• HOME
  • »
  • NEWS
  • »
  • NATIONAL
  • »
  • EX PRESIDENT PRANAB MUKHERJEE SENSATIONAL COMMENTS ON TELANGANA STATE FORMATION AK

Pranab Mukherjee Telangana: ప్రత్యేక ‘తెలంగాణ’పై ఆత్మకథలో ప్రణబ్ ముఖర్జీ సంచలన వ్యాఖ్యలు

Pranab Mukherjee Telangana: ప్రత్యేక ‘తెలంగాణ’పై ఆత్మకథలో ప్రణబ్ ముఖర్జీ సంచలన వ్యాఖ్యలు

ప్రణబ్ ముఖర్జీ, తెలంగాణ ప్రతీకాత్మక చిత్రం

Pranab Mukherjee Telangana: ప్రత్యేక తెలంగాణ గురించి ప్రణబ్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సరికొత్త చర్చకు తెరలేపాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు, ప్రణబ్ ముఖర్జీకి ఎంతో సంబంధం ఉంది. ఆయన రాష్ట్రపతిగా ఉన్న సమయంలోనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది.

  • Share this:
    Pranab Mukherjee Telangana: ఇటీవల విడుదలైన ప్రణబ్ ముఖర్జీ ఆత్మకథలో అనేక ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. తన రాజకీయ జీవితంలో తాను చూసిన అనేక అంశాలపై ప్రణబ్ సవివరంగా ఇందులో వివరించారు. ఈ క్రమంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుపై కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ఆత్మకథలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అంశాన్ని ప్రస్తావించిన ప్రణబ్ ముఖర్జీ.. తానైతే ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు జరగనిచ్చేవాడిని కాదని వ్యాఖ్యానించారు. ప్రత్యేక తెలంగాణ గురించి ప్రణబ్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సరికొత్త చర్చకు తెరలేపాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు, ప్రణబ్ ముఖర్జీకి ఎంతో సంబంధం ఉంది. ఆయన రాష్ట్రపతిగా ఉన్న సమయంలోనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది.

    ఈ కారణంగానే టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రణబ్ ముఖర్జీని అమితంగా గౌరవించేవారు. ప్రోటోకాల్ నిబంధనలను పక్కనపెట్టి.. ఆయన తెలంగాణ పర్యటనకు వచ్చిన అనేకసార్లు ఆయనకు పాదాభివందనం కూడా చేశారు. 2004లో కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ అధికారంలోకి వచ్చిన తరువాత తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై ఏర్పాటైన కమిటీకి ప్రణబ్ సారథ్యం వహించారు. యూపీఏలోని అన్ని పార్టీలను ఒప్పించి లేఖలు తీసుకురావాలని ఈ సందర్భంగా ప్రణబ్ టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు సూచించారు. దీంతో కొన్నేళ్ల పాటు శ్రమించిన కేసీఆర్.. ఈ విషయంలో అనేక పార్టీలను తెలంగాణ ఏర్పాటు కోసం ఒప్పించారు.

    ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశానికి ప్రణబ్ సానుకూలం కాదని గతంలోనూ వార్తలు వచ్చాయి. 2009 డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన ప్రకటనపై కూడా ప్రణబ్ అసంతృప్తి వ్యక్తం చేశారని కొందరు నేతలు తెలిపారు. ఒకవేళ ఆ రోజు తాను ఢిల్లీలో ఉండి ఉంటే ఆ ప్రకటన మరో విధంగా ఉండేదని ఆయన అన్నట్టు కొందరు సీమాంధ్ర నేతలు వ్యాఖ్యానించారు. ప్రణబ్‌తోపాటు నాటి ప్రధాని మన్మోహన్, ఆంటోనీ వంటి వారికి సైతం ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు విషయంలో సానుకూలంగా లేరని.. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, అహ్మద్ పటేల్, చిదంబరం మాత్రం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరగాల్సిందే అని పట్టుబట్టినట్టు వార్తలు వచ్చాయి. తాజాగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తాను సానుకూలంగా కాదని ఆత్మకథ ద్వారా ప్రణబ్ స్పష్టం చేసినట్టయ్యింది.
    Published by:Kishore Akkaladevi
    First published:

    అగ్ర కథనాలు