విధుల్లో చేరారు. కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి ఎంతో విధేయుడిగా ఉన్నారు మన్మోహన్. అయితే వయోభారం, ఇతర ఆరోగ్య సమస్యల కారణంగా ఆయన పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారు.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Congress, Manmohan singh

  ఉత్తమ కథలు