హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

మాజీ గవర్నర్, సీబీఐ మాజీ డైరెక్టర్ ఆత్మహత్య

మాజీ గవర్నర్, సీబీఐ మాజీ డైరెక్టర్ ఆత్మహత్య

అశ్విని కుమార్ (file Image Credit; DD News/Twitter)

అశ్విని కుమార్ (file Image Credit; DD News/Twitter)

అశ్విని కుమార్ 2008 ఆగస్టు 2 నుంచి 2010 నవంబర్ 30 వరకు రెండు సంవత్సరాల పాటు ఆయన సీబీఐ డైరెక్టర్‌గా పనిచేశారు. 2013 మార్చి 21న నాగాలాండ్‌కు 17వ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టారు.

    నాగాలాండ్ మాజీ గవర్నర్, సీబీఐ మాజీ డైరెక్టర్ అశ్విని కుమార్ ఆత్మహత్య చేసుకున్నారు. సిమ్లాలో ఆయన తన ప్రాణాలు తీసుకున్నారు. అశ్విని కుమార్ ఆత్మహత్య విషయాన్ని సిమ్లా ఎస్పీ మోహిత్ చావ్లా ధ్రువీకరించారు. అశ్విని కుమార్ మృతదేహం ఆయన నివాసంలో సీలింగ్‌కు వేలాడుతూ కనిపించింది. ఆయన వయసు 62 సంవత్సరాలు. అశ్విని కుమార్ చాలా ఉన్నత స్థానాల్లో పనిచేశారు. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోనూ, కేంద్ర ప్రభుత్వంలోనూ ఉన్నత పదవులను అలంకరించారు. అశ్విని కుమార్ 1973వ సంవత్సరంలో ఐపీఎస్‌లో జాయిన్ అయ్యారు. 2006 నుంచి 2008 వరకు హిమాచల్ ప్రదేశ్ డీజీపీగా సేవలు అందించారు. 2008 ఆగస్టు 2 నుంచి 2010 నవంబర్ 30 వరకు రెండు సంవత్సరాల పాటు ఆయన సీబీఐ డైరెక్టర్‌గా పనిచేశారు. 2013 మార్చి 21న నాగాలాండ్‌కు 17వ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టారు. అలాగే, 2013 జూలై 29న మణిపూర్ గవర్నర్‌గా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. గవర్నర్‌గా తప్పుకున్న తర్వాత ఏపీ గోయల్ యూనివర్సిటీలో ప్రొటెమ్ చాన్సలర్‌గా, ఆ తర్వాత చాన్స్‌లర్‌గా కూడా ఆయన పనిచేశారు. స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్‌లో కూడా ఆయన కీలక పదవులు నిర్వహించారు. మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ భద్రతా విభాగంలో ఆయన కూడా ఒకరు. హిమాచల్ ప్రదేశ్‌లోని సిర్మోర్ అనే చిన్న పట్టణం నుంచి వచ్చిన అశ్విని కుమార్ హిమాచల్ ప్రదేశ్ యూనివర్సిటీలో చదువుకున్నారు.

    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    Tags: CBI

    ఉత్తమ కథలు