Home /News /national /

EX PM DEVE GOWDA UNVEILS BIOGRAPHY OF BHARAT RATNA CNR RAO BY ARVIND KUMAR BA

భారత రత్న సీఎన్ఆర్ రావు బయోగ్రఫీని ఆవిష్కరించిన మాజీ ప్రధాని దేవెగౌడ

సీఎన్ఆర్ రావు బయోగ్రఫీని ఆవిష్కరిస్తున్న మాజీ ప్రధాని దేవెగౌడ, రచయిత అరవింద్ కుమార్ (ఎడమవైపు), ప్రముఖ జర్నలిస్ట్ డీపీ సతీష్ (కుడివైపు)

సీఎన్ఆర్ రావు బయోగ్రఫీని ఆవిష్కరిస్తున్న మాజీ ప్రధాని దేవెగౌడ, రచయిత అరవింద్ కుమార్ (ఎడమవైపు), ప్రముఖ జర్నలిస్ట్ డీపీ సతీష్ (కుడివైపు)

భారత రత్న సి.ఎన్.ఆర్. రావు పై ప్రముఖ జర్నలిస్ట్, రచయిత డా. అరవింద్ యాదవ్ హిందీలో రచించిన బయోగ్రఫీని మాజీ ప్రధాన మంత్రి దేవెగౌడ బెంగళూరులో ఆవిష్కరించారు.

  భారత రత్న సి.ఎన్.ఆర్. రావు పై ప్రముఖ జర్నలిస్ట్, రచయిత డా. అరవింద్ యాదవ్ హిందీలో రచించిన బయోగ్రఫీని మాజీ ప్రధాన మంత్రి దేవెగౌడ బెంగళూరులో ఆవిష్కరించారు. సిఎన్ఆర్ రావు వంటి వాళ్ల బయోగ్రఫీని తాను విడుదల చేయడం గౌరవంగా భావిస్తున్నట్టు చెప్పారు దేవెగౌడ. ముఖ్యంగా స్ట్రక్చరల్ కెమిస్ట్రీపై ఎంతో పరిశోధన చేసి ప్రపంచంలోని వివిధ యూనివర్సిటీల డాక్టరేట్లు, వందల కొద్దీ రీసెర్చ్ పేపర్లు, పుస్తకాలు రాసిన సీఎన్ఆర్ రావు పై రాసిన పుస్తకావిష్కరణ కార్యక్రమానికి ప్రముఖ జర్నలిస్ట్ డీపీ సతీష్ కూడా హాజరై రచయితకు తన అభినందనలు తెలియజేశారు. ఈ బయోగ్రఫీలో సీఎన్ఆర్ రావుకు చెందిన ఎన్నో జీవిత విశేషాలు, ముఖ్యంగా జనబాహుళ్యానికి అంతగా తెలియని వివరాలు ఎన్నో ఉన్నాయని రచయిత అరవింద్ యాదవ్ వివరించారు. ఈ పుస్తకానికి ఇంత సంపూర్ణత్వం లభించడానికి సీఎన్ఆర్ రావు ఎంతగానో సహకరించి, చాలా సమయాన్ని వెచ్చించి తన జీవిత విశేషాలు చెప్పినట్టు రచయిత తెలిపారు. కుటుంబ సభ్యులతో పాటు సీఎన్ఆర్ రావు గారి సతీమణి, విద్యార్థులు నుంచి సేకరించిన సమాచారం ఆయన ఔన్నత్యాన్ని మరింతగా విశదీకరించేందుకు దోహదపడిందని వివరించారు రచయిత యాదవ్.

  తన జీవిత విశేషంలోని కొన్ని ముఖ్య ఘట్టాలను సీఎన్ఆర్ రావు చెబ్తూ.. "దేవుడి సహకారం ఉంటే తప్ప నేను పరిపూర్ణమైన దాన్ని ఇవ్వలేననే భావం ఏర్పడింది. ఆ దేవదేవుడి దీవెనలే నన్ను ఇలా ఉన్నతస్థాయికి నడిపించాయనే విషయాన్ని బలంగా నమ్ముత్తున్నాను. దృఢమైన విశ్వాసం, నమ్మకం దేవుడిపై ఉంచడం వల్ల మన గమ్యమేంటో మనకే తెలిసొస్తుంది. అలా అని నేను ఎప్పుడూ దేవుడిని పూజించలేదు. ఉదాహరణకు నేను ఎప్పుడూ గుడికి వెళ్లి ఇది కావాలి, ఇది ఇవ్వు అని దేవుడిని అడుక్కోలేదు. నాకు ఏదో మేలు చేయమని, అవార్డులు ఇవ్వమని అస్సలు అడగలేదు. నేను 1953లో బెనారస్ యూనివర్సిటీలో చదువు పూర్తి చేసుకుంటున్న తరుణంలో కొద్ది సమయాన్ని కాశీ విశ్వనాధ మందిరంలో గడిపే వాడిని. అక్కడ ఆయనను చూస్తున్నప్పుడు నాకు ఏ భావనా ఉండేది కాదు. నేను ఆయనను కోరిందల్లా ఒక్కటే.. నన్ను బాగా పనికొచ్చేవాడిలా తీర్చిద్దదమన్నాను, అది కూడా ముఖ్యంగా సైన్స్ రంగంలో. అప్పుడే నేను అనుకున్నాను.. అయితే శాస్త్రవేత్తే కావాలి కానీ..మరొకటి కాదు '' అనే మాటలను చెప్పినట్టు రచయిత ఈ సందర్భంగా వివరించారు.

  డాక్టర్ అరవింద్ కుమార్ రాసిన భారతరత్న డాక్టర్ సీఎన్ఆర్ రావు బయోగ్రఫీ


  లెజెండరీ సైంటిస్ట్ మరొక చేదు జ్ఞాపకాన్ని కూడా గుర్తు చేసుకున్న వైనాన్ని వివరించారు రచయిత. ''నా జీవితంలో అత్యంత బాధాకరమైన, దుఃఖపూరితమైన విషయం మా అమ్మ చనిపోవడం. ఆమెకు అప్పుడే అంతగా బాగోలేని రోజున ఓ సమావేశానికి నేను హాజరు కావాల్సి వచ్చింది. ఆ మీటింగ్‌కు జేఆర్‌డీ టాటా అధ్యక్షత వహిస్తున్నారు. ఆ ఫంక్షన్ హాల్‌లో ఆయన పక్కనే నేను కూర్చుని ఉన్నాను. మీటింగ్ జరుగుతున్న సమయంలో ఎవరో వచ్చి మా అమ్మ మరణ వార్తను నా చెవిలో చెప్పారు. అయితే నేను ఎవ్వరికీ ఈ విషయాన్ని మీటింగ్‌లో చెప్పలేదు, నా పక్కనే ఉన్న టాటాకు కూడా. మీటింగ్ ముగియగానే వెంటనే ఇంటికి పరిగెత్తాను. నా వ్యక్తిగత విషయం వల్ల ఈ మీటింగ్ మొత్తం ఇబ్బంది పడడం నాకు ఇష్టం లేదు'' అని సీఎన్ఆర్ రావు తనకు చెప్పినట్టు పుస్తకంలో రచించారు అరవింద్ యాదవ్.

  ఈ బయోగ్రఫీ త్వరలో తెలుగు, కన్నడ సహా ఇతర ముఖ్య భారతీయ భాషల్లో కూడా ప్రచురితం కాబోతోంది. ఈ విషయాన్ని తెలుసుకున్న సీఎన్ఆర్ రావు తనకు ఓ సందేశాన్ని పంపినట్టు రచయిత చెప్పారు. ''ఇతర భాషల్లో కూడా ఈ పుస్తకాన్ని అనువాదం చేయడం చాలా సంతోషంగా ఉంది, మీరు చూపిన ఈ చొరవకు అభినందలు, కృతజ్ఞతలు'' అని సీఎన్ఆర్ రావు తనకు మెసేజీ పంపారని తెలిపారు రచయిత అరవింద్ యాదవ్.

  రచయిత గురించి
  డా. అరవింద్ యాదవ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి న్యూఢిల్లీలో ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (మీడియా)గా విధులు నిర్వహిస్తున్నారు. సుదీర్ఘకాలం జాతీయ స్థాయిలో మీడియాలో పనిచేసిన ఆయన ఇప్పటికే పద్మవిభూషణ్ డా. పద్మావతి, పద్మశ్రీ పూల్‌బసన్ యాదవ్, ప్రముఖ వ్యాపారవేత్త సర్దార్ జోధ్ సింఘ్ బయోగ్రఫీలు కూడా రచించారు. ఇప్పటివరకూ ఆయన 20 పుస్తకాలను రచించారు.
  Published by:Ashok Kumar Bonepalli
  First published:

  Tags: Bengaluru, Bharat Ratna, Karnataka

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు