హోమ్ /వార్తలు /జాతీయం /

'ఈవీఎం'ను ఫుట్‌బాల్‌లా ఆడుకుంటున్నారు...విపక్షాలపై ఈసీ సెటైర్లు

'ఈవీఎం'ను ఫుట్‌బాల్‌లా ఆడుకుంటున్నారు...విపక్షాలపై ఈసీ సెటైర్లు

పలు అంశాలను పరిగణలోకి తీసుకుని ఆరు లేదా ఏడు విడతల్లో వచ్చే లోక్‌సభ ఎన్నికలను నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

పలు అంశాలను పరిగణలోకి తీసుకుని ఆరు లేదా ఏడు విడతల్లో వచ్చే లోక్‌సభ ఎన్నికలను నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఈవీఎం వ్యవహారంపై మరోసారి హాట్ కామెంట్స్ చేసింది ఈసీ. ఈవీఎంలను ఫుట్‌బాల్‌లా ట్రీట్ చేస్తున్నారని విపక్షాలపై సెటైర్లు వేశారు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సునీల్ అరోరా. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని స్పష్టంచేశారు.

    లోక్‌సభ ఎన్నికల వేళ దేశ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. కొన్ని రోజులుగా ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి విపక్షాలు. బ్యాలెట్ పేపర్ విధానంలో పాత పద్దతిలోనే ఎన్నికలు నిర్వహించాలంటూ డిమాండ్ చేస్తున్నాయి. ఐతే ఆయా పార్టీల విమర్శలను కేంద్ర ఎన్నికల సంఘం ఎప్పటికప్పుడు తిప్పికొడుతూ వస్తోంది. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయలేమని..బ్యాలెట్ విధానంలో ఓటింగ్ నిర్వహించలేమి స్పష్టంచేస్తూ వస్తోంది. ఈ క్రమంలో ఈవీఎం వ్యవహారంపై మరోసారి హాట్ కామెంట్స్ చేసింది ఈసీ. ఈవీఎంలను ఫుట్‌బాల్‌లా ట్రీట్ చేస్తున్నారని విపక్షాలపై సెటైర్లు వేశారు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సునీల్ అరోరా. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని స్పష్టంచేశారు.


    రెండు దశాబ్ధాలుగా ఈవీఎంలను వాడుతున్నాం. 2014 ఎన్నికలను పరిగణలోకి తీసుకుందాం. లోక్‌సభ ఎన్నికలు జరిగిన 4 నెలలకు ఢిల్లీ ఎన్నికలు జరిగాయి. ఆ రెండింటి ఫలితాలు విభిన్నంగా ఉన్నాయి. మనకు తెలిసో తెలియకో .. ఈవీఎంలను ఫుట్‌బాల్ చేసి ఆడుకుంటున్నాం. రిజల్ట్ X అయితే ఓకే. అదే రిజల్ట్ Y అయితే ఈవీఎంలలో లోపాలు ఉన్నాయని అంటున్నారు.
    సునీల అరోరా

    లోక్‌సభ ఎన్నికల్ల సన్నాహాల్లో భాగంగా ఉత్తర్ ప్రదేశ్‌లో పర్యటిస్తున్నారు సునీల్ అరోరా. ఈ సందర్భంగా విపక్షాల విమర్శలకు కౌంటర్ ఇచ్చారు. ప్రజల మనోభావాలను అర్ధం చేసుకొని వీవీప్యాట్ స్లిప్స్ సదుపాయం కూడా కల్పించామని అన్నారు. ఈవీఎంలను అత్యంత సురక్షితమైన ECIL,BEL కంపెనీలు తయారుచేస్తున్నాయని పేర్కొన్నారు. ఆయా కంపెనీల్లో అద్భుతమైన శాస్త్రవేత్తలు ఉన్నారని..ఈవీఎంలపై అనుమానాలు అవసరం లేదని స్పష్టం చేశారు.

    First published:

    Tags: Election Commission of India, Evm tampering, Lok Sabha Election 2019

    ఉత్తమ కథలు