EWS RESERVATIONS PIL FILED AGAINST EBC RESERVATION IN SUPREME COURT
ఈబీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిల్..ఏం జరగబోతోంది?
సుప్రీంకోర్టు
ఈబీసీలకు 10 శాతం రిజర్వేషన్లు కలుపుకుంటే మొత్తం రిజర్వేషన్లు 59.5 శాతానికి చేరుతాయి. ఆర్థికంగా బలహీన వర్గాలకు రిజర్వేషన్ బిల్లుతో దేశంలోని వైశ్య, కమ్మ, కాపు, రెడ్డి, క్షత్రియ, బ్రాహ్మణులు, జాట్లు, మరాఠాలు సహా పలు సామాజిక వర్గాల్లోని పేద ప్రజలకు లబ్ధి చేకూరుతుంది.
ఈబీసీ బిల్లు అతి త్వరలోనే చట్టరూపం దాల్చనుంది. ఉభయ పార్లమెంట్ సభల్లో ఆమోదం పొందిన ఈబీసీ బిల్లును రాష్ట్రపతి ఆమోదించాల్సి ఉంది. అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్ కల్పించడాన్ని మెజార్టీ వర్గాలు స్వాగతించగా..కొన్ని వర్గాల నుంచి మాత్రం తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ క్రమంలోనే ఈబీసీ రిజర్వేషన్ బిల్లుకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిల్ దాఖలైంది. ఆర్థిక బలహీన వర్గాలకు కోటా ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధమని పిటిషన్లో పేర్కొన్నారు. యూత్ ఫర్ ఈక్వాలిటీ అనే సంస్థ ఈ పిల్ దాఖలు చేసింది.
విద్య, ఉద్యోగాల్లో అగ్రవర్ణ పేదలకు 10శాతం రిజర్వేషన్లు కల్పించడానికి ఉద్దేశించిన 124 రాజ్యాంగ సవరణ బిల్లుకు పార్లమెంట్ ఉభయ సభల ఆమోదం తెలిపాయి. మంగళవారం లోక్సభలో 323 మంది సభ్యులు రాజ్యాంగ సవరణ బిల్లుకు మద్దతిచ్చారు. కేవలం ముగ్గురు మాత్రమే వ్యతిరేకంగా ఓటువేశారు. బుధవారం రాజ్యసభలో 167 మంది అనుకూలంగా ఓటు వేయగా, ఏడుగురు వ్యతిరేకంగా ఓటువేశారు. కేంద్రమంత్రి వర్గం ఆమోదించిన రెండు రోజుల్లోనే చట్టసభల్లో చర్చ జరిగి బిల్లుకు ఆమోదముద్ర పడడం విశేషం.
ప్రస్తుతం దేశంలో ఎస్సీ,ఎస్టీ, బీసీలకు కలిపి 49.5శాతం రిజర్వేషన్లు ఉన్నాయి. ఈబీసీలకు 10 శాతం రిజర్వేషన్లు కలుపుకుంటే మొత్తం రిజర్వేషన్లు 59.5 శాతానికి చేరుతాయి. ఆర్థికంగా బలహీన వర్గాలకు రిజర్వేషన్ బిల్లుతో దేశంలోని వైశ్య, కమ్మ, కాపు, రెడ్డి, క్షత్రియ, బ్రాహ్మణులు, జాట్లు, మరాఠాలు సహా పలు సామాజిక వర్గాల్లోని పేద ప్రజలకు లబ్ధి చేకూరుతుంది.
రూ.8లక్షల లోపు వార్షికాదాయం ఉన్న అగవర్ణ పేదలు ఈబీసీ కోటాకు అర్హులు. అంతేకాదు 5 ఎకరాల లోపు మాత్రమే వ్యవసాయ భూమి ఉండాలి. 1000 చ.అడుగులు లోపే ఇల్లు ఉండాలి. రెసిడెన్షియల్ ప్లాట్ (మున్సిపాలిటీ) 109 చదరపు గజాల లోపు ఉండాలి. అదే నాన్ మున్సిపాలిటీ ప్రాంతాల్లో 209 చదరపు గజాల్లోపు ఉందాలి. అలాంటి పేద అగ్రవర్ణ ప్రజలకు మాత్రమే ఈ రిజర్వేషన్ వర్తిస్తుంది. ఐతే రిజర్వేషన్లు 50శాతానికి మించికూడదన్న సుప్రీంకోర్టు నిబంధనల నేపథ్యంలో...ఈబీసీ రిజర్వేషన్ చెల్లదని కోర్టులో తాజాగా పిల్ దాఖైంది.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.